Naga Chaitanya: పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ వెబ్‌సిరీస్‌లో నాగ‌చైత‌న్య – చంద్ర‌బాబు, వైఎస్ఆర్ రాజ‌కీయ వైరం నేప‌థ్యంలో..

Best Web Hosting Provider In India 2024


Naga Chaitanya:దూత త‌ర్వాత నాగ‌చైత‌న్య తెలుగులో మ‌రో వెబ్‌సిరీస్ గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు స‌మాచారం. య‌థార్ఠ ఘ‌ట‌న‌ల ఆధారంగా పొలిటిక‌ల్ డ్రామా థ్రిల్ల‌ర్‌గా ఈ వెబ్‌సిరీస్ తెర‌కెక్క‌బోతున్న‌ట్లు చెబుతోన్నారు.

నాగచైతన్య, ఆది పినిశెట్టి…

వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి, చంద్ర‌బాబు నాయుడు మ‌ధ్య ఉన్న స్నేహం, రాజ‌కీయ వైరంతోపాటు వారి పొలిటికల్ జర్నీలోని కీల‌క ఘ‌ట్టాల‌ ఆధారంగా ద‌ర్శ‌కుడు దేవా క‌ట్టా ఈ సిరీస్‌ను రూపొందిస్తోన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ సిరీస్‌లో నాగ‌చైత‌న్య‌తో పాటు మ‌రో టాలీవుడ్ హీరో ఆది పినిశెట్టి లీడ్ రోల్స్‌లో న‌టించ‌నున్న‌ట్లు స‌మాచారం.

టైటిల్ ఇదే…

ఈ పొలిటిక‌ల్ వెబ్‌సిరీస్‌కు మ‌య‌స‌భ అనే టైటిల్‌ను ఖ‌రారు చేసిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. సోనీలివ్ ఓటీటీలో తెలుగుతో పాటు త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ, హిందీ భాష‌ల్లో ఈ వెబ్‌సిరీస్ స్ట్రీమింగ్ కానున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ప్ర‌ముఖ టాలీవుడ్ నిర్మాణ సంస్థ భారీ బ‌డ్జెట్‌తో మ‌య స‌భ‌ వెబ్‌సిరీస్‌ను నిర్మిస్తోన్న‌ట్లు తెలిసింది. ప్ర‌స్తుతం ఈ సిరీస్‌కు సంబంధించి ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు పూర్త‌యిన‌ట్లు స‌మాచారం. త్వ‌ర‌లోనే సిరీస్ షూటింగ్‌ను ప్రారంభించేందుకు స‌న్నాహాలు జ‌రుగుతోన్న‌ట్లు చెబుతోన్నారు.

స్నేహితులుగా మొద‌లుపెట్టి…

స్నేహితులుగా ఒకే పార్టీతో పొలిటిక‌ల్ జ‌ర్నీని మొద‌లుపెట్టిన వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి, చంద్ర‌బాబు నాయుడు వేర్వేరు పార్టీల్లో చేరి రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థులుగా మారేందుకు దారితీసిన ప‌రిస్థితులు ఏమిటి? వారి రాజ‌కీయ ప్ర‌యాణాన్ని మ‌లుపు తిప్పిన సంఘ‌ట‌న‌ల‌తో పాటు ఎన్నిక‌ల్లో గెలుపుల కోసం వారు వేసిన ఎత్తుల‌ను, కుట్ర‌ల‌ను మ‌య‌స‌భ సిరీస్‌లో దేవా క‌ట్టా థ్రిల్లింగ్‌గా చూపించ‌బోతున్న‌ట్లు చెబుతోన్నారు.

ఫిక్ష‌న‌ల్ డ్రామాగా…

వైఎస్ఆర్‌, చంద్ర‌బాబునాయుడు ఒరిజిన‌ల్ పేర్ల‌ను కాకుండా ఫిక్ష‌న‌ల్ క్యారెక్ట‌ర్స్‌గా ఈ సిరీస్‌లో దేవాక‌ట్టా ఆవిష్క‌రించ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. ఈ వెబ్‌సిరీస్‌లో చంద్ర‌బాబు, వైఎస్ఆర్ పాత్ర‌ల‌ను నాగ‌చైత‌న్య‌, ఆదిపినిశెట్టిల‌లో ఎవ‌రు చేయ‌బోతున్నార‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. త్వ‌ర‌లోనే ఈ సిరీస్‌కు సంబంధించి అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. గ‌తంలో నాగ‌చైత‌న్య‌, దేవా క‌ట్టా ద‌ర్శ‌క‌త్వంలో ఆటో న‌గ‌ర్ సూర్య మూవీ తెర‌కెక్కింది.

దూత సీజ‌న్ 2…

దూత వెబ్‌సిరీస్‌తో గ‌త ఏడాది ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చాడు నాగ‌చైత‌న్య‌. హార‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ అంశాల‌తో రూపొందిన ఈ సిరీస్‌కు విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఈ సిరీస్‌లో అవినీతిప‌రుడైన జ‌ర్న‌లిస్ట్‌గా నాగ‌చైత‌న్య న‌ట‌న‌కు ప్ర‌శంస‌లు ద‌క్కాయి. దూత సిరీస్‌కు సీజ‌న్ 2 రాబోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

తండేల్‌తో బిజీ…

ప్ర‌స్తుతం తండేల్ సినిమా షూటింగ్‌తో నాగ‌చైత‌న్య బిజీగా ఉన్నాడు. చందూ మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ మూవీలో సాయిప‌ల్ల‌వి హీరోయిన్‌గా న‌టిస్తోంది. శ్రీకాకుళం జాల‌ర్ల జీవితాల నేప‌థ్యంలో రియ‌లిస్టిక్ యాక్ష‌న్ ఎమోష‌న‌ల్ డ్రామాగా ఈ మూవీ రూపొందుతోంది. డిసెంబ‌ర్‌లో తండేల్‌ను రిలీజ్ చేసేందుకు మేక‌ర్స్ స‌న్నాహాలు చేస్తోన్నారు.

Best Web Hosting Provider In India 2024


Source / Credits

Best Web Hosting Provider In India 2024