Bellam bajjilu: గోధుమపిండితో తియ్యటి బెల్లం బజ్జీలు, టేస్టీ రెసిపీ ఇదే

Best Web Hosting Provider In India 2024


గోధుమపిండి, బెల్లం కలిపి తియ్యటి కమ్మటి చిట్టి బజ్జీలు లేదా బోండాలు చేసుకోవచ్చు. దీంట్లో బెల్లం వాడతాం. మైదా అస్సలే వాడం కాబట్టి ఆరోగ్యకరం కూడా. సాయంత్రం పూట వేడిగా, తియ్యగా తినాలనిపిస్తే ఇలా గోధుమపిండి బెల్లం తీపి బజ్జీలు ట్రై చేయండి.

గోధుమపిండి బెల్లం బజ్జీల తయారీకి కావాల్సినవి:

1 కప్పు బెల్లం

సగం కప్పు నీళ్లు

2 కప్పుల గోధుమపిండి

3 చెంచాల సన్నం రవ్వ

3 చెంచాల నెయ్యి

సగం టీస్పూన్ వంట సోడా

సగం టీస్పూన్ యాలకుల పొడి

నూనె డీప్ ఫ్రై కి సరిపడా

గోధుమపిండి బెల్లం బజ్జీల తయారీ విధానం:

  1. ముందుగా బెల్లం వీలైనంత చిన్నగా తురుముకోవాలి. అందులో సగం నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టుకోవాలి.
  2. బెల్లం కరిగిపోయాక స్టవ్ కట్టేసి. చల్లారాక బెల్లం పాకాన్ని వడకట్టుకోవాలి.
  3. ఈ పాకంలో గోధుమపిండి, యాలకుల పొడి, సోడా, కాస్త నెయ్యి వేసుకుని కలుపుకోవాలి. ఇక నీళ్లు పోయాల్సిన అవసరం లేదు.
  4. పిండి చేత్తో ఉండలు కట్టేంత గట్టిగానే ఉండాలి. అలా లేకపోతే మరి కాస్త గోధుమపిండి కలుపుకోండి.
  5. వీటిని చిన్న చిన్న ఉండల్లా చేసుకుని పక్కన పెట్టుకోవచ్చు. లేదంటే నేరుగా నూనె పెట్టుకున్నాక ఒక్కోటి వేసుకోవచ్చు.
  6. ఇప్పుడు కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకోవాలి.
  7. అది వేడెక్కాక చిన్న చిన్న బజ్జీల్లాగా వేసుకోండి.
  8. మీడియం మంట మీద ముదురు గోధుమ రంగు వచ్చేదాకా వీటిని వేయించుకుని తీయండి.
  9. బయట క్రిస్పీగా లోపల మెత్తగా ఉండే ఈ గోధుమపిండి బెల్లం బజ్జీల రుచి మాత్రం చాలా బాగుంటుంది.

 

 

టాపిక్

Source / Credits

Best Web Hosting Provider In India 2024