Brahmamudi October 15th Episode: బ్రహ్మముడి.. తుస్సుమన్న అపర్ణ ప్లాన్.. కనకం క్యాన్సర్ డ్రామా బయటపెట్టిన రుద్రాణి

Best Web Hosting Provider In India 2024

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ టుడే ఎపిసోడ్‌లో కనకం ఇంటికి వచ్చిన కల్యాణ్‌తో మళ్లీ అప్పును మాటలు అంటుంది ధాన్యలక్ష్మీ. ఇలాగే మాట్లాడితే ఇటు నంచే వెళ్లిపోతానని కల్యాణ్ అంటాడు. కన్నతల్లిగా నా బాధ చెప్పుకుంటున్నారా అని లోపలికి వెళ్లిపోతుంది ధాన్యలక్ష్మీ. మా అమ్మ అన్నదానికి ఏం ఫీల్ కాకు అని అప్పుతో అంటాడు కల్యాణ్.

కడిగేస్తానన్న అప్పు

కొడుకు దూరమైతే ఏ కన్నతల్లి అయినా అలాగే మాట్లాడుతుంది. ఆ మాత్రం అర్థం చేసుకోలేనా.. కానీ, నాకు అర్థం కానిది. ఇంతపెద్ద గొడవ అయింది కదా. ఇలాంటప్పుడు మా అమ్మ ఇంత గ్రాండ్‌గా పెళ్లి రోజు ఎలా చేసుకుంటుందో అర్థం కావట్లేదు అని అప్పు అంటుంది. అది నన్ను అడిగితే నాకేం తెలుస్తుంది. మీ అమ్మను అడుగు అని కల్యాణ్ అంటాడు. అడుగుతా.. కడిగేస్తా అని లోపలికి వెళ్తారు ఇద్దరు.

మరోవైపు ఆఫీస్‌కు వెళ్లిన రాజ్ మేనేజర్‌ను చెప్పు రమ్మని కాల్ చేశావ్‌గా విషయం ఏంటీ అని అడుగుతాడు. నేను కాల్ చేయడమేంటని మేనేజర్ అంటాడు. నీకేమైనా పిచ్చా నువ్ కాల్ చేస్తేనే వచ్చాను అని రాజ్ సీరియస్ అవుతాడు. మీకు ఇంపార్టెంట్ వర్క్ ఉందని మీ మీటింగ్స్ అన్ని మారుస్తున్నాను అని మేనేజర్ చెబుతాడు. దాంతో తనకు వచ్చిన ఫోన్ నెంబర్ రాజ్ చూపిస్తే.. అది తనది కాదని అంటాడు. నువ్వేగా వేరే నెంబర్ నుంచి కాల్ చేస్తున్నట్లు చెప్పి రమ్మన్నావుగా అని రాజ్ కోప్పడుతాడు.

నేను చేయలేదు సార్. మీకు ఏదో రాంగ్ నెంబర్ నుంచి వచ్చినట్లుంది. మీరేదో టెన్షన్‌లో ఉన్నట్లున్నారు అని మేనేజర్ అంటాడు. సరే అనుకున్న రాజ్ ఆ కాల్ ఏంటని ఆలోచిస్తాడు రాజ్. ఇంతలో శ్రుతి వస్తుంది. మన కంపెనీలో ఎక్సెస్ గోల్డ్ ఉందా అని అడుగుతాడు. అకౌంట్స్ అంతా చెక్ చేశాను. క్లియర్‌గానే ఉందని శ్రుతి చెప్పి వెళ్లిపోతుంది. మేనేజర్ గొంతుతో కాల్ చేసి ఇంత అబద్ధం ఆడాల్సిన అవసరం ఎవరికి ఉంది. కనుక్కుంటాను అని రాజ్ అనుకుంటాడు.

