Telugu Web Series: బిగ్‌బాస్ కంటెస్టెంట్స్‌తో పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ వెబ్‌సిరీస్ – టైటిల్ ఫిక్స్‌!

Best Web Hosting Provider In India 2024


Telugu Web Series: టాలీవుడ్‌లో టాప్ ప్రొడ‌క్ష‌న్ హౌజ్‌గా కొన‌సాగుతోంది పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ. స్టార్‌, మిడ్ రేంజ్ హీరోల‌తో వ‌రుస‌గా సినిమాల‌ను నిర్మిస్తోంది. ప్ర‌స్తుతం ఈ బ్యాన‌ర్‌లో ఇర‌వైకిపైగా సినిమాలు సెట్స్‌పై ఉన్నాయి. తాజాగా పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఫ‌స్ట్ టైమ్ ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తోంది. ఓ వెబ్‌సిరీస్ నిర్మిస్తోంది.

హ‌రిక‌థ‌…

ద‌స‌రా సంద‌ర్భంగా ఈ వెబ్‌సిరీస్ టైటిల్‌తో పాటు ఫ‌స్ట్‌లుక్‌ను రివీల్ చేశారు. ఈ సిరీస్‌కు హ‌రిక‌థ అనే పేరును ఫిక్స్ చేశారు. టైటిల్ కింద ఉన్న సంభ‌వామి యుగేయుగే అన్న క్యాప్ష‌న్ ఆస‌క్తిని పంచుతోంది.

అడ‌వి మ‌ధ్య‌లో పంచె క‌ట్టుకొని, వీపుపై జంధ్యంతో చేతిలో గొడ్డ‌లి ప‌ట్టుకొని వెన‌క్కి తిరిగి ఉన్న ఓ యువ‌కుడు ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌లో క‌నిపిస్తోన్నాడు. ఈ పోస్ట‌ర్ ఆస‌క్తిని పంచుతోంది.

మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ వెబ్‌సిరీస్‌…

పీరియాడిక‌ల్ బ్యాక్‌డ్రాప్‌లో మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ అంశాల‌తో హ‌రిక‌థ వెబ్‌సిరీస్ తెర‌కెక్కుతోన్న‌ట్లు స‌మాచారం. ఈ వెబ్‌సిరీస్ అర్జున్ అంబ‌టి, దివి, పూజిత‌ పొన్నాడ‌, రాజేంద్ర‌ప్ర‌సాద్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించ‌బోతున్నారు. డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్ ద్వారా త్వ‌ర‌లో ఓటీటీ ఆడియెన్స్ ముందుకు ఈ వెబ్‌సిరీస్ రాబోతుంది.

తెలుగుతో పాటు త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ భాష‌ల్లో ఈ వెబ్‌సిరీస్ స్ట్రీమింగ్ కానున్న‌ట్లు స‌మాచారం. ఎనిమిది ఎపిసోడ్స్‌తో ఈ సిరీస్ రూపొందుతోన్న‌ట్లు స‌మాచారం. ఈ సిరీస్‌కు ద‌ర్శ‌కుడు ఎవ‌రు, స్ట్రీమింగ్ డేట్ ఎప్పుడ‌న్న‌ది త్వ‌ర‌లో క్లారిటీ రానుంది.

బిగ్‌బాస్‌తో…

అర్జున్ అంబ‌టి, దివి బిగ్‌బాస్ షోతోనే తెలుగు ప్రేక్ష‌కుల‌కు చేరువ‌య్యారు. బిగ్‌బాస్ సీజ‌న్ 7లో కంటెస్టెంట్‌గా పాల్గొన్న అర్జున్ అంబ‌టి ఫైన‌ల్ చేరుకున్నాడు. ఐదో ర‌న్న‌ర‌ప్‌గా హౌజ్ నుంచి ఎలిమినేట్ అయ్యాడు. బిగ్‌బాస్‌తో పాపుల‌ర్ అయిన అర్జున్ ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు వెబ్‌సిరీస్‌లు చేస్తున్నారు.

సుంద‌రి, తెప్ప‌స‌ముద్రంతో పాటు మ‌రికొన్ని చిన్న సినిమాల్లో హీరోగా న‌టించాడు. ప‌రంప‌రం, అగ్నిసాక్షి వెబ్‌సిరీస్‌లో డిఫ‌రెంట్ రోల్స్ చేశాడు. ప్ర‌స్తుతం వెడ్డింగ్ డైరీస్ పేరుతో ఓ రొమాంటిక్ కామెడీ మూవీ చేస్తున్నాడు అర్జున్ అంబ‌టి.

మ‌హ‌ర్షి, గాడ్‌ఫాద‌ర్‌…

మ‌రోవైపు బిగ్‌బాస్ సీజ‌న్ 4తో తెలుగు ఆడియెన్స్‌కు సుప‌రిచితురాలైంది దివి. బిగ్‌బాస్‌తో వ‌చ్చిన క్రేజ్ కార‌ణంగా సినిమాల్లో దివికి మంచి అవ‌కాశాలే ద‌క్కుతున్నాయి. మ‌హ‌ర్షి, గాడ్‌ఫాద‌ర్‌, పుష్ప సినిమాల్లో చిన్న రోల్స్ చేసింది. ఈ ఏడాది సింబా, ల‌వ్ మీ సినిమాల్లో కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించింది. లంబ‌సింగి అనే సినిమాలో హీరోయిన్‌గా క‌నిపించింది.

Best Web Hosting Provider In India 2024


Source / Credits

Best Web Hosting Provider In India 2024