Best Web Hosting Provider In India 2024
Gundeninda Gudigantalu Serial Today Episode: గుండెనిండా గుడిగంటలు సీరియల్ నేటి ఎపిసోడ్‌లో శ్రుతికి పెళ్లి చూపులు జరుగుతాయి. ఇంలో సంజు ఎంట్రీ ఇస్తాడు. శ్రుతి నువ్వు చిన్నప్పుడు మంచి క్లోజ్ ఫ్రెండ్స్ అని, ఎవరైనా శ్రుతిని ఏడిపిస్తే.. నువ్ ఆ పిల్లలను గట్టిగా బెదిరించేవాడివి అని శోభన అంటుంది. ఇప్పుడెవరైనా వెంటబడితే.. ఏకంగా షూట్ చేసి పడేస్తాను ఆంటీ అని సంజు అంటాడు.
సంజుతో మాట్లాడమని
దాంతో అంతా షాక్ అవుతారు. జోక్ చేశాను అని సంజు అంటాడు. శ్రుతి నా మనిషి అని తెలిస్తే.. ఎవరు వెంటపడరు అని సంజు అంటాడు. పూజ అన్నావ్. ఆ ఏర్పాట్లు ఏవి ఎక్కడ కనిపించట్లేదని శ్రుతి అంటుంది. ముందుంది అని శోభన అంటుంది. తర్వాత సంజుతో మాట్లాడమని బలవంతంగా శ్రుతిని పంపిస్తారు. మరోవైప ప్రభావతి దగ్గరికి కామాక్షి వస్తుంది. లిప్‌స్టిక్ బాగుందా అని మూతు ముందుకు పెట్టి అడుగుతుంది కామాక్షి.
బాగుంది.. కోతు మూ.. అని అనబోయి.. కోతి మూతిలా ఉంది అని ప్రభావతి అంటుంది. ఇది బాగుందని అందా.. లేదని అందా అని అయోమయపడుతుంది కామాక్షి. పెళ్లి చూపులు అంటే ఎంతో హడావిడు ఉంటుంది. నువ్ ఇప్పుడా రావడం అని ప్రభావతి అంటుంది. అవన్ని చూసేందుకు మీనా ఉంది కదా అని కామాక్షి అంటే.. మీనాను పిలిచి ఇల్లు తుడిచావా అని అడుగుతుంది ప్రభావతి. అద్దంలా తుడిచాను. చూడకుండా అంటారేంటీ అని మీనా అంటుంది.
పెళ్లి చూపులకు వచ్చినవాళ్ల ముందు నోరు తెరవద్దు అని మీనాకు ప్రభావతి వార్నింగ్ ఇస్తుంది. తర్వాత బాలుగాడిని ఇంట్లో ఉండకూడని చెప్పాగా. వాడు ఏదోటి అని పెళ్లి చూపులు చెడగొడతాడు అని ప్రభావతి అంటుంది. ఆయన తమ్ముడు పెళ్లి చూపులు ఆయనెందుకు చెడగొడతారు. ఏదైనా ఉంటే మీ కొడుకుతో మాట్లాడండి అని వెళ్లిపోతుంది మీనా. మీనా చెల్లెలు సుమతితో రవి తిరుగుతున్నాడన్నది బాలుకు చెప్పావా అని కామాక్షి అంటుంది.
సూట్ అవుతుందా
దాంతో కామాక్షి నోరు మూసి అది తెలిస్తే నా పీక మీది కత్తి పెట్టి బాలుగాడు పెళ్లి చేయిస్తాడు. అందుకేగా సైలెంట్‌గా ఇలా పెళ్లి చూపులు అరెంజ్ చేశాను అని ప్రభావతి అంటుంది. ఇంతలో మనోజ్, రోహిణి వస్తారు. నీకు అంత ఆస్తి ఉన్న ఫ్రెండ్ ఉందని నాకెందుకు చెప్పలేదని మనోజ్ అంటే.. ఎందుకు నువ్ పెళ్లి చేసుకునేవాడివా అని కామాక్షి అంటుంది. కాదు. రవిగాడు రెస్టారెంట్‌లో వంట చేసుకుంటాడు. అంత గొప్ప సంబంధం వాడికి సూట్ అవుతుందా అని మనోజ్ అంటాడు.
వాడు అదైనా చేస్తున్నాడు.. మరి నువ్వు అని కామాక్షి అంటుంది. దాంతో కామాక్షి కాలు తొక్కుతుంది ప్రభావతి. తర్వాత ఇద్దరూ కవర్ చేస్తారు. వియ్యానికైనా కయ్యానికైన సమానంగా ఉండాలి కదా. రవిగాడికి అంత గొప్ప సంబంధం అవసరమా అని మనోజ్ అంటాడు. ఇంతలో వచ్చిన బాలు సెటైర్లు వేస్తాడు. ఈ వాగుడు వాగుతావనే ఇంట్లో ఉండొద్దన్నాను. నువ్ వెళ్లిపో అని ప్రభావతి అంటుంది. నేనేం తప్పు చేశానని వెళ్లాలి. ఏ విషయం గురించి బయటపడుతుంది అని జరిగినవన్నీ చెబుతాడు బాలు.