పెళ్లిరోజుకు ఏంటీ

మరోవైపు కొబ్బరిబొండాం తాగుతు స్టైల్‌గా కూర్చుంటుంది కనకం. అది చూసిన అప్పు అదొక్కటి సరిపోతుందా హిమాలయాల నుంచి గంగాజలం కూడా తీసుకురావాలా అని అంటుంది. ఇవాళ ప్రేమగా ఏదిచ్చిన తీసుకుంటానే అని కనకం అంటుంది. ఎలకలమందు ఉంది అది ఇవ్వన అని అప్పు అంటుంది. మా పెళ్లిరోజునే నా తద్దినం చేయాలని అనుకుంటున్నావా అని కనకం అంటుంది. మరి ఇంట్లో జరుగుతున్న గొడవలు ఏంటీ నీ పెళ్లిరోజుకు ఏమైనా సంబంధం ఉందా అని అప్పు అడుగుతుంది.

మీ బావగారు నాపై ప్రేమతో చేయిస్తున్నారే. నన్నేం చేయమంటావ్ అని కనకం చెబుతుంది. బావ చేస్తున్నాడా. అక్క మీద కోపంగా ఉన్నాడు కదా. ఇలా ఎలా చేస్తున్నాడు అని అప్పు అంటుంది. ఏమో అక్క మీద ప్రేమ పుట్టుకొచ్చిందేమో అని కనకం అంటుంది. నువ్ చెప్పేది సింక్‌లో లేదే అని అప్పు డౌట్ పడుతుంది. భలే కనిపెట్టావ్ కదా. దీని వెనుక ఉండి అంతా పెద్దమ్మే నడిపించిందని బంటి నిజం చెప్పబోతాడు. కానీ, కనకం ఆపి పసుపుకొమ్ములు తెమ్మని పంపిస్తుంది.

ఇంతలో కృష్ణమూర్తి వస్తాడు. ప్రేమగా తండ్రిని హగ్ చేసుకుంటుంది. తర్వాత అల్లుడు గారు ఎక్కడ అని కల్యాణ్ దగ్గరకు వెళ్తారు కృష్ణమూర్తి, అప్పు. హమ్మయ్యా దీనిక అనుమానం రాలేదని కనకం ఊపిరిపీల్చుకుంటుంది. మరోవైపు ఇందిరాదేవి, అపర్ణ మాట్లాడుకుంటూ ఉంటే.. రుద్రాణి వినేందుకు ట్రై చేస్తుంటుంది. ఇంతలో మెట్లు తాకి సౌండ్ చేస్తుంది రుద్రాణి. అటువైపు ఇందిరాదేవి, అపర్ణ చూస్తారు. కానీ, మెట్ల కింద దాక్కుంటుంది రుద్రాణి.

గ్యాంబ్లింగ్ చేసి ఉంటుంది

అక్కడి నుంచి మాట్లాడుకుంటూ వెళ్లిపోతారు. ఎక్కడికి వెళ్లారు అని చూస్తుంది రుద్రాణి. ఇంతలో రుద్రాణి భుజంపై ఎవరిదో చేయి పడుతుంది. దాంతో చచ్చాను. మా వదిన అనుకుంటా అని భయంతో హడలిపోతుంది. కానీ, అది రాహుల్ అని తెలియడంతో రిలాక్స్ అవుతుంది. మా వదినేమో అనుకుని భయంతో హడలిపోయాను అని రాహుల్‌తో అంటుంది. అసలు రాజ్‌ ఇక్కడికీ ఎందుకు వచ్చారో తెలియట్లేదు. వాళ్లు చాలా సీక్రెట్‌గా మాట్లాడుకుంటున్నారు. రాజ్ ఎలా ఒప్పుకున్నాడు. వాడు ఇక్కడికి వచ్చాడంటే కనకం ఏదో గ్యాంబ్లింగ్ చేసి ఉంటుంది అని రుద్రాణి అంటుంది.

అది బయటపెడితే రాజ్ మళ్లీ అసహ్యించుకుని వెళ్లిపోతాడు. కనకం నుంచి నిజం రాబట్టడం కష్టం. మీ అత్త అమాయకురాలు కాబట్టి నిజం వాగేస్తుంది. నువ్ స్వప్న నుంచి నరుక్కుంటు రా. తనకు నిజం తెలిస్తే.. చెప్పే ఛాన్స్ ఉందని రాహుల్‌ను పంపిస్తుంది రుద్రాణి. అపర్ణ వాళ్ల కోసం వెతుక్కుంటుంది రుద్రాణి. అంతా మనం అనుకున్నట్లే జరుగుతుందా వదినా అని కనకం అంటుంది. ఏమో చూద్దాం అని అపర్ణ అంటుంది.

