Abhishek Bachchan: అభిషేక్ కొత్త హెయిర్ స్టైల్ చూశారా? మీరూ ట్రై చేసి లుక్కే మార్చుకోవచ్చు

Best Web Hosting Provider In India 2024


అభిషేక్ బచ్చన్ స్టైలిష్ హెయిర్ కట్ ఫొటోలో తెగ వైరల్ అవుతున్నాయి. 48 ఏళ్ల వయసులోనూ ట్రెండీ లుక్ ప్రయత్నించి, స్టైలిష్‌గా కనిపించొచ్చని అభిషేక్‌ని చూస్తే అర్థం అవుతోంది. ఈ హెయిర్ కట్‌తో అభిషేక్ వయసు పదేళ్లు తగ్గిందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఈ సింపుల్ హెయిర్ కట్ మీరూ ప్రయత్నించొచ్చు. మీరు ప్రత్యేకంగా కనిపించాలి అకున్నప్పుడు ఈ హెయిర్ ట్రై చేయండి. మీ లుక్కే మారిపోతుంది. ఒక సింపుల్ హెయిర్ కట్ రూపాన్ని ఎలా మార్చగలతో అభిషేక్ ఫొటోలు చూస్తేనే తెలుస్తోంది కదూ.

అభిషేక్ బచ్చన్ హెయిర్ కట్ వివరాలు

సెలబ్రిటీ హెయిర్ స్టైలిస్ట్ ఆలిమ్ హకీమ్ అభిషేక్ బచ్చన్‌ కొత్త హెయిర్ కట్ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్ లో పంచుకున్నారు. స్టైలిష్ గా పఫ్ లుక్ ఫ్రంట్ స్టైల్, చక్కగా ట్రిమ్ చేసిన సైడ్‌లతో స్లీక్ కట్‌తో ఉంది అభిషేక్ స్టైల్. అలాగే నీట్‌గా గ్రూమ్ చేసిన గడ్డంతో చాలా హుందాగా కనిపిస్తున్నాడు. చెవులకు నలుపు రంగు స్టడ్స్ మరో స్టైల్ స్టేట్‌మెంట్ లాగా కనిపిస్తున్నాయి. ఈ లుక్‌లో అభిషేక్ టర్టిల్ నెక్ బ్లూ కలర్ డ్రెస్ వేసుకున్నారు. అబిషేక్ చాలా హ్యాండ్‌సమ్‌గా ఉన్నాడంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

అభిమానులు ఎలా రియాక్ట్ అయ్యారంటే

ఆయన కొత్త లుక్ చూసి అభిమానులు లైక్ లు, కామెంట్లతో ముంచెత్తుతున్నారు. ఒక ఫాలోవర్, “వావ్‌వ్‌వ్‌వ్! అభిషేక్ లుక్స్‌లో ఇది అత్యుత్తమమైన లుక్ !” అంటే, మరొకరు ‘ఈ లుక్ చాలా నచ్చింది జెంటిల్మెన్’ అని కామెంట్ చేశారు. ‘ఇది ధూమ్ 4 కోసమే’ అని కొందరు అభిమానులు సరదాగా వ్యాఖ్యానించగా, మరికొందరు ‘కిల్లర్ లుక్’ అంటూ ఆయన స్టైల్‌ను ప్రశంసించారు. చాలా మంది అభిమానులు ఫైర్, హార్ట్ ఎమోజీలను పెట్టి తమ ఇష్టాన్ని తెలియజేశారు.

అభిషేక్ బచ్చన్ గురించి

అభిషేక్ బచ్చన్ బాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ బాలీవుడ్ నటుడు . 1976 ఫిబ్రవరి 5న గొప్ప యాక్టర్ అమితాబ్ బచ్చన్, నటి జయా బచ్చన్ ల కుమారుడిగా జన్మించారు. 2000 లో రెఫ్యూజీ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన అభిషేక్ ఆ తర్వాత ధూమ్, గురు, బంటీ ఔర్ బబ్లీ, కభీ అల్విదా నా కెహనా, పా వంటి చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలతో వైవిధ్య నటుడిగా పేరు తెచ్చుకున్నారు.

అక్షయ్ కుమార్, అనిల్ కపూర్, నానా పటేకర్, రితేష్ దేశ్ ముఖ్, చుంకీ పాండే వంటి ప్రముఖ తారాగణంతో తెరకెక్కుతున్న హౌస్ ఫుల్ 5లో అభిషేక్ బచ్చన్ నటించనున్నారు. షారుఖ్ ఖాన్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటూ కింగ్ సినిమాలో కూడా కనిపించనున్నాడు.

టాపిక్


Source / Credits

Best Web Hosting Provider In India 2024