Best Web Hosting Provider In India 2024

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోర్టు ఆధారిత అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో కొత్తగా 4 కొత్త పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు ఏర్పాటవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కర్నూలులోని ఓర్వకల్ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేసింది. విశాఖపట్నంలో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కూడా PPP పద్ధతిలో నిర్మిస్తోందని చెప్పారు. నీతి ఆయోగ్ 8వ పాలకమండలి సమావేశం న్యూఢిల్లీలో నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి వైయస్.జగన్ పాల్గొని ప్రసంగించారు. దీంతోపాటు నీతిఆయోగ్ చర్చించే వివిధ అంశాల్లో రాష్ట్రం సాధించిన ప్రగతిని వివరించేలా నోట్‌ను సీఎం వైయస్ జగన్ సమావేశానికి సమర్పించారు.