ఇంతలో రాజ్ వస్తే.. వాడు వస్తున్నాడు లోపలికి వెళ్లమని కనకంకు చెబుతుంది అపర్ణ. మళ్లీ దగ్గుకుంటూ కనకం వెళ్తే.. కనకం పావల చాలు రూపాయి పావల వద్దు అని ఓవరాక్షన్ చేయకన్నట్లుగా ఇందిరాదేవి అంటుంది. ఇంత చాలా అంటూ లోపలికి వెళ్తుంది కనకం. రాజ్ వస్తే అపర్ణ ఆపుతుంది. అసలు మేనేజర్ నీకు ఫోనే చేయలేదనుకుంటా అని అపర్ణ అనగానే రాజ్ షాక్ అవుతాడు. నీకెలా తెలుసని రాజ్ అంటాడు.

నీకున్న నిబద్ధతే

ఆ ఫోన్ చేయించింది నేనే. నీ ఆఫీస్ నుంచి ఫోన్ వస్తే ఎవరికి చెప్పకుండా నువ్ ఎలాగైతే వెళ్లిపోయావో.. ఆరోజు కావ్య కూడా వెళ్లిపోయింది. కానీ, నా పర్మిషన్ తీసుకుని మరి వెళ్లింది. ఆరోజు నా ఆరోగ్యం బాగోలేదని ఆగలేకపోయింది. ఈరోజు కనకం ఆరోగ్యం బాలేదని నీకు తెలుసు. ఆమె చివరి కోరిక అని ఫంక్షన్ చేయిస్తున్నావ్. కానీ, కంపెనీలో తప్పు జరుగుతుందని ముందు వెనుక చూడకుండా వెళ్లిపోయావ్. ఎందుకు బాధ్యత. కంపెనీ అది మన ఆస్తి. నీకున్న నిబద్ధతే కావ్యకు ఉండకూడదా చెప్పురా అని అపర్ణ అడుగుతుంది.

అంత మనదే అని కావ్య వెళ్లడాన్ని భయంకర నేరంగా ఎలా చూశావ్ అని అపర్ణ అంటే.. కావ్య నిజం చెబితే మై ఫూట్ అన్నావ్ కదరా. ఇప్పుడు ఆ మాట వెనక్కి తీసుకోగలవా. చెప్పు. మేనేజర్‌తో మేము చేయించినట్లే కావ్యకు కూడా ఎవరో చేయించి ఉంటారు కదా అని ఇందిరాదేవి అంటుంది. ఒకప్పుడు కావ్యను ఎంతో ద్వేషించాను నేను. ఇప్పుడు నేనే కావ్య గురించి మాట్లాడుతున్నాను. ఎందుకు.. నా అనుభవం తను మంచిదని నేర్పింది. నీకు కూడా అలాగే నేర్పిస్తుందని అనుకుంటున్నాను అని అపర్ణ అంటుంది.

అటువైపు గుమ్మానికి పూలదండలు పెడుతుంది కావ్య. తనను చూసి జరిగింది తల్చుకుని, తను అన్న మాటలు గుర్తు చేసుకుని ఫీల్ అవుతుంటాడు రాజ్. ఇంతలో కనకం వస్తుంది. అన్ని పూలు విడిపోలేదు. వీటన్నింటిని కలపడానికి దారం ఉంది. ఇది అందరికి కనపడదు. ఆ పూలకే తెలుస్తుంది. అలాగే భార్యభర్తలకు కూడా అలాగే తెలుస్తుంది. ఆ బంధమే వారికి ఆధారం అని కనకం అంటుంది. పూలు పెట్టడానికి ఇబ్బంది పడుతున్న కావ్య దగ్గరికి వెళ్లిన రాజ్ తనను ఎత్తుకుంటాడు.

