Gundeninda Gudigantalu Today Episode: పెళ్లిరోజే రవితో గొడవపడిన శ్రుతి.. కోర్టుకు సత్యం.. మీనాకు కానిస్టేబుల్ సలహా

Best Web Hosting Provider In India 2024

Gundeninda Gudigantalu Serial Today Episode: గుండెనిండా గుడిగంటలు సీరియల్‌ నేటి ఎపిసోడ్‌లో తన కూతురుని బెదిరించే, బలవంత పెట్టే తాళి కట్టి ఉంటాడు. వాళ్లను తీసుకొచ్చి ఆ పెళ్లి చెల్లదు అని చెప్పండి. మీకు ఏం కావాలో నేను చూసుకుంటాను. లేదు మీ వల్ల కాదంటే చెప్పండి. నేను కమిషనర్‌తో మాట్లాడుతాను అని సురేంద్ర అంటాడు.

అసిస్టెంట్ కమిషనర్ గారు చెప్పారనే కదా పెద్దాయన్ను లోపల వేశాను అని ఎస్సై అంటాడు. ఛ.. నా పరిస్థితి ఏంటో నాకు అర్థం కావడం లేదు. మా వియ్యంకుడికి తెలిస్తే నరికి పడేస్తాడు. దీనతంటికి సత్యమే కారణం అని కోపంగా వెళ్తాడు సురేంద్ర. ఏరా.. ఇన్నాళ్లు నీ ముగ్రురు కొడుకులు నేను గీసిన గీత దాటరని విర్రవీగావు కదరా. ఇదేనట్రా నీ పెంపకం థూ.. అని ఛీ కొట్టి వెళ్లిపోతాడు సురేంద్ర. మరోవైపు తన ఫ్రెండ్ కీర్తి ఇంటికి వెళ్తారు శ్రుతి, రవి.

నేమ్ బోర్డ్ పెట్టుకోవాలి

కీర్తి హారతి తీసుకొచ్చి ఇస్తుంది. ఇక రిలాక్స్ అవ్వమని, మీకు ఎన్నిరోజులు కావాలంటే అన్ని రోజులు ఉండండి అని చెబుతుంది కీర్తి. మా మమ్మీ డాడీ వెతక్కుంటూ నిన్ను ఎంక్వైరీ చేయొచ్చు అని శ్రుతి అంటే.. ఈ లొకేషన్ ఎవరు కనిపెట్టలేరు అని కీర్తి వెళ్లిపోతుంది. ఇక శ్రుతి తెగ సంబరపడిపోతుంది. మనమధ్య ఏది రాదు. మనం కూడా తొందర్లో ఇలాంటి ఇల్లు తీసుకుని ఇంటిముందు మిస్టర్ అండ్ మిసెస్ రవి అని ఒక పెద్ద నేమ్ బోర్డ్ పెట్టుకోవాలి అని శ్రుతి అంటుంది.

రవి మాత్రం డల్‌గా ఉంటాడు. వదినకు ఇంటికి వస్తామని చెప్పాం. ఇప్పుడు అక్కడ వదిన పరిస్థితి ఎలా ఉందో అని రవి అంటాడు. అయితే ఇంటికి వెళ్లు. ఈ తాళి తీసుకుని ఫ్రేమ్ కట్టించుకుని పెట్టించుకుంటాను. ఇందుకేనా మనం ఇంత కష్టపడింది వెళ్లు రవి వెళ్లు.. అని ఫైర్ అవుతుంది శ్రుతి. నేను వెళ్తా అని అనట్లేదని రవి అంటాడు. అనట్లేదు. కానీ, అలా అర్థం వచ్చేలా మాట్లాడుతున్నావ్. నన్ను పెళ్లి చేసుకున్న ఆనందం కొంచెం కూడా లేదు అని శ్రుతి అంటుంది.

లేదు వదిన గురించే ఆలోచిస్తున్నాను అని రవి అంటే.. తన సంగతి తను చూసుకుంటుంది. తనేమైన చిన్నపిల్లా. అడగ్గనా చెప్పడానికి. అవకాశం ఉన్నంతవరకు నిజం దాస్తారు. తర్వాత చేతులెత్తేస్తారు. నా గురించి ఆలోచించు స్వామి. మనం ఏకాంతంగా ఉన్న ఈ సమయాన్ని కబుర్లు చెప్పుకోవాలి. కాలక్షేపం చేయాలి. ఇంకా అని ఆగిపోతుంది శ్రుతి. దాంతో రవి చూస్తే అలా చూడకు అని సిగ్గుపడిపోతుంది శ్రుతి. తర్వాత రవిని హగ్ చేసుకుంటుంది శ్రుతి.

