Afternoon Sleep: మధ్యాహ్నం కాసేపు కునుకు మంచిదే, కానీ ఈ టైమ్ దాటితే మీపై తీవ్రమైన ప్రభావం

Best Web Hosting Provider In India 2024


మధ్యాహ్నం చక్కగా భోజనం చేసిన తర్వాత కాస్త కునుకు తీస్తే బాగుంటుంది అని మనలో చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ.. ఆఫీస్ వాతావరణం, పని ఒత్తిడి కారణంగా మధ్యాహ్నం వేళ నిద్రపోవడానికి సాహసించరు. అయితే.. మధ్యాహ్నం కాసేపు నిద్రపోతే చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు.

జస్ట్ కాసేపు నిద్ర చాలు

నిద్ర ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది శరీరానికి, మెదడుకు కొత్త శక్తిని ఇస్తుంది. అలానే మన రోజువారీ పని సామర్థ్యాన్ని కూడా పెంచుతుంది. మధ్యాహ్నం కేవలం 10-20 నిమిషాల నిద్ర సరిపోతుంది. ఈ సమయం మెదడును విశ్రాంతిని పొందేలా చేస్తుంది, మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది, కొత్త విషయాలను నేర్చుకునే సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది.

మధ్యాహ్నం నిద్ర తర్వాత మీరు మరింత ఏకాగ్రతతో పని చేయగలుగుతారు. గుండె ఆరోగ్యం కూడా మెరుగవుతుంది. అయితే, 30 నిమిషాల కన్నా ఎక్కువ సేపు నిద్రపోతే, అది అలసటను, మేల్కొన్న తర్వాత ఇంకాస్త అలసటగా అనిపించడాన్ని కలిగిస్తుంది. దీన్ని నాప్పింగ్ హ్యాంగోవర్ అంటారు. అలానే ఈ నాప్పింగ్ హ్యాంగోవర్ ప్రభావం రాత్రిపూట నిద్రపై కూడా పడొచ్చు. మధ్యాహ్నం నిద్ర పరిమితి లోబడి ఉండాలి.

సృజనాత్మకత పెరుగుదల

మధ్యాహ్నం కాసేపు నిద్ర తర్వాత మీ మెదడు కొత్త ఆలోచనలు, పరిష్కారాలను ఆవిష్కరించడానికి మరింత సామర్థ్యంగా మారుతుంది. సృజనాత్మక రంగాలలో పనిచేసేవారు ఈ ప్రయోజనాన్ని ప్రత్యేకంగా ఆస్వాదిస్తారు.

చక్కని మూడ్

నిద్ర తగ్గినప్పుడు మీరు చాలా విసుగు, చిరాకుగా అనిపిస్తారు. తగినంత నిద్ర పొందినప్పుడు మీరు ప్రశాంతంగా, సంతోషంగా ఉంటారు. మధ్యాహ్నం నిద్ర అనేది రోజువారీ ఒత్తిడిని తగ్గించడంలో మీకు సహాయపడుతుంది. ఇది మీ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

జ్ఞాపకశక్తి పెరుగుదల

కొత్త విషయాలను నేర్చుకోవడం లేదా పని చేయడం సమయంలో మధ్యాహ్నం నిద్ర మీ మెమరీ పనితీరును మెరుగుపరుస్తుంది. ఈ క్రమంలో మన మెదడు సేకరించిన సమాచారాన్ని సక్రమంగా నిల్వ చేయడానికి నిద్ర సహాయపడుతుంది. తద్వారా నేర్చుకున్న విషయాలు జ్ఞాపకంగా ఉంటాయి.

సరైన సమయం

మధ్యాహ్నం 1:00 నుండి 3:00 మధ్య నిద్రపోతే మంచి సమయంగా భావిస్తారు. దీనివల్ల రాత్రి నిద్రపై ప్రభావం చూపకుండా, మీరు చురుకుగా మిగిలిన పనులు చేయడానికి సిద్ధంగా ఉంటారు. మీకు అనువైన సమయాన్ని బట్టి మధ్యాహ్నం కాసేపు కునుకు తీయండి.

అందం, ఆరోగ్యం కూడా

మధ్యాహ్నం నిద్ర వల్ల షుగర్, థైరాయిడ్ సమస్యలు మన దరిచేరవు. అలానే కొద్దిసేపు నిద్రే అయినా.. హార్మోన్లు చురుగ్గా పనిచేసి జీర్ణక్రియ సాఫీగా జరిగేలా చూస్తాయి. మధ్యాహ్నం కనీసం 10 నిమిషాలు నిద్రపోయే వారిలో స్థూలకాయం లాంటి సమస్యలు తక్కువగా వస్తాయని నిపుణులు చెప్తున్నారు.హైబీపీతో పాటు ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి బయటపడటానికి మధ్యాహ్నం నిద్ర చాలా మంచిదని నిపుణులు చెప్తున్నారు.

ఎక్కువసేపు నిద్రపోతే

ఒకవేళ మీరు మధ్యాహ్నం ఒక గంట లేదా అంతకంటే ఎక్కువ నిద్రపోతే మీరు మేల్కొన్న తర్వాత మరింత అలసత్వం, నీరసంగా అనిపించవచ్చు. అంతేకాదు రాత్రి పూట వేగంగా మీకు నిద్రపోకపోవచ్చు. ఇది రాత్రిపూట నిద్రలేమి, నిద్రలో అంతరాయం వంటి సమస్యలకు దారితీస్తుంది.

Source / Credits

Best Web Hosting Provider In India 2024