మద్యం టెండర్లలో కూటమి నేతల బెదిరింపులు

Best Web Hosting Provider In India 2024

30 శాతం కమీషన్లు ఇస్తేనే వ్యాపారాలు. 

ప్రభుత్వ తీరుపై మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్‌ ధ్వజం.

బాబు విధానాలతో ప్రభుత్వ సంపద ఆవిరి.

కూటమి నేతల జేబుల్లోకి ప్రజా సంపద.

ఇసుక, లిక్కర్‌ ప్రభుత్వ పాలసీలు అట్టర్‌ ఫ్లాప్‌ 

ఇసుక దొరక్క కుదేలైన నిర్మాణ రంగం.

రోడ్డున పడ్డ వేలాది కుటంబాలు.

120 రోజుల కూటమి పాలనలో రోజూ అఘాయిత్యాలే.

కూటమి పాలనపై మండిపడ్డ మాజీ మంత్రి వేణుగోపాలకృష్ణ.

రాజమహేంద్రవరం: కూటమి ప్రభుత్వం ఏర్పడితే రాష్ట్రంలో సంపద సృష్టిస్తానని  చెప్పిన చంద్రబాబు…. తీరా అధికారంలోకి వచ్చాక మద్యం, ఇసుకను అడ్డదారిలో తన వారికి దోచిపెట్టి, వారి జేబులు నింపి ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారని మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాజమహేంద్రవరంలోని వైయ‌స్ఆర్‌సీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి పాలనలో 30 శాతం కమీషన్లు ఇచ్చుకుంటే తప్ప వ్యాపారం చేయలేని పరిస్థితులు నెలకొన్నాయని ఆక్షేపించారు. 
గతంలో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంలో 43 వేల బెల్ట్‌ షాపులను మూసేయించి మద్యం వాడకాన్ని తగ్గిస్తే, చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం తాగమని ప్రోత్సహించి ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకుంటున్నారని ఆగ్రహించారు. చంద్రబాబు తెచ్చిన లిక్కర్, ఇసుక పాలసీలు అట్టర్‌ ప్లాప్‌ అయ్యాయని ఆయన తేల్చి చెప్పారు. 

తమ పార్టీ నాయకులను తప్పుచేయమని తానే ప్రోత్సహించి.. మరలా వారిని కట్టడి చేస్తున్నట్టు చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు. చంద్రబాబు విధానాల వల్ల రాష్ట్రం నష్టపోతోందని బాబు భజన పత్రికలకే రుచించక ఆవేదనతోఘోషిస్తున్నాయంటే ఆయన పాలన ఎంత దిగజారిపోయిందో అర్థం చేసుకోవచ్చన్నారు. 120 రోజుల కూటమి పాలనలో ఏ పత్రికను తిరగేసినా అత్యాచారం, దాడులు, అఘాయిత్యాలు లాంటి వార్తలు లేని రోజు లేదని.. రాష్ట్రంలో దారుణపాలనకు ఇదే నిదర్శమని మండిపడ్డారు. 

ఎన్నికల్లో సూపర్‌ సిక్స్‌ వంటి హామీలిచ్చి… తీరా అధికారంలోకి వచ్చాక హామీలు చూస్తే భయమేస్తుందని చేతులెత్తేసిన అనుభవశాలి చంద్రబాబు అని ఎద్దేవా చేశారు. 

ఇసుక పాలసీ లోపభూయిష్టం.
ఒకవైపు ప్రభుత్వం ఉచిత ఇసుక అని చెబుతుంటే.. మరోవైపు గతంలో కన్నా రెండు మూడింతలు అధిక ధరకు ఇసుక కొనుగోలు చేయాల్సిన దుస్థితి నెలకొందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం దిగిపోయేనాటికి 85 లక్షల టన్నుల ఇసుకను నిల్వ చేసి ఉంటే కూటమి నాయకులు నెలలోనే 45 లక్షల టన్నులు దోచుకోవడం ద్వారా… ప్రభుత్వ ఖజానాకు చేరాల్సిన వేల కోట్ల సంపదకూటమి నేతల జేబుల్లోకి చేరిందని మండిపడ్డారు. ప్రభుత్వ తీరుతో ఇసుక కొరత కారణంగా నిర్మాణరంగంపై ఆధారపడిన వేలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయని మండిపడ్డారు.

Best Web Hosting Provider In India 2024