అవి విని కామాక్షి షాక్ అవుతుంది. ఆపమని ప్రభావతి అంటుంది. ఏదైనా చెప్పు కానీ మీ అమ్మను తాళం వేసిన విషయం చెప్పకు అని కామాక్షి అంటుంది. దాంతో నెత్తి బాదుకుంటుంది ప్రభావతి. బాలు వెళ్లిపోతాడు. కిచెన్‌లోకి వెళ్లి స్వీట్ టేస్ట్ చేస్తాడు బాలు. మీకు పుణ్యం ఉంటుందండి. వచ్చినవాళ్లముందు నోరుజారకండని మీనా అడుగుతుంది. ట్రై చేస్తాను అని బాలు వెళ్లిపోతాడు. మరోవైపు సంజుకు వెనుక నుంచి శ్రుతి తగులుతుంది. దాంతో షాక్ అయి చూస్తుంది.
సర్‌ప్రైజ్ ఇచ్చారా
హేయ్.. భయపడింది.. భయపడింది అని సంజు అంటాడు. నేనేం భయపడలేదని శ్రుతి అంటుంది. పెళ్లికి ముందే నా మీద ఇలాపడటం నాకు ఓకే.. నీకు ఓకేనా అని సంజు అడుగుతాడు. దాంతో మరింత షాక్ అవుతుంది శ్రుతి.పెళ్లా. ఈ తింగరోడు పెళ్లి అంటాడేంటీ అని మనసులో అనుకుంటుంది శ్రుతి. నాకు నిన్నే తెలిసింది. యావరేజ్‍గా ఉంటావనుకున్నా. పర్లేదు. నాకు సూటయ్యే ఫేసే అని సంజు అంటాడు. ఇదంతా నాకు తెలియదు. నాకు పూజ అని చెప్పి తీసుకొచ్చారు అని శ్రుతి అంటుంది.
హో.. నీకు సర్‌ప్రైజ్ ఇచ్చారా. ఇంత రిచ్ ఫ్యామిలీలోకి కోడలిగా వస్తావని కలలో కూడా అనుకోలేదు కదా అని సంజు అంటాడు. నువ్వేదో డబ్బింగ్ చేస్తుంటావట కదా. ఇక అదంతా అవసరమే లేదు. మా కుక్కల ఫీడింగ్‌కు మేమెంత ఖర్చు చేస్తామో తెలుసా అని సంజు అంటాడు. డబ్బింగ్ అన్నది నా ప్యాషన్. మా ఇంట్లో మొక్కలకు నా మనీతోనే ఎరువేస్తాం. మా ఇంట్లో కుక్కలు ఉండవు. మనుషులే ఉంటారు అని శ్రుతి అంటుంది.
డబ్బు ఉంటేనేకదా కుక్కలు ఉండేవి. మా నాన్న బిజినెస్ నేనే చూసుకుంటాను. ఇంపోర్ట్ అండ్ ఎక్స్‌పోర్ట్. గోల్డ్, వెపన్, బ్లాక్ మార్కెట్‌లో దొరికే ఏదైనా మేము ఎక్స్‌పోర్ట్ చేస్తాం అని సంజు అంటే.. దాన్ని స్మగ్లింగ్ అంటారని అనుకుంటా అని శ్రుతి అంటుంది. ఎవరేం పేరు పెట్టుకుంటే మాకేంటి. మాకు మాత్రం డబ్బే ముఖ్యం అని తనకు ఓ గిఫ్ట్ తెచ్చానని వెళ్తాడు సంజు. మా అమ్మనాన్న ఇంత మోసం చేస్తారా. ఈ తింగరోడు ఎలా నచ్చాడు. డబ్బుంటే చాలా. ఈ విషయం అర్జంట్‍గా రవికి చెప్పాలి అని శ్రుతి అనుకుంటుంది.
కాలిస్తే చచ్చిపోవాల్సిందే
సంజు వచ్చి గన్‌ను శ్రుతికి గిఫ్ట్‌గా ఇస్తాడు. మా ఫ్యామిలీలోకి వస్తున్నావ్ కదా ఉపయోగపడుతుందని సంజు అంటాడు. వద్దని శ్రుతి చెబుతున్నా సంజు ఇవ్వబోతుంటే.. ముందుకు నెడుతుంది. దాంతో గోడకు ఆనుతాడు సంజు. కోపం తెచ్చుకుంటాడు. సారీ అని శ్రుతి చెబుతుంది. దాంతో శ్రుతి తలకు గన్ గురి పెడతాడు సంజు. దాన్ని అన్‌లాక్ చేసి.. నేను చాలా మొండివాన్ని. నాకు ఎవరు అడ్డు రావొద్దు. అడ్డు చెప్పొద్దు. నేను కాలిస్తే చచ్చిపోవాల్సిందే అని సంజు అంటాడు.
