Producer SKN: అక్కడి మావోయిస్టు ఏరియాలో పుష్ప 50 రోజులు ఆడింది: నిర్మాత ఎస్‍కేఎన్.. రాజాసాబ్ అప్‍డేట్ల గురించి కూడా..

Best Web Hosting Provider In India 2024


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘పుష్ప’ సినిమా దేశమంతా రీసౌండింగ్ బ్లాక్‍బస్టర్ కొట్టింది. 2021లో వచ్చిన ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్‍లో హిట్ అవడమే కాకుండా జనాల్లోకి బలంగా వెళ్లింది. తెలుగుతో పాటు హిందీలోనూ భారీ సక్సెస్ సాధించింది. అల్లు అర్జున్ స్వాగ్, మేనరిజమ్‍లు, స్టైల్‍కు జనాలు ఫిదా అయ్యారు. ఈ సినిమా ఉత్తరాదిలోనూ ఏ రేంజ్‍లో జనాల్లోకి వెళ్లిందో నిర్మాత ఎస్‍కేఎన్ నేడు (అక్టోబర్ 14) ఓ మూవీ ఈవెంట్‍లో చెప్పారు.

మావోయిస్టు ఏరియాలో..

కోల్‍కతా సమీపంలోని ఓ మావోయిస్టు ఏరియాలో పుష్ప 50 రోజులు ఆడిందని ఎస్‍కేఎన్ వెల్లడించారు. ఘటికాచలం అనే మూవీ టీజల్ లాంచ్ ఈవెంట్‍కు హాజరైన ఆయన ఈ విషయాన్ని చెప్పారు. “కోల్‍కతాలో ఒక మావోయిస్టు ప్రాంతం ఉంటుందట. అక్కడ సాధారణంగా సెకండ్ షోలు కూడా పడవు. అలాంటి ప్రదేశంలో పుష్ప 50 రోజులు నడిచిందని వారు చెప్పడంతో ఈ సినిమాకు ఉన్న రీచ్ ఏంటి అని నేను షాక్ అయ్యా” అని ఎస్‍కేఎన్ తెలిపారు.

పుష్ప చిత్రం ఉత్తరాదిలో చాలా పాపులర్ అయింది. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ మాస్ యాక్షన్ మూవీకి భారీగా ఆదరణ దక్కింది. ఈ చిత్రానికి సీక్వెల్ మరింత భారీగా వస్తోంది. ‘పుష్ప 2: ది రూల్’ చిత్రం ఈ ఏడాది డిసెంబర్ 6న విడుదల కానుంది. పుష్ప మూవీని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.

అప్పటి నుంచి రాజాసాబ్ అప్‍డేట్స్

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ది రాజాసాబ్ మూవీ రూపొందుతోంది. మారుతీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో పాటు ఎస్‍కేఎన్ కూడా ఈ మూవీకి సహ నిర్మాతగా ఉన్నారు. ఈ టీజర్ లాంచ్ ఈవెంట్‍లో రాజాసాబ్ గురించి ఎస్‍కేఎన్‍కు ప్రశ్న ఎదురైంది.

ది రాజాసాబ్ ప్రపంచాన్ని ఎప్పుడు చూపించబోతున్నారని వచ్చిన క్వశ్చన్‍కు ఎస్‍కేఎన్ స్పందించారు. ప్రభాస్ పుట్టిన రోజైన అక్టోబర్ 23న అప్‍డేట్ ఇస్తామనేలా ఎస్‍కేఎన్ చెప్పారు. అక్కడి నుంచి దశల వారిగా వస్తుందని తెలిపారు. ప్రభాస్ పుట్టిన రోజున ఏం తీసుకురావాలని మారుతీ, నిర్మాత విశ్వప్రసాద్ ప్లాన్ చేస్తున్నారని, నాలుగు రోజుల్లోగా అదేదో తెలుస్తుందని అన్నారు. అక్టోబర్ 23 నుంచి రిలీజ్ వరకు వరుసగా అప్‍డేట్లు వస్తాయని, ఆ ప్రపంచంలోకి తీసుకెళతామని అన్నారు.

హారర్ రొమాంటిక్ కామెడీ మూవీగా ది రాజాసాబ్ రూపొందుతోంది. చాలాఏళ్ల తర్వాత పక్కా ఎంటర్‌టైనింగ్ క్యారెక్టర్ చేస్తున్నారు ప్రభాస్. ఈ మూవీలో వింటేజ్ డార్లింగ్ కనిపించనున్నారు. ఈ చిత్రంలో ప్రియాంక మోహనన్, నిధి అగర్వాల్‍ హీరోయిన్లుగా నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు.

ఘటికాచలం చిత్రం సైకలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కింది. ఈ చిత్రంలో నిఖిల్ దేవాదుల లీడ్ రోల్ చేస్తున్నారు. అమర్ రామేపల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. టీజర్ ఇంట్రెంస్టింగ్‍గా సాగింది. ఈ మూవీని ఎంసీ రాజు నిర్మించారు. ఈ చిత్రానికి ఇంకా రిలీజ్ డేట్ ఖరారు చేయలేదు.

Best Web Hosting Provider In India 2024


Source / Credits

Best Web Hosting Provider In India 2024