Makhana ponganalu: ఫూల్ మఖానాతో గుంత పొంగనాలు, వెయిట్ లాస్ రెసిపీ

Best Web Hosting Provider In India 2024


ఫూల్ మఖానాతో చాలా రకాల స్నాక్స్ ట్రై చేసి ఉంటారు. దీని ఆరోగ్య ప్రయోజనాలు బోలెడు. అయితే వీటితో అల్పాహారంలోకి గుంతపొంగనాలు ఒకసారి ప్రయత్నించి చూడండి. ఇవి ఇన్స్టంట్ గా చేసుకోవచ్చు. అదెలాగో చూసేయండి. దీంట్లో బంగాళదుంప వాడకుండా చేసుకున్నారంటే తక్కువ కేలరీలుండే మంచి వెయిట్ లాస్ రెసిపీ అయిపోతుంది.

ఫూల్ మఖానా గుంత పొంగనాల తయారీకి కావాల్సిన పదార్థాలు:

1 కప్పు ఫూల్ మఖానా

1 కప్పు రవ్వ

2 క్యారట్ల తురుము

1 క్యాప్సికం సన్నటి ముక్కలు

కొద్దిగా కొత్తిమీర తరుగు

సగం చెంచా మిరియాల పొడి

1 పచ్చిమిర్చి సన్నటి తరుగు

1 చెంచా జీలకర్ర

చిటికెడు ఇంగువ

అరకప్పు పన్నీర్ తురుము

1 ఉడికించిన బంగాళదుంప ముద్దగా చేసుకోవాలి

అరచెక్క నిమ్మరసం

ఫూల్ మఖానా గుంత పొంగడాల తయారీ విధానం:

1. ముందుగా మిక్సీలో ఫూల్ మఖానా, రవ్వ వేసుకుని సన్నం పిండిలాగా మిక్సీ పట్టుకోవాలి.

2. ఈ పిండిలో క్యారట్ తురుము, సన్నగా తరిగిన క్యాప్సికం ముక్కలు, కొత్తిమీర తరుగు, పచ్చిమిర్చి ముక్కలు, జీలకర్ర, ఇంగువ, పన్నీర్ తురుము, బంగాళదుంప ముద్ద, ఉప్పు, మిరియాల పొడి వేసుకోవాలి.

3. చివరగా నిమ్మరసం పిండి కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ గట్టిగా ఉండలు చేయగలిగేలా కలుపుకోవాలి. మామూలుగా గుంతపొంగడాల కోసం చేసే పిండి దోశ పిండి లాగా పలుచగా ఉంటుంది. కానీ ఇది మాత్రం గట్టిగా ఉండాలని గుర్తుంచుకోండి.

4. ఇప్పుడు గుంత పొంగనాల పాత్ర తీసుకుని నూనె బాగా రాసి ఈ ముద్దల్ని గుండ్రంగా చేసి అందులో వేసుకోవాలి. మరోవైపు కూడా నూనె వేసుకుని రంగు మారి ఉడికినట్లు అయ్యేదాకా మూత పెట్టి మగ్గనివ్వాలి.

5. వీటిని ఏదైనా చట్నీ లేదా సాస్ తో సర్వ్ చేయొచ్చు. చాలా రుచిగా, కొత్తగా అనిపిస్తాయి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. వాళ్ల లంచ్ బాక్స్ లోకి కూడా పెట్టివ్వచ్చు.

6. అంతే ఫూల్ మఖానా గుంత పొంగనాలు తినడానికి రెడీ అయినట్లే..

ఫూల్ మఖానా బరువు తగ్గడానికి మంచి స్నాక్ లాగా తినొచ్చు. దాంతోనే అల్పాహారం కూడా చేసుకుంటే ఉదయాన్నే ఆరోగ్యకరమైన ఆహారం తిన్నట్లే. దాంతో పాటూ దీంట్లో కూరగాయ ముక్కలు, పన్నీర్ వాడుతున్నాం కాబట్టి మరిన్ని పోషకాలు దొరుకుతాయి.

Source / Credits

Best Web Hosting Provider In India 2024