Best Web Hosting Provider In India 2024

బాపట్ల: జాతీయ స్థాయిలో ఏ రాష్ట్రంలోనూ, ఏ ముఖ్యమంత్రి ప్రవేశపెట్టలేనటువంటి అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి సంక్షేమ రధసారథిగా గుర్తింపు తెచ్చుకున్నారని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకట రమణ అన్నారు. రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలి, నిర్లక్ష్యానికి గురైన అన్ని వర్గాలకు చేయూతను అందించాలనే లక్ష్యంతో, ధృడ సంకల్పంతో సహజవనరులను సద్వినియోగం చేసుకుంటూ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పారు. బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గం నిజాంపట్నంలో వరుసగా ఐదో ఏడాది వైయస్‌ఆర్ మత్స్యకార భరోసా సాయం విడుదల కార్యక్రమానికి ఎంపీ మోపిదేవి వెంకట రమణ హాజరై మాట్లాడారు.