Best Web Hosting Provider In India 2024
వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి పోతిన మహేష్
తాడేపల్లి: చంద్రబాబు బీసీలను మోసం చేస్తున్నారంటూ వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి పోతిన మహేష్ మండిపడ్డారు. ‘‘జనాభాలో సగం, తెలుగుదేశంతో మనం.. ఇదీ ఎన్నికలకు ముందు మీరు బీసీల ఓట్ల కోసం చేసిన కాంపెయిన్ స్లోగన్. దీన్ని బేస్ చేసుకునే బీసీలకు రక్షణ చట్టం అని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక జనాభాలో సగం బీసీలను మర్చిపోయారా? లేక బీసీలు సగం కన్నా తక్కువైపోయారా?’’ అంటూ పోతిన మహేష్ ఎక్స్ వేదికగా నిలదీశారు.
‘‘జనాభాలో సగం అని మీరే చెప్పిన బీసీలకు ప్రభుత్వంలో మీరిచ్చిన పదవులెన్ని? టీటీడీలో గతంలో అనుసరించిన సంప్రదాయాన్ని అనుసరించి బీసీలకు టీటీడీ చైర్మన్ పదవి ఇస్తున్నారా లేదా?. ఒకప్పుడు మీరు తీసుకొచ్చిన రెండు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇప్పుడు ఒక్కటికే ఎందుకు పరిమితం చేశారు?. మీ రాజకీయ పొత్తుల కంటే తక్కువైపోయారా బీసీలు?. బీసీ సామాజిక వర్గం వారు రాజీనామా చేసిన రాజ్యసభ సీట్లను బీసీలకే కేటాయించాలి. బీసీలను నెత్తిన పెట్టుకోనక్కర్లేదు. కనీసం సమానంగా చూడండి చాలు.’’ అని పోతిన మహేష్ ట్వీట్ చేశారు.