Moringa Paratha:మోదీకి ఇష్టమైన పరాటా ఇది, రోగనిరోధక శక్తిని పెంచుతుంది, రెసిపీ ఇదిగోండి

Best Web Hosting Provider In India 2024


ప్రధాని మోదీ తన ఆహారంలో ఆరోగ్యకరమైన పదార్థాలనే చేర్చుకుంటారు. ఆయన తరచూ తినే ఆహారాల్లో మోరింగా పరాటా ఒకటి. మోడీ 74 ఏళ్ల వయసులో కూడా ఆయన చాలా చురుగ్గా ఉండటానికి కారణం వారి ఆరోగ్యకరమైన జీవనశైలి, మంచి ఆహారపు అలవాట్లు. ప్రధాన మంత్రి తన ఫిట్నెస్ పట్ల చాలా శ్రద్ధ తీసుకుంటారు. ఆహారంలో ఆరోగ్యకరమైన వాటిని తింటారు. ఆయనకు ఇష్టమైన ఆహారం మోరింగా పరాటా. మోరింగా అంటే మునగాకు. మునగాకులో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. దీన్ని ఆహారంలో చేర్చుకోవడం ద్వారా రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు. మునగాకు పరాటా ఎలా చేయాలో తెలుసుకోండి.

మునగాకు పరాటా రెసిపీకి కావాల్సిన పదార్థాలు

మునగాకులు – ఒక కప్పు

గోధుమ పిండి – ఒక కప్పు

పసుపు – పావు స్పూను

కారం – అర స్పూను

ధనియాల పొడి – అర స్పూను

జీలకర్ర పొడి – అర స్పూను

ఇంగువ – చిటికెడు

ఉప్పు – రుచికి సరిపడా

నెయ్యి – సరిపడినంత

మునగాకు పరాటా రెసిపీ

  1. ముందుగా మునగకాకులను శుభ్రంగా కడిగి ప్రెషర్ కుక్కర్ లో ఉడకబెట్టాలి.
  2. మునగాకు ఉడికిన తర్వాత మునగాకులను చేత్తోనే పిండి తీసి పక్కన పెట్టుకోవాలి.
  3. కుక్కర్లో మిగిలిన మునగాకు ఉడకబెట్టిన నీళ్లను తీసి పక్కన పెట్టుకోవాలి.
  4. స్టవ్ మీద కళాయి పెట్టి నెయ్యి ఒక స్పూను వేయాలి. అందులో ఉడకబెట్టిన మునగాకులు, ఇంగువ, ఉప్పు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం, పసుపు వేసి బాగా కలపాలి. తరువాత స్టవ్ ఆఫ్ చేయాలి.
  5. గోధుమపిండిని ఒక పాత్రలో వేసి అందులో వేయించుకున్న మునగాకుల మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకోవాలి.

6. అందులో రెండు టీస్పూన్ల నెయ్యి వేసి అన్నింటినీ బాగా కలపాలి.

7. ఇప్పుడు ముందుగా పక్కన తీసి పెట్టుకున్న మునగాకులు ఉడికించిన నీటిని వేయాలి.

8. ఆ నీటితోనే చపాతీ పిండిని కలుపుకోవాలి. ఓ పదినిమిషాలు పక్కన పెట్టుకోవాలి.

9. తరువాత స్టవ్ మీద పెనం పెట్టి నెయ్యి వేయాలి. ఈలోపు చపాతీ ముద్దలోంచి కొంత ముద్ద తీసి పరాటాలా ఒత్తుకుని పెనంపై వేసి కాల్చుకోవాలి.

10. రెండు వైపులా కాల్చాక తీసి పక్కన పెట్టుకోవాలి. దీన్ని ఏ కూరతో తిన్నా రుచిగానే ఉంటుంది. ఓసారి ప్రయత్నించండి.

మునగాకుల ఉపయోగాలు

మునగాకు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో అన్ని రకాల పోషకాలు ఉంటాయి. మునగాకుల్లో యాంటీ డయాబెటిక్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి రక్తంలో గ్లూకోజ్ స్థాయిని సమతుల్యం చేయడానికి సహాయపడతాయి. కాబట్టి డయాబెటిస్ ఉన్న వారు కచ్చితంగా తినాల్సిన పరాటా ఇది. మునగాకు రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి కూడా సహాయపడుతుంది. అలాంటప్పుడు దీన్ని ఆహారంలో చేర్చుకోవడం ద్వారా సీజనల్ వ్యాధులను దూరం చేసుకోవచ్చు.

టాపిక్

Source / Credits

Best Web Hosting Provider In India 2024