మనసు విరిగి వచ్చేశాను

అది చూసి కనకం, అపర్ణ, ఇందిరాదేవి సంతోషంతో ఆశ్చర్యపోతారు. రుద్రాణి కూడా షాక్ అవుతుంది. దించండి అని కావ్య అంటుంది. ఎత్తుకుంది దించడానికి కాదు అని రాజ్ అంటే.. భార్యను మధ్యలో వదిలేయొచ్చు కానీ, దించడం రాదా అని కావ్య అంటుంది. నేను వదిలేయలేదు నువ్వే వచ్చేశావని రాజ్ అంటే.. మనసు విరిగి వచ్చేశాను అని కావ్య అంటుంది. ఇద్దరూ పోట్లాడుకుంటారు. మీ అమ్మ చూస్తుంది. మీ అమ్మ ఎమోషనల్ అవుతుందా అని రాజ్ అడుగుతాడు.

అవుతుంది. మహానటికి జారినట్లు రెండు చుక్కల నీరు జారుతుంది అని కావ్య అంటుంది. ఆ రెండు చుక్కలకోసం నేను ఏమైనా చేస్తాను. త్వరగా కట్టు అని రాజ్ అంటాడు. సరే అని పూలు కడుతుంది కావ్య. అప్పుడు కావ్యను దించుతాడు రాజ్. అప్పుడే పూలదండ వీళ్లిద్దరిపై పడుతుంది. అది చూసి అంతా మురిసిపోతే.. రుద్రాణి మాత్రం షాక్ అవుతుంది. ప్రేమగా చూసుకుంటున్న కావ్య, రాజ్‌లను డిస్టర్బ్ చేసేలా సౌండ్ చేస్తుంది రుద్రాణి.

దాంతో కావ్య, రాజ్ తేరుకుంటారు. అందరిని చూసిన రాజ్ సిగ్గుతో వెళ్లిపోతాడు. కావ్య సైలెంట్‌గా ఉంటుంది. ఏదో జరుగుతుంది అని రుద్రాణి అనుకుంటుంది. అల్లుడిగారిలో మార్పు మొదలైందని కనకం అంటుంది. వాళ్లేం మాట్లాడుకున్నారు అని ఇందిరాదేవి అడుగుతుంది. నాకు తెలియదు. ఎవరైనా వింటారా అని కనకం అంటుంది. సరే వెళ్లి రెడీ అవ్వు మీ పెళ్లి రోజున భార్యాభర్తలు అంటే ఎలా ఉండాలో వారికి తెలిసేలా చేద్దాం అని అపర్ణ అంటుంది.

నిజం బయటపెట్టిన రుద్రాణి

పెళ్లి రోజు ఎర్పాట్లు చూసి ముసలోళ్లకు దసరా పండుగ అంటే ఇది అని ధాన్యలక్ష్మీతో అంటుంది రుద్రాణి. కనకం, కృష్ణమూర్తి కుర్చీలో కూర్చుంటారు. ఒకరికొకరు దండలు వేసుకుంటారు. కేక్ తీసుకొస్తారు. అంతా హ్యాపీ యానివర్సరీ అని విషెస్ చెబుతారు. కృష్ణమూర్తి, కనకం కలిసి కేట్ కట్ చేస్తారు. ఒకరికొకరు తినిపించుకుంటారు. రాజ్, కావ్య ఒకేసారి కేక్ తినిపించడానికి ట్రై చేస్తూ ఒకరినొకరు చూసుకుంటారు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

బ్రహ్మముడి తర్వాతి ఎపిసోడ్‌లో కనకం ఇంట్లో పూజ జరుగుతుంటుంది. కావ్యకు రాజ్ పూజ కంకణం కడుతుంటాడు. ఇంతలో రుద్రాణి చప్పట్లు కొడుతుంది. మీ ఇద్దరిని కలిపేందుకు క్యాన్సర్ ఉన్నట్లు, నాలుగు రోజుల్లో చనిపోతున్నట్లు కనకం అబద్ధం చెప్పింది అని రుద్రాణి చెబుతుంది. దాంతో అంతా ఒక్కసారిగా షాక్ అవుతారు.

Whats_app_banner

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024