Thangalaan OTT: విక్రమ్ ‘తంగలాన్’ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు రానుందో చెప్పిన నిర్మాత.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

Best Web Hosting Provider In India 2024


తంగలాన్ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని చాలా మంది ప్రేక్షకులు నిరీక్షిస్తున్నారు. కానీ ఆలస్యమవుతూ వస్తోంది. అయితే, స్ట్రీమింగ్‍కు ఎప్పుడు రానుందో నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా ఇప్పుడు స్పష్టత ఇచ్చారు. చియాన్ విక్రమ్ హీరోగా నటించిన తంగలాన్ చిత్రం ఆగస్టు 15వ తేదీన థియేటర్లలో రిలీజైంది. పీరియడ్ యాక్షన్ అడ్వెంచర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు డైరెక్టర్ పా రంజిత్.

తంగలాన్ చిత్రం థియేటర్లలో రిలీజై ఇప్పటికే రెండు నెలలైంది. అయినా ఇంకా స్ట్రీమింగ్‍కు రాలేదు. దీంతో ఈ విషయంపై చాలా రూమర్లు వచ్చాయి. ఈ క్రమంలో ఈ మూవీని నిర్మించిన కేఈ జ్ఞానవేల్ రాజా స్ట్రీమింగ్‍పై తాజాగా క్లారిటీ ఇచ్చేశారు.

దీపావళికి ఓటీటీలోకి..

తంగలాన్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ చేతిలో ఉన్నాయి. ఈ చిత్రం దీపావళి పండుగకు ఆ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వస్తుందని నిర్మాత జ్ఞానవేల్ రాజా ఎక్స్ స్పేస్‍లో వెల్లడించారు. “వాళ్లు (నెట్‍ఫ్లిక్స్) పండుగకు రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. దీపావళికి మా సినిమా షెడ్యూల్ చేశారు. అయితే కొందరు యూట్యూబర్లు మాత్రం ఏదో సమస్య ఉందంటూ చెప్పుకుంటున్నారు” అని జ్ఞానవేల్ తెలిపారు.

రూమర్లకు చెక్

తంగలాన్ సినిమా స్ట్రీమింగ్ ఆలస్యమవుతుండటంతో కొన్ని రూమర్లు చక్కర్లు కొట్టాయి. ఆర్థికపరమైన వివాదాల వల్లే ఈ చిత్రం ఇంకా ఓటీటీలోకి రాలేదని పుకార్లు వచ్చాయి. డీల్ విషయంలో మేకర్స్, నెట్‍‍ఫ్లిక్స్ మధ్య విభేదాలు వచ్చాయని ఊహాగానాలు వినిపించాయి. అయితే, అలాంటిదేమీ లేదని ఇప్పుడు జ్ఞానవేల్ రాజా స్పష్టం చేశారు. దీపావళికి నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలోనే తంగలాన్ ఓటీటీలోకి వస్తుందని చెప్పారు. దీంతో, అక్టోబర్ 31 లేకపోతే నవంబర్ 1న ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టే అవకాశం ఉంది. త్వరలోనే స్ట్రీమింగ్ డేట్‍పై ప్రకటన రావొచ్చు. మొత్తంగా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ విషయంలో సందిగ్ధత వీడింది.

తంగలాన్ చిత్రం భారీ అంచనాల మధ్య థియేటర్లలోకి వచ్చింది. అయితే మోస్తరు కలెక్షన్లతోనే సరిపెట్టుకుంది. ఈ చిత్రానికి దాదాపు రూ.100 గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఈ మూవీ బడ్జెట్ కూడా సుమారు రూ.100 కోట్లు అయినట్టు అంచనా. దీంతో కమర్షియల్‍గా ఈ మూవీ సక్సెస్ కాలేకపోయింది. గ్రీన్ స్టూడియోస్ పతాకంపై జ్ఞానవేల్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూజ్ చేశారు.

తంగలాన్ చిత్రంలో విక్రమ్ ఐదు డిఫరెంట్ గెటప్‍ల్లో కనిపించారు. మరోసారి తన నట విశ్వరూపం చూపారు. ఈ చిత్రంలో విక్రమ్ యాక్టింగ్, యాక్షన్ హైలైట్‍గా నిలిచాయి. మాళవిక మోహనన్, పార్వతి తిరవోతు, పశుపతి, డానియెల్ కాల్టగిరోన్, ముత్తుకుమార్, ఆనంద్‍సామి ఈ మూవీలో కీరోల్స్ చేశారు.

పా రంజిత్ తన మార్క్ టేకింగ్, ఐడియాలజీతో తంగలాన్ మూవీని తెరకెక్కించారు. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ (కేజీఎఫ్) బ్యాక్‍డ్రాప్‍లో బ్రిటీష్ పాలన కాలం 1850ల్లో ఈ మూవీ స్టోరీ సాగుతుంది. బంగారం కోసం జరిపే అన్వేషణ గురించి ఈ సినిమా ఉంటుంది. చరిత్రలో జరిగిన కొన్ని యథార్థ ఘటనల ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు. జీవీ ప్రకాశ్ కుమార్ ఈ మూవీకి మ్యూజిక్ ఇచ్చారు.

Best Web Hosting Provider In India 2024


Source / Credits

Best Web Hosting Provider In India 2024