Pushpa 2 First Review: పుష్ప 2 మూవీ చూశాను.. మొదటి పార్ట్ కంటే పది రెట్లు బెటర్‌గా ఉంటుంది: దేవిశ్రీ ప్రసాద్ రివ్యూ

Best Web Hosting Provider In India 2024


Pushpa 2 First Review: పుష్ప 2 మూవీని ఆకాశానికెత్తాడు ఈ సినిమాకు మ్యూజిక్ అందించిన దేవిశ్రీ ప్రసాద్. ఓ ప్రెస్‌మీట్ లో మాట్లాడిన అతడు.. సినిమాను తాను ఈ మధ్యే చూశానని, అదిరిపోయిందని అనడం విశేషం. తన నెక్ట్స్ కాన్సర్ట్ గురించి మాట్లాడేందుకు ఏర్పాటు చేసిన సమావేశంలో అతడు అల్లు అర్జున్ మూవీ గురించి ప్రస్తావించాడు. ఈ వీడియో వైరల్ అవుతోంది.

పుష్ప 2 నెక్ట్స్ లెవల్ మూవీ

అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 మూవీ డిసెంబర్ 6న రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. సుకుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా తొలి పార్ట్ బ్లాక్ బస్టర్ అయిన నేపథ్యంలో సీక్వెల్ పై అంతకు మించిన అంచనాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో దేవిశ్రీ ప్రసాద్ పుష్ప 2ని ఆకాశానికెత్తుతూ చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి.

“నేను ఈ మధ్యే పుష్ప 2 ఫస్ట్ హాఫ్ చూశాను. అది చూసి నా దిమ్మ దిరిగిపోయింది. అసలు ఇప్పుడే కాదు మూవీ ఫస్ట్ హాఫ్ నెరేషన్ సుక్కు భాయ్ చెప్పినప్పుడే నేను, చంద్రబోస్ మూడుసార్లు క్లాప్స్ కొట్టాం. ఇది ఇంటర్వెలా, ఇది ఇంటర్వెలా అన్నట్లుగా ప్రతి సీన్ అలా తీశారు.

ఇప్పుడు సినిమా చూసిన తర్వాత సుక్కు భాయ్ స్క్రిప్ట్ చెప్పిన విధానం, దానిని తీసిన విధానం, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన మ్యాజిక్ తో అదరగొట్టేశాడు. పుష్ప 2 ఓ నెక్ట్స్ లెవల్ మూవీ అంతే” అని దేవిశ్రీ ప్రసాద్ అన్నాడు. పుష్ప పార్ట్ 1 కంటే సీక్వెల్ పది రెట్లు మెరుగ్గా ఉంటుందని అతడు చెప్పడం విశేషం.

పుష్ప 2 మూవీ గురించి..

2021లో వచ్చిన పుష్ప మూవీ ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపించింది. అల్లు అర్జున్ బెస్ట్ యాక్టర్ కేటగిరీలో నేషనల్ అవార్డు గెలుచుకున్నాడు. ఇప్పుడు సీక్వెల్ లో తన నటనను అతడు మరో లెవల్ కు తీసుకెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక మూవీ నుంచి ఇప్పుడు రెండు సింగిల్స్ వచ్చేశాయి.

పుష్ప పుష్ప అంటూ టైటిల్ సాంగ్, సూసేకి సూపర్ హిట్ అయ్యాయి. ఫస్ట్ పార్ట్ అంత పెద్ద సక్సెస్ సాధించడంలో డీఎస్పీ అందించిన మ్యూజిక్ కూడా ప్రధాన కారణంగా చెప్పొచ్చు. ముఖ్యంగా ఆ మూవీలోని శ్రీవల్లి, ఊ అంటావా పాటలు ప్రేక్షకులను బాగా అలరించాయి.

ఇక ఇప్పుడు సెకండ్ పార్ట్ లో సుకుమార్, అల్లు అర్జున్ మ్యాజిక్ కు డీఎస్పీ మ్యూజిక్ తోడైతే బాక్సాఫీస్ రికార్డులు తిరగరాయడం ఖాయమని బన్నీ ఫ్యాన్స్ భావిస్తున్నారు. పుష్ప 2 డిసెంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.

Best Web Hosting Provider In India 2024


Source / Credits

Best Web Hosting Provider In India 2024