Actor Bala arrested: నటుడు బాల అరెస్ట్.. మాజీ భార్య ఫిర్యాదుతో అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కారణం ఇదే

Best Web Hosting Provider In India 2024


మలయాళ నటుడు బాల (బాలకుమార్) అరెస్ట్ అయ్యారు. మాజీ భార్య అమృత సురేశ్ ఫిర్యాదు చేయడంతో బాలను పోలీసులు అరెస్ట్ చేశారు. కొచ్చిలోని కడవంతర పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.

కంప్లైట్ ఇదే

సోషల్ మీడియాలో బాల చేస్తున్న పోస్టులు, ఇంటర్వ్యూలు తనను కించపరిచేలా ఉన్నాయని, తన కూతురిని మానసికంగా హాని కలిగిస్తున్నాయని అమృత సురేశ్ పోలీసులు కంప్లైట్ చేశారు. విడాకుల అగ్రిమెంట్‍ను బాల ధిక్కరించారని ఆరోపించారు.

బాలతో పాటు ఆయన మేనేజర్ రాజేశ్‍ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. కొచ్చిలోని ఫ్లాట్‍కు వెళ్లి నేడు (అక్టోబర్ 14) వారిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. మహిళపై వేధింపులతో పాటు జువైనల్ చట్టాల కింద కూడా సురేశ్‍పై కేసులు నమోదయ్యాయని తెలుస్తోంది. నాన్ బెయిలబుల్ సెక్షన్లు రిజిస్టర్ అయినట్టు సమాచారం.

పెయిడ్ ఇంటర్వ్వూలు ఇచ్చి..

ఆన్‍లైన్‍లో పెయిడ్ ఇంటర్వ్యూలు ఇచ్చి మరీ తమను బాల టార్గెట్ చేస్తున్నారని అమృత సురేశ్ ఆరోపించారు. “నన్ను, నా 12 ఏళ్ల కూతురిని అతడు డిస్ట్రబ్ చేస్తూనే ఉన్నాడు. ఈ విషయాల గురించి ఆన్‍లైన్‍లో పెయిడ్ ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నారు” అని అమృత పేర్కొన్నారు.

తన కూతురిని చూడకుండా అమృత అడ్డుకుంటున్నారని బాల గతంలో ఆరోపణలు చేశారు. అయితే, ఆ తర్వాత ఆ అమ్మాయి ఇన్‍స్టాగ్రామ్‍లో ఓ వీడియో పోస్ట్ చేశారు. తనను, తన తల్లిని బాల ఎమోషనల్‍గా వేధిస్తున్నారని చెప్పారు. తన తండ్రి ప్రవర్తన వల్ల చాలా బాధపడుతున్నామని తెలిపారు.

పోలీసులు అక్టోబర్ 12వ తేదీన ఈ కేసును నమోదు చేశారని సమాచారం. మొత్తంగా ముగ్గురిని నిందితులుగా గుర్తించారు. బాల ప్రధాన నిందితుడిగా ఉండగా.. ఆయన మేనేజర్ రాజేశ్, ఫిల్మ్ ఫ్యాక్టరీ ఫౌండర్ అనంతకృష్ణన్ కూడా ఈ కేసులో ఉన్నారు.

విడాకుల తర్వాత కూడా ప్రశాంతత లేదు

విడాకుల తర్వాత కూడా తమను వదలకుండా బాల వేధిస్తున్నారని అమృత సురేశ్ ఆరోపించినట్టు మాతృభూమి రిపోర్ట్ పేర్కొంది. “చెప్పుకోలేని విధంగా శారీరకంగా, మానసికంగా చిత్రహింసలు ఎదుర్కొన్నా. నా కూతురిపై ప్రభావం పడడం మొదలయ్యాక నేను ఇంటిని వదిలిపెట్టి వచ్చేశా. విడాకులు ఇచ్చిన తర్వాత ప్రశాంతంగా జీవించవచ్చని అనుకున్నాం. కానీ ఇప్పుడు కూడా ఫాలో అవుతున్నారు. సోషల్ మీడియాలో మేం తీవ్రమైన వేధింపులు ఎదుర్కొంటున్నాం. కూతురిని స్కూల్‍కు పంపడం కూడా ఇబ్బంది అవుతోంది” అని అమృతి చెప్పినట్టు మాతృభూమి రిపోర్ట్ వెల్లడించింది.

2010లో బాల, అమృత సురేశ్ వివాహం జరిగింది. 2012లో వారికి కూతురు పుట్టారు. నాలుగేళ్లుగా విడిగా ఉన్నాక 2019లో విడాకులు తీసుకున్నారు. రెండో పెళ్లి చేసుకున్న ఎలిజబెత్ ఉదయన్‍తోనూ బాల విడిపోయారు.

టాపిక్

Best Web Hosting Provider In India 2024


Source / Credits

Best Web Hosting Provider In India 2024