Best Web Hosting Provider In India 2024

తాడేపల్లి: అమరావతి ప్రాంతంలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం పండుగ వాతావరణంలో జరుగుతుందని, ఈ పండుగకు అందరూ రావాలని మంత్రి జోగి రమేష్ ఆహ్వానించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు అందరూ పెద్ద ఎత్తున రేపటి కార్యక్రమానికి హాజరు కావాలని మంత్రి జోగి రమేష్ విజ్ఞప్తి చేశారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకూడదని చంద్రబాబు పెత్తందారుల పక్షాన నిలబడితే సీఎం వైయస్ జగన్ పేదల పక్షాన నిలబడి విజయం సాధించారని తెలిపారు. చంద్రబాబు పెత్తందారీ కోటను బద్దలు కొట్టామని చెప్పారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు పన్నినా పదలే గెలిచారని మంత్రి పేర్కొన్నారు. అమరావతిలోని మందడం, పెనుమాకలలో టిడ్కో ఇళ్లను అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు. అనంతరం తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడారు.