Best Web Hosting Provider In India 2024
కర్నూలు: రైతుకు శత్రువైన చంద్రబాబు అన్నదాతను ముంచేశాడని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు. అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి రైతన్నకు మంచి జరగాలనే తాపత్రయంతో ముందుకు సాగుతున్నామని, అందులో భాగంగా ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చుకుంటూ వచ్చామని ప్రకటించారు. 2023–24 సీజన్‌కు సంబంధించి 52.31 లక్షల రైతు కుటుంబాలకు తొలివిడతగా రూ.7,500 చొప్పున మొత్తం రూ.3,923.22 కోట్ల పెట్టుబడి సాయంతో పాటు మార్చి, ఏప్రిల్, మే నెలల్లో కురిసిన అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన 51 వేల మంది రైతులకు రూ.53.62 కోట్ల మేర ఇన్‌పుట్ సబ్సిడీని సీఎం వైయస్ జగన్ గురువారం కర్నూలు జిల్లా పత్తికొండలో నిర్వహించే కార్యక్రమంలో బటన్ నొక్కి రైతుల ఖాతాల్లో జమ చేశారు. పత్తికొండలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడారు.