చట్టం ముందు అందరు సమానులే

Best Web Hosting Provider In India 2024

చంద్రబాబు అక్రమకట్టడం మొదట కూలగొట్టడం సముచితం 

వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి

తాడేప‌ల్లి:  అబద్ధాల రాజ్యానికి చక్రవర్తి చంద్రబాబు నాయుడు . ఇక అతని పరివారం ఎలా ఉంటుందో వేరే చెప్పక్కర్లేదు! సిగ్గు విడిచిన వ్యక్తికి తన తప్పు కనపడదన్నది నానుడి.  పాలకులకి ఒక న్యాయం పౌరులకు ఇంకొక న్యాయం ఉండదు.  చట్టం ముందు అందరు సమానులే అంటూ వైయ‌స్ఆర్‌సీపీ రాజ్య‌స‌భ స‌భ్యులు విజ‌య‌సాయిరెడ్డి పేర్కొన్నారు. ఈ మేర‌కు త‌న ఎక్స్ ఖాతాలో విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు.
సీఎం చంద్రబాబే పర్యావరణపరంగా సున్నితమైన కృష్ణానది ఒడ్డు ఫై కట్టిన అక్రమకట్టడంలో నివసిస్తున్నప్పుడు బుడమేరు రివలెట్ ఫై ఇల్లు పగలగొట్టే నైతిక అధికారం అతనికి ఎక్కడుంటుంది!  అందువల్ల చంద్రబాబు నివసించే అక్రమకట్టడం మొదట కూలగొట్టడం సముచితం.

Best Web Hosting Provider In India 2024