Best Web Hosting Provider In India 2024

నర్సీపట్నం: ప్రతిపక్ష నేత చంద్రబాబు పొత్తులు, ఎత్తులు, కుయుక్తులనే నమ్మకున్నారని, ఆయనకు ఒంటరిగా 175 స్థానాల్లో పోటీ చేసే దమ్ము లేదని ముఖ్యమంత్రి, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబు అధికారంలో ఉంటే అమరావతి.. అధికారంపోతే జూబ్లీహిల్స్‌లో ఉంటారన్నారు. ఏపీలో దోచుకుని హైదరాబాద్‌లో ఉండటం వీరి పని అని విమర్శించారు. ఏపీలోనే నా శాశ్వత నివాసం ఉంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే తాడేపల్లిలో ఇళ్లు కట్టుకొని ఉంటున్నానని గుర్తు చేశారు. ప్రధానులు, రాష్ట్రపతులను చేశానన్న పెద్ద మనిషి.. ఒంటరిగా బరిలోకి దిగే దమ్ముందా? అని సవాలు విసిరారు. 175 స్థానాల్లో పోటీ చేసే సత్తా చంద్రబాబుకు లేదు. ఆయనకు మైదానాల్లో సభలు పెట్టే ధైర్య కూడా లేదన్నారు. చంద్రబాబు, ఆయన పార్టీ వెంటిలేటర్‌పై ఉందని ఎద్దేవా చేశారు. అలాంటి వాళ్లు ప్రజలకు మంచి చేయగలరా అని ప్రశ్నించారు. బాపట్ల జిల్లా నిజాంపట్నం వేదికగా అయిదో విడత వైయస్ఆర్ మత్స్యకార భరోసా నిధులను సీఎం వైయస్ జగన్ విడుదల చేశారు. కంప్యూటర్‌లో బటన్ నొక్కి 1,23,519 మత్స్యకార కుటుంబాల ఖాతాల్లో రూ.231 కోట్లు జమ చేశారు. నర్సీపట్నం బహిరంగ సభలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రసంగించారు.