AP Rains Update: నేడు మరింత బలపడనున్న అల్పపీడనం,దక్షిణ కోస్తా, రాయలసీమలో వర్షాలు,ఆ జిల్లాలకు అలర్ట్‌

Best Web Hosting Provider In India 2024

AP Rains Update: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన  అల్పపీడనం  పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ మంగళవారం దక్షిణ బంగాళాఖాతంలోని మధ్య భాగాల్లో బలపడనుంది. రానున్న 48 గంటల్లో బలపడి పశ్చిమ వాయువ్య దిశగా ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణకోస్తా తీరాల వైపు కదిలే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. 

CTA icon
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

అల్పపీడన  ప్రభావంతో మంగళవారం  నుంచి మూడు రోజుల పాటు 15,16,17 తేదీల్లో  దక్షిణకోస్తాంధ్ర, రాయలసీమలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. అక్టోబర్ 16 బుధవారం  రెండుమూడు చోట్ల భారీ నుంచి అతి తీవ్రభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. 

గురువారం  వరకు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్ళరాదని సూచించారు. తీరం వెంబడి గంటకు 40-60కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ శాఖ అంచనా వేసింది. 

సీఎం ఆదేశాల మేరకు విపత్తుల నిర్వహణ సంస్థ కంట్రోల్ రూమ్ నుంచి సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్, స్పెషల్ సీఎస్ సిసోడియా గారి పర్యవేక్షణలో ప్రభావిత జిల్లాల కలెక్టర్లకు, అధికారులకు సూచనలు జారీ చేశారు. అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి ఏటువంటి ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. పెన్నా పరీవాహక లోతట్టు ప్రాంతప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.

భారీ వర్షాలతో పొంగిపొర్లే వాగులు, కాలువలు, రోడ్లు , కల్వర్టులు, మ్యాన్ హోల్స్ కు ప్రజలు  దూరంగా ఉండాలని అధికారులు సూచించారు. ఒరిగిన విద్యుత్ స్థంబాలు, తీగలు, చెట్లు, హోర్డింగ్స్ క్రింద ఉండరాదన్నారు. పాత భవనాలు వదిలి ముందుగానే సురక్షిత భవనాల్లోకి వెళ్ళాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

15 అక్టోబర్, మంగళవారం:

• పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అన్నమయ్య, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

• శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, ఎన్టీఆర్, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్ఆర్ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

16 అక్టోబర్, బుధవారం:

• బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

• శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ మరియు గుంటూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

17 అక్టోబర్, గురువారం:

• గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

• కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా మరియు ఎన్టీఆర్ కొన్నిచోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

• శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం మరియు అనకాపల్లి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

18 అక్టోబర్, శుక్రవారం:

• బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

• శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ మరియు గుంటూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు

ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం

బంగాళాఖాతంలో ఏర్పడిన విపత్తుల నిర్వహణ సంస్థ కంట్రోల్ రూమ్ నుంచి సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్, స్పెషల్ సీఎస్ సిసోడియా పర్యవేక్షించారు.  భారీ వర్షాల నేపధ్యంలో జిల్లా కలెక్టర్లు, అధికారులకు తీసుకోవాల్సిన చర్యలపై ఆదేశాలు జారీ చేశారు.  పోలిసు, పంచాయితీరాజ్, ఇరిగేషన్, ఆర్&బి అధికారులు అలెర్ట్ గా ఉండాలని,  ప్రభావిత జిల్లాల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు.  

సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులందరినీ వెంటనే వెనక్కి రప్పించాలని,  ఈదురగాలుల తీవ్రతను బట్టి విద్యుత్ శాఖ తగిన చర్యలు వెంటనే తీసుకోవాలని ఆదేశించారు.  అర్బన్ ఫ్లడ్ వలన రోడ్ల మీద నీళ్ళు నిలవకుండా ముందుగానే డ్రైనేజి,నాళాలు శుభ్రం చేయాలని,  కాలువలు, చెరువులు, వాగుల వద్ద పరిస్థితిని ఇరిగేషన్ వాళ్ళు ఎప్పడికప్పుడూ పర్యవేక్షించాలని ఆదేశించారు. 

Whats_app_banner

టాపిక్

Imd AmaravatiWeatherAp RainsSdmaGovernment Of Andhra Pradesh
Source / Credits

Best Web Hosting Provider In India 2024