Best Web Hosting Provider In India 2024
ఎన్టీఆర్ జిల్లా: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా ప్రజల ఇంటి ముంగిటకు పథకాలను అందజేస్తూ, అవినీతి లేని స్వచ్ఛపాలనకు తార్కాణాలుగా వాలంటీర్లు నిలుస్తున్నారని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు కొనియాడారు. మైలవరంలోని ఎస్.వి.ఎస్ కళ్యాణమండపంలో వాలంటీర్లకు వందనం కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా శాసనసభ్యులు కృష్ణప్రసాదు హాజరయ్యారు. జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి ప్రతిమకు పూలమాల వేసి ఘననివాళులర్పించారు.