Manjummel Boys TV Premier Date: టీవీలోకి వచ్చేస్తున్న బ్లాక్‌బస్టర్ మలయాళం సర్వైవల్ థ్రిల్లర్ మూవీ

Best Web Hosting Provider In India 2024


Manjummel Boys TV Premier Date: మలయాళం సినిమా ఇండస్ట్రీలో ఓ సరికొత్త చరిత్రకు నాంది పలికిన సినిమా మంజుమ్మెల్ బాయ్స్. ఈ ఏడాది ఫిబ్రవరి 22న థియేటర్లలో రిలీజై.. ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లు సాధించిన ఈ మూవీ ఏడు నెలల తర్వాత టీవీ ప్రీమియర్ కు సిద్ధమైంది. థియేటర్లలోనే కాదు తర్వాత ఓటీటీలోనూ ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేసింది.

మంజుమ్మెల్ బాయ్స్ టీవీ ప్రీమియర్ డేట్

మలయాళం సర్వైవల్ థ్రిల్లర్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన మంజుమ్మెల్ బాయ్స్ టీవీలోకి రాబోతోంది. వచ్చే ఆదివారం (సెప్టెంబర్ 22) సాయంత్రం 6.30 గంటలకు స్టార్ మాలో ఈ సినిమా టెలికాస్ట్ కానుంది. ఈ విషయాన్ని సదరు ఛానెల్ వెల్లడించింది.

ఈ మూవీ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పుడు స్టార్ మాలోకే సినిమా రానుండటం విశేషం.

మంజుమ్మెల్ బాయ్స్ గురించి..

స‌ర్వైవ‌ల్ జోన‌ర్ హాలీవుడ్‌లో చాలా ఫేమ‌స్‌. ఈ జోన‌ర్‌లో హాలీవుడ్‌లో రెగ్యుల‌ర్‌గా సినిమాలు రూపొందుతోంటాయి. ఇండియ‌న్ స్క్రీన్‌పై మాత్రం స‌ర్వైవ‌ల్ మూవీస్ రావ‌డం అరుద‌నే చెప్పుకోవాలి. అలాంటి అరుదైన జోన‌ర్‌లో వ‌చ్చిన సినిమానే మంజుమ్మెల్ బాయ్స్‌. 2006లో జ‌రిగిన య‌థార్థ ఘ‌ట‌న‌ల ఆధారంగా ద‌ర్శ‌కుడు చిదంబ‌రం ఈ మూవీని తెర‌కెక్కించాడు.

వందలాది అడుగుల లోతైన లోయ‌లో ప‌డిన ఓ యువ‌కుడిని అత‌డి స్నేహితులు ప్రాణాల‌కు తెగించి ఎలా కాపాడారు అన్న‌దే ఈ సినిమా మెయిన్ స్టోరీలైన్. సింపుల్ పాయింట్‌తో రియ‌లిస్టిక్‌గా ఈ సినిమాను తెర‌కెక్కించాడు డైరెక్ట‌ర్‌. న‌టీన‌టుల యాక్టింగ్‌, విజువ‌ల్స్‌, బీజీఎమ్ ఈ సినిమాకు ప్రాణం పోశాయి.

షౌబిన్ షాహిర్‌తో పాటు మిగిలిన పాత్ర‌ధారులది యాక్టింగ్ అన్న అనుభూతి ఎక్క‌డ క‌ల‌గ‌దు. రియ‌ల్‌లైఫ్‌లో యూత్ గ్యాంగ్ ఎలా ఉంటారు, వాళ్ల అల్ల‌రి ప‌నులు, గొడ‌వ‌లు, వారి మ‌ధ్య ఉండే అనుబంధాన్ని ప్ర‌తి ఒక్క‌రికి క‌నెక్ట్ అయ్యేలా చాలా స‌హ‌జంగా మంజుమ్మెల్ బాయ్స్‌లో చూపించారు.

గుణ కేవ్ సెట‌ప్ ఈ సినిమాకు పెద్ద ప్ల‌స్ పాయింట్‌గా మారింది. క‌మ‌ల్ క‌ల్ట్ సినిమా నేప‌థ్యాన్ని, ఆ సినిమాలోని క‌మ్మ‌ని నీ ప్రేమ లేఖ‌లే అన్న పాట‌ను, బీజీఎమ్‌ను ద‌ర్శ‌కుడు చ‌క్క‌గా వాడుకున్నాడు.

ఈ సినిమాలో హీరోలు అంటూ ఎవ‌రూ లేరు. ప్ర‌తి పాత్ర‌కు స‌మాన‌మైన ఇంపార్టెన్స్ ఉంటుంది. వీరిలో షౌబీన్ షాహీర్ ఎక్కువ‌గా గుర్తుండిపోతాడు. అత‌డి న‌ట‌న ఆక‌ట్టుకుంటుంది. మిగిలిన ఫ్రెండ్స్ బ్యాచ్‌ యాక్టింగ్ కూడా నాచుర‌ల్‌గా ఉంది. త‌మిళ న‌టులు జార్జ్ మ‌రియ‌న్‌, రామ‌చంద్ర కీల‌క పాత్ర‌లు చేశారు

మంజుమ్మెల్ బాయ్స్ ఇండియ‌న్ స్క్రీన్‌పై వ‌చ్చిన బెస్ట్ స‌ర్వైవ‌ల్ థ్రిల్ల‌ర్ మూవీస్‌లో ఒక‌టిగా త‌ప్ప‌కుండా నిలుస్తుంది. యాక్టింగ్ ప‌రంగా, టెక్నిక‌ల్‌గా మంచి సినిమాగా అనుభూతిని క‌లిగిస్తుంది.

Best Web Hosting Provider In India 2024


Source / Credits

Best Web Hosting Provider In India 2024