Best Web Hosting Provider In India 2024
గుంటూరు: చిన్న, సన్నకారు రైతులు ఎదుర్కొంటున్న కూలీల వెతలు తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘వైయస్ఆర్ యంత్ర సేవ’ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న మెగామేళాకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. నేడు మరికాసేపట్లో గుంటూరు చుట్టుగుంట సెంటర్ వద్ద ట్రాక్టర్లు, కంబైన్డ్ హార్వెస్టర్లను ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి జెండా ఊపి ప్రారంభిస్తారు. వంద శాతం యంత్ర సేవా కేంద్రాల ఏర్పాటులో భాగంగా రూ.361.29 కోట్ల అంచనాతో 3,919 ఆర్బీకే, 100 క్లస్టర్ స్థాయి కేంద్రాలను ఏర్పాటుచేస్తుండగా.. ఎంపిక చేసిన రైతు గ్రూపుల బ్యాంకు ఖాతాల్లో రూ.125.48 కోట్ల సబ్సిడీ మొత్తాన్ని సీఎం బటన్ నొక్కి నేరుగా జమచేయనున్నారు. అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా స్థానిక ప్రజాప్రతినిధుల సమక్షంలో ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, ఇతర యంత్ర పరికరాల పంపిణీ చేస్తారు.