Delhi CM Atishi : దిల్లీ సీఎంగా అతిషి- కేజ్రీవాల్​ ఆమెనే ఎందుకు ఎంపిక చేశారు?

Best Web Hosting Provider In India 2024


గత రెండు రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరదించుతూ.. దిల్లీ తదుపరి సీఎం పేరును ఆమ్​ ఆద్మీ పార్టీ ప్రకటించింది. ప్రస్తుత సీఎం అరవింద్​ కేజ్రీవాల్​ రాజీనామా అనంతరం మంత్రి అతిషి.. సీఎం బాధ్యతలను చేపట్టనున్నారు. ఆమె పేరును కేజ్రీవాల్​ స్వయంగా ప్రతిపాదించారని సమాచారం. ఇంకొద్ది సేపట్లో ఈ విషయాన్ని పార్టీ అధికారికంగా ప్రకటించనుంది.

అతిషిని ఎందుకు ఎంపిక చేశారు?

దిల్లీ లిక్కర్​ స్కామ్​ కేసులో గతవారం బెయిల్​పై బయటకు వచ్చిన ఆమ్​ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్​ కేజ్రీవాల్​.. దిల్లీ సీఎం పదవికి రాజీనామా చేయనున్నట్టు ఆదివారం ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి.. దిల్లీ సీఎం కుర్చీ ఎవరిని వరిస్తుంది? అన్న ప్రశ్నపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అతిషి సహా ఆప్​కి చెందిన మరో ఐదుగురు పేర్లు రేసులో వినిపించాయి. కేజ్రీవాల్​, తన భార్యకు ఆ బాధ్యతలు అప్పగించే అవకాశం కూడా ఉందని వార్తలు వినిపించాయి. చివరికి.. మంగళవారం సాయంత్రం కేజ్రీవాల్​ రాజీనామాకు రెడీ అవుతుండగా, సీఎం పదవికి అతిషి పేరు ఖరారైనట్టు మధ్యాహ్నం నాటికి వార్త బయటకు వచ్చింది. మంగళవారం ఉదయం 11 గంటలకు జరిగిన ఆప్ శాసనసభాపక్ష సమావేశంలో అతిషిని సీఎం చేయాలన్న నిర్ణయం తీసుకున్నారు.

అయితే కొత్త సీఎం ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయరని తెలుస్తోంది. మరోవైపు ఈ నెల 26,27 తేదీల్లో దిల్లీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు స్పీకర్ కార్యాలయం తెలిపింది.

దిల్లీ లిక్కర్​ స్కామ్​ వ్యవహారంలో అరవింద్​ కేజ్రీవాల్​తో పాటు ఆమ్​ ఆద్మీ పార్టీ గత కొంతకాలంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఆ సమయంలో అతిషి పార్టీ కోసం కీలకంగా వ్యవహరించారు. కేజ్రీవాల్​ లేని లోటును భర్తీ చేసే విధంగా చాలా ప్రయత్నాలు చేశారు. ఫలితంగా.. సీఎం పదవికి రాజీనామా చేస్తున్నట్టు ఆయన ప్రకటించినప్పటి నుంచి ఆ బాధ్యతలు అతిషికి వెళతాయని ఊహాగానాలు జోరుగా సాగాయి. చివరికి అదే నిజమైంది!

అతిషి వద్ద 10కిపైగా పోర్ట్​ఫోలియోలు ఉన్నాయి. అరవింద్​ కేజ్రీవాల్​, మనీశ్​ సిసోడియాలు జైలులో ఉన్నప్పుడు.. దిల్లీ ప్రభుత్వాన్ని ఆమె ముందుండి నడిపించారు.

Best Web Hosting Provider In India 2024



Source link