IBPS RRB PO: ఐబీపీఎస్ ఆర్ఆర్బీ పీవో ప్రిలిమ్స్ స్కోర్ కార్డ్స్ విడుదల; ఇలా డౌన్ లోడ్ చేసుకోండి

Best Web Hosting Provider In India 2024


IBPS RRB PO Score cards: ఆర్ఆర్బీ పీవో ప్రిలిమ్స్ రిజల్ట్ 2024 స్కోర్ కార్డులను ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ () విడుదల చేసింది. ఐబీపీఎస్ ఆర్ఆర్బీ ఆఫీసర్ స్కేల్ 1 ఆన్ లైన్ ప్రిలిమ్స్ పరీక్ష రాసిన అభ్యర్థులు తమ స్కోర్లను ఐబీపీఎస్ అధికారిక వెబ్సైట్ ibps.in లో తెలుసుకోవచ్చు.

సెప్టెంబర్ 28 వరకు..

ఐబీపీఎస్ అధికారిక వెబ్సైట్ ibps.in లో 2024 సెప్టెంబర్ 17 నుంచి, 2024 సెప్టెంబర్ 28 వరకు అభ్యర్థులకు ఈ స్కోర్ కార్డులు అందుబాటులో ఉంటాయి. అభ్యర్థులు తమ స్కోర్లను చెక్ చేసుకోవడానికి ఈ క్రింది దశలను అనుసరించవచ్చు.

స్కోర్ కార్డును ఇలా చెక్ చేసుకోండి..

  • ఐబీపీఎస్ అధికారిక వెబ్సైట్ ibps.in ను సందర్శించండి.
  • హోమ్ పేజీలోని ఐబీపీఎస్ ఆర్ఆర్బీ పీవో ప్రిలిమ్స్ రిజల్ట్ 2024 స్కోర్స్ లింక్ పై క్లిక్ చేయండి.
  • అభ్యర్థులు తమ లాగిన్ వివరాలను నమోదు చేయాల్సిన కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
  • అక్కడ లాగిన్ వివరాలను నమోదు చేసి సబ్మిట్ పై క్లిక్ చేయాలి.
  • స్క్రీన్ పై మీ స్కోర్ కార్డు డిస్ ప్లే అవుతుంది.
  • స్కోర్ ను చెక్ చేసుకుని, పేజీని డౌన్లోడ్ చేయండి.
  • తదుపరి అవసరాల కోసం దాని హార్డ్ కాపీని ఉంచండి.

సెప్టెంబర్ 13న ఫలితాలు

ఐబీపీఎస్ ఆర్ఆర్బీ పీవో ప్రిలిమ్స్ (IBPS RRB PO Prelims) ఫలితాలను 2024 సెప్టెంబర్ 13న విడుదల చేశారు. సెప్టెంబర్ 13 నుంచి 2024 వరకు అధికారిక వెబ్సైట్లో ఫలితాలను చూసుకునే అవకాశం కల్పించారు. ఆఫీసర్ స్కేల్-1 ప్రిలిమ్స్ పరీక్షను 2024 ఆగస్టు 3, 4, 10, 17, 18 తేదీల్లో నిర్వహించారు. ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు మెయిన్ పరీక్షకు హాజరు కావడానికి అర్హులు.

స్కోర్ పై అధికారిక ప్రకటన

ప్రిలిమ్స్ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు మెయిన్ పరీక్షకు హాజరు కావడానికి అర్హులు. మెయిన్ పరీక్ష 2024 సెప్టెంబర్ 29న జరగనుంది. మెయిన్ పరీక్షలో మొత్తం 200 మార్కులకు గానూ 200 ప్రశ్నలు ఉంటాయి. 2 గంటలపాటు సాగే ఈ పరీక్షలో రీజనింగ్, కంప్యూటర్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లిష్ లాంగ్వేజ్, హిందీ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ పై ప్రశ్నలు ఉంటాయి.

మొత్తం పోస్ట్ లు 9923..

ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న 9923 గ్రూప్ ఏ ఆఫీసర్లు (స్కేల్-1, 2, 3), గ్రూప్ బీ ఆఫీస్ అసిస్టెంట్స్ (మల్టీపర్పస్) పోస్టుల భర్తీకి ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఐబీపీఎస్ (ibps) ఆర్ఆర్బీ పీవో పోస్ట్ లకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ జూన్ 7న ప్రారంభమై 2024 జూన్ 27న ముగిసింది.

Best Web Hosting Provider In India 2024



Source link