Rampachodavaram : ఇదేం పైశాచికత్వం.. విద్యార్థినులతో రోజూ 200 గుంజీలు తీయించిన ప్రిన్సిపల్!

Best Web Hosting Provider In India 2024


విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ప్రిన్సిపల్.. పైశాచికత్వం ప్రదర్శించారు. క్రమశిక్షణ పేరుతో క్రూరంగా వ్యవహరించారు. ఫలితంగా పదుల సంఖ్యలో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం ఏపీఆర్ బాలికల జూనియర్ కాలేజీలో ఈ ఘటన జరిగింది. దీనిపై పిల్లల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ప్రిన్సిపల్, పీడీ కలిసి..

కాలేజీలో ఇంటర్‌ ఫస్ట్, సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థినులు.. తాము చెప్పిన మాట వినడం లేదని ప్రిన్సిపల్‌ ప్రసూన, పీడీ కృష్ణకుమారి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో శుక్రవారం నుంచి వారితో రోజుకు 100 నుంచి 200 వరకు గుంజీలు తీయించారు. ఇలా వరుసగా మూడు రోజులు చేయించారు. దీంతో 50 మంది వరకు విద్యార్థినులు కాళ్ల నొప్పులతో అస్వస్థతకు గురయ్యారు.

తల్లిదండ్రులకు చెప్పడంతో..

కొంతమంది విద్యార్థినులు ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పగా.. వారు వెంటనే కాలేజీకి వచ్చి పిల్లలను స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థినులు చికిత్స పొందుతున్నారు. కోలుకున్న వారిని ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జ్‌ చేశారు. మరికొందరు విద్యార్థినులు ఇంకా ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు.

ఎమ్మెల్యే సీరియస్..

ఈ ఘటనపై ఎమ్మెల్యే శిరీషాదేవి ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రమశిక్షణ పేరుతో విద్యార్థినులను గుంజీలు తీయించడం దారుణం అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై విచారణ చేపట్టాలని ఐటీడీఏ పీవోను కోరారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినులతో ఎమ్మెల్యే మాట్లాడారు. ఏదైనా సమస్య ఉంటే తనకు చెప్పాలని విద్యార్థినులకు సూచించారు.

లోకేష్ స్పందించాలి..

విద్యార్థినుల పట్ల క్రూరంగా వ్యవహరించిన ప్రిన్సిపల్‌ ప్రసూన, పీడీ కృష్ణకుమారిపై చర్యలు తీసుకోవాలని పిల్లల తల్లిదండ్రులు కోరుతున్నారు. వారిని విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖ మంత్రి లోకష్ దీనిపై స్పందించి.. చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

టాపిక్

EducationStudentsEast GodavariNara LokeshAndhra Pradesh NewsCrime ApCrime NewsTrending ApViral Ap

Source / Credits

Best Web Hosting Provider In India 2024