Prof Saibaba Passed Away : దిల్లీ వర్సిటీ మాజీ ప్రొఫెసర్ సాయిబాబా కన్నుమూత

Best Web Hosting Provider In India 2024


దిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన… హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ శనివారం రాత్రి మరణించారు. సాయి బాబా రాత్రి 8.45 గంటలకు గుండెపోటుతో మరణించారని వైద్యులు ధ్రువీకరించారు. పది రోజుల క్రితం అనారోగ్యంతో ఆయన నిమ్స్ హాస్పిటల్లో చేసిన సంగతి తెలిసిందే. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో ఎన్ఐఏ ప్రొఫెసర్ సాయి బాబాను అరెస్టు చేసింది. ఆయన జైలు జీవితం కూడా గడిపారు. ఇటీవల ఆయన జైలు నుంచి విడుదల అయ్యారు.

ఓ పేద రైతు కుటుంబంలో పుట్టి

మావోయిస్టులతో సంబంధాలున్నాయనే ఆరోపణలతో ప్రొ.సాయిబాబాను అరెస్టు చేశారు. దాదాపు 9 ఏళ్లపాటు ఆయన జైలు జీవితం గడిపారు. సాయిబాబా ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో ఓ పేద రైతు కుటుంబంలో 1967లో జన్మించారు. పోలియో కారణంగా ఐదేళ్ల వయస్సు నుంచే వీల్ చైర్ కు పరిమితం అయ్యారు. సాయిబాబా దిల్లీ యూనివర్సిటీలోని రామ్ లాల్ ఆనంద్ కళాశాలలో చాలా ఏళ్ల పాటు ఇంగ్లిష్ బోధించారు.

మావోయిస్టులతో సంబంధాల ఆరోపణలు

మావోయిస్టులతో సంబంధాల ఆరోపణలతో మహారాష్ట్ర పోలీసులు 2014లో దిల్లీ వర్సిటీ రామ్‌లాల్‌ఆనంద్‌ కాలేజీ ప్రొఫెసర్‌ సాయిబాబాను అరెస్టు చేశారు. ఉగ్రవాద కార్యకలాపాల నిరోధక చట్టంసెక్షన్ల కింద ఆయనపై అభియోగాలు నమోదు చేశారు. ఈ కేసును 2017 వరకు విచారించిన గడ్చిరోలి జిల్లా సెషన్స్‌కోర్టు సాయిబాబాతో పాటు మరో ఐదుగురికి జీవిత ఖైదు శిక్ష విధించింది. దీంతో 2021 ఫిబ్రవరిలో ఆయనను అసిస్టెంట్ ప్రొఫెసర్ పదవి నుంచి తొలగించారు. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలపై జీవిత ఖైదు శిక్షను అనుభవించిన ప్రొఫెసర్‌ సాయిబాబా పాటు మరో ఐదుగురిని బాంబే హైకోర్టు నాగ్ పూర్ బెంచ్ నిర్ధోషులుగా విడుదల చేసింది. దీంతో వీరంతా జైలు నుంచి విడుదలయ్యారు.

సెషన్స్‌ కోర్టు జీవితఖైదు తీర్పుపై సాయిబాబా హైకోర్టులో అప్పీల్‌ చేశారు. యూఏపీఏ కేసులో పోలీసులు విధివిధానాలు పాటించలేదని కోర్టుకు తెలిపారు. దీంతో బాంబే హైకోర్టు 2022లో సాయిబాబాపై కేసును కొట్టివేసింది. కానీ వెంటనే మహారాష్ట్ర ప్రభుత్వం ఈ తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. దీంతో సుప్రీంకోర్టు సాయిబాబా విడుదలపై స్టే విధించింది. ఈ కేసును తిరిగి విచారించాలని బాంబే హైకోర్టును ఆదేశించింది. మరోసారి విచారించిన హైకోర్టు ప్రొఫెసర్ సాయి బాబాతో పాటు మరో ఐదుగురిని విడుదల చేసింది.

సంబంధిత కథనం

టాపిక్

Telangana NewsAndhra Pradesh NewsHyderabadTelugu News

Source / Credits

Best Web Hosting Provider In India 2024