Best Web Hosting Provider In India 2024

తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి నాలుగేళ్ల పాలన ఒక చరిత్ర అని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అభివర్ణించారు. ఎన్నికలు వస్తున్నాయి అనగానే గుంట నక్కలు పగటి వేషాలు వేసుకొని వస్తున్నాయి.. ప్రజలను భ్రమల్లో పెట్టి మళ్ళీ అధికారంలోకి రావటానికి ప్రయత్నిస్తున్నాయి.. అంతా అప్రమత్తంగా ఉండాలి.. జాగ్రత్త అని హెచ్చరించారు. రాష్ట్రంలో కోటి 60 లక్షల కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాయని తెలిపారు. 50 శాతానికి పైగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రజాప్రతినిధులకు తెలుసు ప్రభుత్వం ఆ యా వర్గాలకు ఎంత ప్రాధాన్యత ఇచ్చారోనని అన్నారు.. 2014-19 మధ్య చంద్రబాబు ఏం చేశాడు? చెప్పుకోవటానికి చంద్రబాబుకు ఒక పథకం అయినా ఉందా? అని ప్రశ్నించారు. పేదలకు ఇళ్లు ఇస్తున్నా అడ్డుకుంటున్నారు.. తాను ఏం చేయలేదు కనుకే చెప్పుకోలేక పోతున్నాడు. అమ్మ ఒడి ఇస్తానంటాడు.. పక్క రాష్ట్రాల్లోని పథకాలు చెబుతున్నాడు.. అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎన్నికల్లో వెన్నుపోట్లు, పక్క పోట్లు అన్నీ ఉంటాయి.. వైయస్ఆర్ సీపీ శ్రేణులు, కార్యకర్తలు అందరూ ఒక్కటిగా పని చేయాలని పిలుపునిచ్చారు. ప్రజలు మనకు మంచి అవకాశం ఇచ్చారు.. గుంట నక్కల వ్యవహారాలను ప్రజలకు వివరించండి.. 175 కు 175 వచ్చేటట్లు కృషి చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు.