Best Web Hosting Provider In India 2024

నెల్లూరు: కావలి పర్యటనకు విచ్చేసిన ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి దివ్యాంగులను అక్కున చేర్చుకున్నారు. తనను కలిసేందుకు ఎదురుచూస్తున్న వికలాంగులను ప్రత్యేకంగా హెలిపాడ్ ప్రాంగణంలోకి పిలిపించుకుని, వారి సమస్యలను ఆలకించారు. ఏడుగురు దివ్యాంగులు ముఖ్యమంత్రికి తమ ఆవేదన వెలుబుచ్చుకున్నారు. వీరి సమస్యలను ఆలకించిన ముఖ్యమంత్రి తక్షణసాయంగా రూ లక్ష రూపాయలు అందించి, అవసరమైన వైద్య సేవలు సత్వరమే అందించేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. ఈ మేరకు ఏడుగురు దివ్యాంగులకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ శ్రీ హరి నారాయణన్, ఆర్డీవో సీనా నాయక్ సమక్షంలో దివ్యాంగులకు తక్షణ సాయంగా ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున చెక్కులను అందజేశారు. జిల్లా కలెక్టర్ హరి నారాయణన్ ప్రత్యేకంగా వికలాంగుల వద్దకు వెళ్లి వారికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తానే స్వయంగా నమోదు చేసుకుని, ప్రభుత్వపరంగా అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.