Minister Sridhar Reddy : 100 రోజుల్లో బీజేపీ ఎన్ని హామీలు అమలు చేసిందో చెప్పండి- బండి సంజయ్ కు మంత్రి శ్రీధర్ బాబు సవాల్

Best Web Hosting Provider In India 2024


Minister Sridhar Reddy : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కి సవాల్ విసిరారు రాష్ట్రమంత్రి శ్రీధర్ బాబు. ఆరు గ్యారంటీలపై శ్వేత పత్రం విడుదల చేయాలంటున్న బండి సంజయ్… బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చి 100 రోజుల్లో ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో ఎన్ని అమలు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో ఇప్పటికే చాలా అమలు చేశామని మిగతావి త్వరలోనే అమలు చేస్తామని స్పష్టం చేశారు.

తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా కరీంనగర్ లో అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించిన మంత్రి శ్రీధర్ బాబు పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆర్ అండ్ బి అతిథి గృహంలో మీడియాతో మాట్లాడారు. రాజకీయ దురుద్దేశంతో బీఆర్ఎస్, బీజేపీ వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. ఏదో ఒక అంశాన్ని పట్టుకుని రాజకీయం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. హిందువులకు స్ఫూర్తి రాజీవ్ గాంధీ అని, ఆయన విగ్రహం ఏర్పాటు చేస్తే బీఆర్ఎస్, బీజేపీకి ఎందుకు అసూయ అని ప్రశ్నించారు. రాజకీయ దురుద్దేశంతో బీఆర్ఎస్, బీజేపీ వ్యవహరిస్తుందన్నారు.

శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే సహించం

బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మధ్య గొడవతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని దెబ్బతీసేందుకు ఆ పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారని మంత్రి శ్రీధర్ బాబు ఆరోపించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా వ్యవహరిస్తే చూస్తూ ఉర్కోబోమని హెచ్చరించారు. రాజీవ్ గాంధీ విగ్రహం విషయంలో ప్రజలు అలోచన చేయాలని ముఖ్యమంత్రి కోరారని తెలిపారు. సాంకేతిక విప్లవం భారతదేశానికి తీసుకువచ్చిన మహనీయుడు… 18 ఏళ్లకు ఓటుహక్కు కల్పించిన వ్యక్తి రాజీవ్ గాంధీ అని తెలిపారు. తెలంగాణ ప్రజలందరి కోరిక తెలంగాణ రాష్ట్ర సాకారం చేసిన వ్యక్తి సోనియాగాంధీ అన్నారు. దేశం కోసం ప్రాణాలు త్యాగం చేస్తే అర్థం తెలియని వ్యక్తులు విగ్రహం గురించి ‌మాట్లాడుతున్నారని విమర్శించారు. అమిత్ షా, నరేంద్ర మోదీ దగ్గర ప్రశంసలు పొందడానికే రాజీవ్ గాంధీ విగ్రహం తొలిగిస్తామని‌ అంటున్నారని ఎద్దేవా చేశారు. పరిపాలన కేంద్రం సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.

సెప్టెంబరు 17 ముఖ్యమైన రోజు

తెలంగాణకు సెప్టెంబర్ 17 అతి ముఖ్యమైన రోజని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. యావత్ తెలంగాణ ప్రజలు మరిచిపోలేని రోజు అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన దినోత్సవంగా వేడుకలు నిర్వహిస్తుందని తెలిపారు. ప్రజలకు కావాల్సిన అవసరాలు తీర్చడానికే ప్రజాపాలన చేపట్టామని, ప్రజలకి అండగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని స్పష్టం చేశారు. గత పదేళ్లలో తెలంగాణ నిర్భంధంలో ఉందన్నారు. మార్పు కోరిన ప్రజలందరికీ మార్పే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా ప్రజలకి చేరువ అవుతామని స్పష్టం చేశారు. పాత్రికేయులకు పదేళ్లలో లేని స్వేచ్ఛ ఇప్పుడు ‌లభించిందన్నారు.

8 వేల గ్రామాల్లో ఫైబర్ నెట్ వర్క్

ఫైబర్ నెట్వర్క్ ను కేంద్ర సహాకారంలో ప్రతి గ్రామానికి అందుబాటులో తీసుకువస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. పైలెట్ ప్రాజెక్టుగా 8 వేల గ్రామాలకి ఫైబర్ నెట్వర్క్ పనులు పూర్తయ్యాయని చెప్పారు. ప్రతి గ్రామానికి కలుపుకుంటూ ఫైబర్ నెట్వర్క్ పనులు పూర్తి చేస్తామన్నారు.‌ పైలెట్ ప్రాజెక్టు

కింద చేపట్టిన ఫైబర్ నెట్వర్క్ తో కేబుల్ నెట్వర్క్, కంప్యూటర్ సదుపాయం, టెలిఫోన్ సదుపాయాలు కల్పిస్తామన్నారు. అర్టిఫిషన్ ఇంటలిజెన్స్ ఉపయోగించి గ్రామం‌లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. నాలుగు వేల గృహ సముదాయాలకు కేబుల్ ద్వారా సేవలు అందిస్తామని తెలిపారు.

స్కిల్ యూనివర్సిటీలో విశ్వకర్మలకు కోర్సు

రాష్ట్రంలో ఏర్పాటు చేయబోయే స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీలో విశ్వబ్రాహ్మణులకు కోర్సును ప్రవేశపెడతామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. కలెక్టరేట్ లో విశ్వకర్మ యజ్ఞ మహోత్సవంలో పాల్గొన్న మంత్రి విశ్వకర్మల శ్రమ లేనిదే విశ్వంలో ఏ పనీ జరగదని అన్నారు. స్కిల్ యూనివర్సిటీలో విశ్వకర్మల నైపుణ్యాన్ని పెంపొందించే కోర్సును ప్రవేశపెడతామని తెలిపారు. కులవృత్తులను ప్రోత్సహించడంలో ప్రభుత్వం ముందుంటుందని తెలిపారు. కుల వృత్తిదారులకు ఆదాయం కల్పించే మార్గాలను అన్వేషిస్తున్నామని తెలిపారు. పరిశ్రమలను ప్రోత్సహించి ఉపాధి కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు.

రిపోర్టింగ్ : కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్, హిందుస్థాన్ టైమ్స్ తెలుగు.

సంబంధిత కథనం

టాపిక్

Bandi SanjaySridhar BabuKarimnagarBrsBjpTs PoliceTelangana News

Source / Credits

Best Web Hosting Provider In India 2024