Best Web Hosting Provider In India 2024
16 Sep 2024 10:30 AM
బాబు అక్రమ నివాసాన్ని కూల్చాల్సిందే
వైయస్ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి
తాడేపల్లి: కృష్ణానది కరకట్టపై చట్ట విరుద్ధంగా నిర్మించిన ఇంట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసముంటున్నారని వైయస్ఆర్‌సీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి అన్నారు. పర్యావరణ సున్నిత ప్రాంతంలో సీఆర్‌జెడ్ నిబంధనలు విరుద్ధంగా ఇంటి నిర్మాణం అక్రమమని, ఆ ఇంటిని కూల్చాల్సిందే అంటూ విజయసాయిరెడ్డి ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
‘‘ఈ అక్రమ నిర్మాణాలను తక్షణమే కూల్చివేయాలి. లేదంటే కృష్ణా, గుంటూరు జిల్లా ప్రజల ఆస్తిపాస్తులకు తీవ్ర ప్రమాదం. సీఆర్‌జెడ్ నిబంధనలు అమలు చేయడంలో శాసన వ్యవస్థ, ప్రభుత్వ యంత్రాంగం విఫలమయ్యాయి. న్యాయవ్యవస్థ తక్షణమే జోక్యం చేసుకొని లక్షలాదిమంది ప్రజలను, వారి ఆస్తులను రక్షించాలి’’ అని విజయసాయిరెడ్డి ట్వీట్‌లో పేర్కొన్నారు.