కాల్చినట్లు చేస్తాడు సంజు. దాంతో పక్కకు తప్పుకున్న శ్రుతి చూస్తుంది. అది చూసి సంజు నవ్వుతాడు. హేయ్.. భయపడింది.. భయపడింది.. జస్ట్ సరదాగా చేశాను. బుల్లెట్స్ లోడ్ చేయలేదు అని సంజు అంటాడు. నాకు ఇలాంటివి ఇష్టం లేదని శ్రుతి అంటే.. సరే. గన్‌లాంటి మొగుడుని నేనుండగా.. ఇదెందుకు. మనం హనీమూన్‌కు ఎక్కడికి వెళ్దామని సంజు అడుగుతాడు. దాంతో ఫోన్ వచ్చినట్లు, అర్జంట్‌గా వెళ్లాలని శ్రుతి చెప్పి వెళ్లిపోతుంది.
మరోవైపు పెళ్లి చూపుల వాళ్ల కోసం ఎదురుచూస్తుంటుంది ప్రభావతి. వాళ్లు చాలా కోటీశ్వరులు అని చెబుతుంది. ఇంతలో వాళ్లు వస్తారు. అయ్యయ్యో.. ఎన్ని నగలో.. వాటితో పోల్చితే.. కామాక్షి నీవి నగలే కాదు అని ప్రభావతి అంటుంది. ప్రభావతి, తన ఫ్రెండ్ మాట్లాడుకుంటారు. మా ఆయన నారాయణ రాజు, మా అబ్బాయి గోపి.. అమ్మాయి వల్లి అని పరిచయం చేసిన ధనం.. ఈవిడ ఎవరు మీ అత్తయ్య అని కామాక్షిని అంటుంది. దాంతో నవ్వుకుంటారు.
నా భార్య కంటే అందంగా
షాక్ అయిన కామాక్షి నేను మీలాగే ఫ్రెండ్‌ను తనకంటే నాలుగేళ్లు చిన్నదాన్ని అని అంటుంది. మా ప్రభా గ్లామరే వేరు. పదహారేళ్ల వయసు సినిమాలో శ్రీదేవిలా ఉంటుందని ధనం అంటుంది. దాంతో బాలుకు పొలమారుతుంది. ప్రభావతి మురిసిపోతుంది. పోనీలే వీళ్లు ఆస్తిపరులు అయినా.. రవిగాడి కాబోయే భార్య నా భార్య కంటే అందంగా లేదని మనోజ్ అంటాడు. తర్వాత మనోజ్ నాలుగు కారు షో రూమ్‌లకు పార్టనర్‌గా ఉంటున్నాడు అని చెబుతుంది ప్రభావతి.
మరి ఇంటి ముందు ఒక్కకారు లేదేంటి అని ధనం భర్త అంటాడు. డ్రైవర్‌ను ఫ్రూట్స్ తెమ్మని పంపించాను అని ప్రభావతి కవర్ చేస్తుంది. అలా రోహిణి గురించి కూడా చాలా గొప్పగా చెబుతుంది. సిటీకి ఒక బ్యూటి పార్లర్ బ్రాంచ్‌లు ఉన్నాయని అంటుంది. తర్వాత బాలు కారు అని చెప్పబోతుంటే.. వీడు క్యాబ్ ట్రావెల్ రన్ చేస్తుంటాడు అని చెబుతుంది ప్రభావతి. అయ్యో నా కారులో పెట్రోల్ కొట్టించలేదని బాలు అంటే.. జోకులు వేయకురా డ్రైవర్‌ను పంపిద్దామని ప్రభావతి అంటుంది.
బస్సు డ్రైవారా. ఆయన రిటైర్ అయ్యారుకదా అని బాలు అంటాడు. బస్సు డ్రైవర్ ఏంటీ అని ధనం భర్త అడుగుతాడు. ప్రభావతి వీడు బాగా జోకులు వేస్తాడని చెబుతుంది. తర్వాతి ఎపిసోడ్‌లో రవి, కూతురు మౌనిక గురించి అబద్ధాలు చెబుతుంది ప్రభావతి. దాంతో ఆపమ్మా.. ఇప్పటికే లక్ష అబద్ధాలు చెప్పావ్ అని బాలు అంటాడు. అంటే అన్నీ భోగస్ మాటలా. మీ ఆయన చాతకాని వాడా. పిల్లలను ఎలా పెంచాలో కూడా తెలియను చేతకాని వాడా అని ధనం భర్త అంటాడు. దాంతో ధనం భర్తను కొడతాడు బాలు.
Best Web Hosting Provider In India 2024
Source / Credits