Schools Holiday : వర్షాలతో ఇక్కడ స్కూళ్లు, కాలేజీలకు రేపు సెలవు.. ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్

Best Web Hosting Provider In India 2024


చెన్నై, పరిసర జిల్లాల్లో రానున్న 48 గంటల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్‌పట్టు, రాణిపేట, తిరువణ్ణామలై, పుదుచ్చేరికి రెడ్ అలర్ట్ ప్రకటించింది. చెన్నై, పొరుగు జిల్లాల్లో రానున్న కొద్ది రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అక్టోబరు 15, 16 తేదీల్లో చెన్నై, పొరుగు జిల్లాలతో పాటు పుదుచ్చేరికి రెడ్ అలర్ట్ జారీ చేసింది.

దీంతో చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్‌పట్టు జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ అధికారులను ఆదేశించారు. ఈ జిల్లాల్లో రేపు(అక్టోబర్ 15) పాఠశాలలు, కళాశాలలకు సెలవు ఉంటుంది.

ఈ జిల్లాల్లోని ఐటీ కంపెనీల ఉద్యోగులు అక్టోబర్‌ 15 నుంచి 18 వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేలా ఆదేశాలు జారీ చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులతో సీఎం స్టాలిన్ సమీక్ష నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్, ముఖ్య కార్యదర్శి ఎన్.మురుగానందం, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శంకర్ జివాల్ తదితరులు హాజరయ్యారు.

తమిళనాడు ప్రభుత్వం అక్టోబర్ 17 వరకు వాతావరణ అంచనాల గురించి జిల్లా కలెక్టర్‌లను అప్రమత్తం చేసింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించింది.

ట్రాఫిక్ అంతరాయం, లోతట్టు ప్రాంతాలలో నీరు నిలిచిపోవడం, చెట్లు/కొమ్మలు నేలకూలడం వల్ల రోడ్ బ్లాక్‌లులాంటి వాటిపై జాగ్రత్తగా ఉండాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా చూసేందుకు చర్యలు చేపట్టాలని తెలిపింది. నీటి మట్టాలు పెరిగే ప్రదేశాల్లో జాగ్రత్తలు వహించాలని పేర్కొంది. కొండచరియలు విరిగిపడే ప్రదేశాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులకు తెలిపింది.

ఏపీలోనూ నాలుగు రోజులపాటు భారీ వర్షాలు కురవనున్నాయి. కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరితోపాటుగా మరికొన్ని జిల్లాల్లో వానలు పడనున్నాయి. భారీ వర్ష సూచనతో అధికారులు అప్రమత్తమయ్యారు. మరోవైపు తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లోనూ వానలు పడనున్నాయి.

Best Web Hosting Provider In India 2024



Source link