Best Web Hosting Provider In India 2024

2019లో ఇదే రోజు ఆంధ్రప్రదేశ్ లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటిసారి అధికారం చేపట్టింది. అసెంబ్లీ ఎన్నికల్లో 175 సీట్లకు 151 సాధించి తెలుగునాట చరిత్ర తిరగరాసింది. అప్పటికి పదేళ్ల క్రితం 2009 మే మాసంలో కడప నుంచి లోక్ సభకు భారీ మెజారిటీతో ఎన్నికైన వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఆ దశాబ్ద కాలంలో ఏ యువ రాజకీయ నాయకుడు ఎదుర్కొనని అడ్డంకులు, ఇబ్బందులు ధైర్యంగా అధిగమించారు. తన తండ్రి, జననేత దివంగత వైయస్ రాజశేఖరరెడ్డి గారి బాటలో జనం మధ్య దివిటీలా కదులుతూ సుదీర్ఘ పాదయాత్రలతో తెలుగునాట ప్రజల కష్టాలు తెలుసుకున్నారు. 2019 వరకూ నాటి పాలకపక్షాల నుంచి తీవ్ర ఒత్తిడి, అణచివేత చర్యలకు ఎదురు నిలిచి పోరాడారు. చెప్పుకోదగ్గ సంఖ్యలో తన పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలను సైతం తెలుగుదేశం పార్టీ తన అధికారంతో తన వైపుకు తిప్పుకున్నా వైయస్ జగన్ గారు చలించలేదు. జంకలేదు. నిరంతరం ప్రజల మధ్య తిరగడంతో వారి అవసరాలేమిటో ఆయనకు తెలిశాయి. ఓదార్పు, పాదయాత్రల్లో తాను స్వయంగా జనం కష్టాలను అర్ధంచేసుకుని, వారి కన్నీళ్లు తుడవడానికి అవసరమైన రీతిలో ఎన్నికల ప్రణాళికను ఆయన రూపొందించారు. నవరత్నాలు వంటి వినూత్న పథకాలు లేదా హామీలతో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగునాట ఒకేసారి వచ్చిన ఏపీ శాసనసభ, పార్లమెంటు ఎన్నికల్లో పోటీచేసి చరిత్రాత్మక విజయం సాధించింది. 2019లో 150వ రోజు అయిన మే 30, గురువారం జగన్ గారి నేతృత్వంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి రావడంతో ప్రతి ఇంటా లక్ష్మీ దేవి అడుగుబెట్టినట్టయింది.