Revanth Reddy Grandson : వినాయకుడి నిమజ్జనంలో డాన్స్ అదరగొట్టిన రేవంత్ రెడ్డి మనవడు!

Best Web Hosting Provider In India 2024


ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మనవడు రేయాన్ష్ రెడ్డి తీన్‌మార్ డ్యాన్స్‌తో అదరగొట్టాడు. సీఎం రేవంత్ ఇంట్లో గణపతిని ప్రతిష్టించారు. ఆ గణపతిని సోమవారం రాత్రి నిమజ్జనానికి తరలించారు. ఈ సందర్భంగా రేయాన్ష్ రెడ్డి డ్యాన్స్ చేశారు. తన మనవడు డ్యాన్స్ చేస్తుండగా.. సీఎం రేవంత్, ఆయన సతీమణి ఆసక్తిగా చూశారు. ఎంకరేజ్ చేశారు. వేం నరేందర్ రెడ్డి, సినీ, రాజకీయ ప్రముఖులు ఈ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్నారు.

మహా గణపతి నిమజ్జనానికి రేవంత్..

గణేష్‌ నిమజ్జనంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. ప్రజా పాలన కార్యక్రమం పూర్తి అవ్వగానే.. మహాగణపతి నిమజ్జనానికి హాజరుకానున్నారు. ఇందుకు సంబంధించి పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. అటు ఖైరతాబాద్‌ మహాగణపతి శోభాయాత్ర కొనసాగుతుంది. శోభాయాత్ర మార్గంలో 56 సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. 700 మంది పోలీసులతో భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నానికి క్రేన్-4దగ్గరికి చేరుకోనున్నారు మహా గణేశుడు. ఎన్టీఆర్ మార్గ్‌లోని క్రేన్‌-4 దగ్గర మహాగణపతి నిమజ్జనం జరగనుంది.

ఈ ఏడాది ఆదాయం రూ.1.10 కోట్లు..

మధ్యాహ్నం 1:30 వరకు మహా గణపతి నిమజ్జనం పూర్తి అవుతుందని హైదరాబాద్ పోలీసులు చెబుతున్నారు. రెండు గంటల్లో నిమజ్జనం పూర్తి చేసేలా ఏర్పాట్లు చేసినట్టు వివరించారు. ఈ ఏడాది ఖైరతాబాద్ గణేశుడి ఆదాయం రూ.1.10 కోట్లు వచ్చినట్టు ఉత్సవ కమిటీ తెలిపింది. ఖైరతాబాద్‌ గణేశుడి హుండీ ఆదాయం రూ.70 లక్షల ఆదాయం వచ్చినట్టు వెల్లడించింది. సీసీ కెమెరాల నిఘాలో లెక్కింపు ప్రక్రియ చేపట్టారు.

షరతులు వర్తిస్తాయి..

కాసేపట్లో బాలాపూర్‌లో లడ్డూ వేలం ప్రక్రియ ప్రారంభం కానుంది. బాలాపూర్ గణేశ్ లడ్డూ వేలం 30 ఏళ్లు పూర్తిచేసుకుంది. లడ్డూ వేలం పాటలో ఈసారి కొత్త నిబంధన పెట్టారు. పోటీదారులు ముందుగా డబ్బు డిపాజిట్‌ చేయాలని షరతు విధించారు. ఈ ఏడాది లడ్డూ రూ.30 లక్షలు పలుకుతుందని అంచనా వేస్తున్నారు. ఈసారి బాలాపూర్ లడ్డూ వేలంలో 23 మంది పాల్గొననున్నారు. లడ్డూ వేలం చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు.

టాపిక్

Vinayaka ChavithiRevanth ReddyKhairatabad Assembly ConstituencyTelangana NewsViral TelanganaTrending Telangana

Source / Credits

Best Web Hosting Provider In India 2024