Best Web Hosting Provider In India 2024

తాడేపల్లి: స్వర్గీయ ఎన్టీఆర్ మరణించి 28 సంవత్సరాలు అయినా ఆయన ఆత్మను నేటికీ చంద్రబాబు చంపుతూనే ఉన్నాడని, చిత్రవధ చేస్తూనే ఉన్నాడని గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ అన్నారు. వెన్నుపోటు పొడిచి వైశ్రాయ్ హోటల్ ముందు చెప్పులు, రాళ్లు, కర్రలతో కొట్టించి ఘోరంగా అవమానించి చంద్రబాబు.. నేడు ఎన్టీఆర్ శతజయంతి పేరిట ఎన్టీఆర్ విగ్రహానికి దండేసి, దండం పెడుతున్నాడన్నారు. దేవుడు క్షణకాలం ఊపిరిపోస్తే.. రాజమండ్రిలో ఆ మహానాడు వేదికపైనే చంద్రబాబు భరతం పడతానని, నిట్టనిలువునా పాతరేస్తానని ఎన్టీఆర్ కోరుకుంటాడన్నారు. ఎన్టీఆర్ చావుకు కారకులైన సిగ్గులేని వెధవలంతా ఒకచోట చేరి మహానాడు, శతజయంతి ఉత్సవాలు అంటూ ఓట్ల కోసం ఎన్టీఆర్ పేరు చెప్పుకుంటూ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు. వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి జోగి రమేష్ విలేకరుల సమావేశం నిర్వహించారు.