ఆఫీస్‌లో మీ బాస్‌ను మెప్పించాలంటే ఈ చిన్న ట్రిక్స్ ఫాలో అయితే చాలు!

Best Web Hosting Provider In India 2024


ఆఫీస్‌లో బాస్‌ను మెప్పించాలంటే ఏ ఉద్యోగికీ అంత సులువు కాదు. కేవలం మీ పనితీరు మాత్రమే బాస్‌ను మెప్పించదు. మీ ప్రవర్తన, కొలీగ్స్‌తో మీరు వ్యవహరించే తీరుని కూడా బాస్‌ పరిగణలోకి తీసుకుంటూ ఉంటారు. అయితే.. కొన్ని ట్రిక్స్ ఫాలో అయితే మీ బాస్‌ను మీరు మెప్పించొచ్చు.

సమయపాలన

బాస్‌ను మెప్పించడానికి మీకు అప్పగించిన పనులు సమయానికి పూర్తి చేయడం అత్యంత ముఖ్యం ప్రాజెక్టులను గడువు లోపుగా పూర్తి చేయడం, మీ పనిలో నాణ్యతను చూపించడం మీ బాస్‌కి మీపై సానుకూల అభిప్రాయాన్ని కలిగిస్తుంది.

చొరవ చూపాలి

బాస్‌కి చెప్పకుండానే మీరు సమస్యలను గుర్తించి, వాటికి పరిష్కారాలు సూచిస్తే, అది మీ నాయకత్వ లక్షణాలను చూపిస్తుంది. ఇది బాస్‌పై మంచి ప్రభావాన్ని చూపిస్తుంది. తప్పు జరుగుతున్నా.. మనకి ఎందుకులే.. అది మన పని కాదులే అనుకుంటూ బాధ్యత తీసుకోని వారిని బాస్ పెద్దగా పరిగణలోకి తీసుకోరు.

స్కిల్స్ చూపించాలి

మీకు తెలిసిన పనులు మాత్రమే కాకుండా, కొత్త విషయాలను నేర్చుకోవడంలో ఉత్సాహం చూపించండి. కొత్త స్కిల్స్, ప్రాజెక్టులో ప్రావీణ్యం పొందడం ద్వారా మీరు బాస్‌కి విలువైన సిబ్బందిగా అనిపిస్తారు. దీనికోసం మీరు తీరిక దొరికినప్పుడల్లా కొత్త స్కిల్స్ నేర్చుకోవడంపై దృష్టి పెట్టాలి.

టీమ్‌ ప్లేయర్

ఆఫీస్‌లో సానుకూల దృక్పథం కలిగి ఉండటం, టీమ్‌కు సహకారం ఇవ్వడం, ఇతరులకు సహాయం చేయడం కూడా బాస్‌ను మెప్పించడంలో కీలకంగా ఉంటుంది. మీరు టీమ్‌లో సమన్వయం కాపాడే వ్యక్తిగా ఉంటే.. అది మీ నాయకత్వ లక్షణాలకు ప్రతిబింబిస్తుంది.

స్పష్టమైన కమ్యూనికేన్

బాస్‌తో క్రమం తప్పకుండా స్పష్టమైన కమ్యూనికేషన్‌ ఉండాలి. మీ పనుల గురించి నివేదికలు ఇవ్వడం, అవసరమైనప్పుడు ఫీడ్‌బ్యాక్ కోరడం, మీ పని పురోగతిని తెలుసుకోవడం లాంటివి మీ బాస్‌కి మిమ్మల్ని మరింత దగ్గర చేస్తుంది.

మీకు ఏదైనా సమస్య వచ్చినా నిజాయితీగా బాస్‌తో చెప్పాలి. ఒక ఫ్యామిలీ మెంబర్‌లా మీ సమస్యని షేర్ చేసుకోగలిగితే మీకు పరిష్కారం దొరకడంతో పాటు మీపైన ఒక మంచి ఇంప్రెషన్ వస్తుంది. అలా కాకుండా ఆ సమస్య మీ పనితీరుని ప్రభావితం అయ్యే వరకూ వేచి చూస్తే మీకే ఇబ్బందులు రావచ్చు.

టాపిక్

Source / Credits

Best Web Hosting Provider In India 2024