Best Web Hosting Provider In India 2024
Star Maa Serials Timings: స్టార్ మా సీరియల్స్ ను తెలుగు ప్రేక్షకులు ఎంతగా ఆదరిస్తున్నారో మనకు తెలుసు. ప్రతి వారం ఈ ఛానెల్ కు చెందిన సీరియల్సే టీఆర్పీ రేటింగ్స్ లో టాప్ లో ఉంటున్నాయి. బ్రహ్మముడి, కార్తీకదీపం, ఇంటింటి రామాయణం, గుండెనిండా గుడిగంటలు, చిన్నిలాంటి సీరియల్స్ ప్రేక్షకుల ఆదరణ చూరగొంటున్న నేపథ్యంలో స్టార్ మా తాజాగా ఈ సీరియల్స్ సరికొత్త ప్రోమోలు, టైమింగ్స్ రిలీజ్ చేసింది.
స్టార్ మా సీరియల్స్ టైమింగ్స్
దీపావళి పండుగ రానున్న నేపథ్యంలో స్టార్ మా తన సీరియల్స్ సరికొత్త ప్రోమోలను సోమవారం (అక్టోబర్ 14) రిలీజ్ చేసింది. స్టార్ మాలో ప్రతిరోజూ వినోదాల పండుగ పేరుతో ఈ ప్రోమోలను, టైమింగ్స్ ను మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది.
ఇవాళ్టి ఎపిసోడ్ల ప్రోమోలను ఇలా సరికొత్తగా రిలీజ్ చేసింది. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోస్ ప్రకారం.. ఆయా సీరియల్స్ టైమింగ్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం.
బ్రహ్మముడి – ప్రస్తుతం స్టార్ మాతోపాటు తెలుగు టీవీ సీరియల్స్ లో టాప్ టీఆర్పీ రేటింగ్ ఉన్న ఈ సీరియల్ సోమవారం నుంచి శనివారం వరకు ప్రతి రోజూ రాత్రి 7.30 గంటలకు టెలికాస్ట్ అవుతుంది.
కార్తీకదీపం 2 – బ్రహ్మముడి తర్వాత ఆ స్థాయి రేటింగ్స్ సొంతం చేసుకుంటున్న కార్తీకదీపం సీరియల్ సోమ నుంచి శనివారం వరకు ప్రతి రోజు రాత్రి 8 గంటలకు వస్తుంది.
ఇంటింటి రామాయణం -సోమవారం నుంచి శనివారం వరకు రాత్రి 8.30 గంటలకు..
గుండెనిండా గుండిగంటలు – సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజూ రాత్రి 9 గంటలకు..
సత్యభామ – సోమవారం నుంచి శనివారం వరకు సాయంత్రం 6 గంటలకు..
మగువ ఓ మగువ – సోమవారం నుంచి శనివారం వరకు సాయంత్రం 6.30 గంటలకు..
చిన్ని – సోమవారం నుంచి శనివారం వరకు సాయంత్రం 7 గంటలకు స్టార్ మాలో టెలికాస్ట్ అవుతుంది.
స్టార్ మా మధ్యాహ్నం సీరియల్స్
స్టార్ మాలో పైన చెప్పిన సీరియల్స్ అన్నీ టీఆర్పీ రేటింగ్స్ లో టాప్ లో ఉంటున్నవే. ఇక ఈ ఛానెల్లో మధ్యాహ్నం సీరియల్స్ కు కూడా బాగానే పాపులారిటీ ఉంది. మరి ఆ సీరియల్స్ టైమింగ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.
పాపే మా జీవనజ్యోతి – సోమవారం నుంచి శనివారం వరకు మధ్యాహ్నం 12 గంటలకు
నిన్నుకోరి – సోమవారం నుంచి శనివారం వరకు మధ్యాహ్నం 12.30 గంటలకు..
నువ్వు నేను ప్రేమ – సోమవారం నుంచి శనివారం వరకు మధ్యాహ్నం ఒంటి గంటకు..
పలుకే బంగారమాయెనా – సోమవారం నుంచి శనివారం వరకు మధ్యాహ్నం 1.30 గంటలకు..
మామగారు – సోమవారం నుంచి శనివారం వరకు మధ్యాహ్నం 2 గంటలకు..
వంటలక్క – సోమవారం నుంచి శనివారం వరకు మధ్యాహ్నం 2.30 గంటలకు..
మల్లి – సోమవారం నుంచి శనివారం వరకు మధ్యాహ్నం 3 గంటలకు..
ఎటో వెళ్లిపోయింది మనసు – సోమవారం నుంచి శనివారం వరకు మధ్యాహ్నం 3.30 గంటలకు..
Best Web Hosting Provider In India 2024
Source / Credits