మరి మీరేం చేస్తారు

కానీ, రవి మాత్రం గుడిలో జరిగింది తలుచుకుంటాడు. బయట సమస్యలు ఉన్నాయి. వాటి గురించి తర్వాత ఆలోచిద్దాం. ఇవాళ మనకు స్పెషల్ డే. ఇప్పుడైనా నా మూడ్‌లోకి రావొచ్చు కదా అని శ్రుతి అంటే.. రవి స్మైల్ ఇస్తాడు. ఏంటీ స్మైలా.. సరే నేను టీ పెట్టుకుని వస్తాను అని లోపలికి వెళ్తుంది శ్రుతి. వదినా ఏమనుకుంటుందో.. కాల్ చేసి అడగాలా అని రవి అనుకుంటాడు. మరోవైపు ఎస్సైతో బాలు మాట్లాడుతుంటాడు. ఆ రవిగాడు మా అందరిని మోసం చేశాడు. కావాలంటే వాడిని ఏమైనా చేసుకోండి అని బాలు అంటాడు.

కొడుకు చేసిన దానికి తండ్రిని అరెస్ట్ చేయడమేంటీ అని బాలు తండ్రి గురించి ఎమోషనల్‌గా చెబుతాడు. మీ తమ్ముడిని తీసుకొచ్చి నాన్నకు తీసుకెళ్లు అని ఎస్సై అంటాడు. మరి మీరేం చేస్తారు సార్ అని బాలు అంటే ఎస్సై షాక్ అవుతారు. ఇంట్లో ఉన్న మనిషిని మాత్రం లాక్కొచ్చి లాకప్‌లో వేస్తారా. ఒక అమ్మాయని లేపుకుని వెళ్లిపోయిన వాన్ని మాత్రం వెతకరా. అది మేము వెతకరా. మీరు మీ పోలీసులు ఏం చేస్తారు. ఇలా అమాయకులపైన, వయసు పైబడిన వాళ్ల మీద మీ ప్రతాపం అంతా చూపిస్తారా అని బాలు అంటాడు.

ఏంటీ ఎక్కువ మాట్లాడుతున్నావ్. నిన్ను కూడా లాకప్‌లో వేస్తాను అని ఎస్సై అంటాడు. అరెస్ట్ చేయండి సార్. ఇదిగో ఈ ఇష్టం లేని తల్లికి కొడుకుగా ఉన్నందుకు, లక్షలు మింగినోడికి తమ్ముడిని అయినందుకు.. నమ్మకాన్ని ముక్కులు చేసిన భార్యకు భర్తగా ఉన్నందుకు, ఆ దేవుడి కొడుకుగా ఆయన కోసం జైలుకు వెళ్లడానికి కూడా రెడీ సార్ అని బాలు అంటాడు. సత్యం ఎమోషనల్‌గా చూస్తాడు.

చంపేస్తాను అంటూ వార్నింగ్

నీ బాధ నాకు అర్థమైందయ్యా. మీ తమ్ముడు వచ్చేవరకు మీ నాన్నను విడిచిపెట్టేందుకు రూల్స్ ఒప్పుకోవు. మీ నాన్న ఉంటే అయినా మీ తమ్ముడు వస్తాడు. కావాలంటే మీ నాన్నకు భోజనం పెట్టించండి. ట్యాబ్లెట్స్ ఉంటే తెప్పించండి అని ఎస్సై వెళ్లిపోతాడు. నేను భోజనం, ట్యాబ్లెట్స్ తీసుకొస్తాను అని మీనా వెళ్లబోతుంటే.. చంపేస్తాను అని బాలు అంటాడు. నిన్ను మళ్లీ మా కుటుంబంలోకి రానిస్తానా. ఇక్కడే ఉంటే చంపి జైలుకు వెళ్తాను. నడవ్వే బయటకు.. నడవ్వే.. అని మీనాను గద్దిస్తాడు బాలు.

తండ్రి దగ్గరికి వెళ్లిన బాలు నాన్న నావైపు చూడు నాన్న. ఏదోటి మాట్లాడు. బాధంతా గుండెల్లో గూడు కట్టుకుంటే భరించలేవు నాన్న. ఏం కావాలో చెప్పు నాన్న. మాట్లాడు నాన్న అని ప్రాధేయపడతాడు బాలు. సత్యం మాత్రం సైలెంట్‌గా ఉంటాడు. బయటకు వచ్చిన మీనాతో సారీ చెబుతుంది సుమతీ. అంతా కలిసి సంతకం పెట్టించారు. వారంతా ఎక్కడ. నన్ను మీ బావ పురుగులా చూస్తున్నాడు అని మీనా అంటుంది. నేను వెళ్లి బావకు నిజం చెబుతాను అని సుమతి అంటుంది.

మళ్లీ నీ మెడకు చుట్టుకోవడం ఎందుకు. మావయ్య గారు ఏమనుకుంటున్నారో. మావయ్య గారు వచ్చేవరకు నేను వెళ్లను అని మీనా చెబుతుంది. ఇంతలో కానిస్టేబుల్ వచ్చి వాళ్లంతా కోపంగా ఉన్నారు. ఎందుకమ్మ మాటలు పడతావ్ అని అంటాడు. దాంతో జరిగింది చెబుతుంది మీనా. మావయ్యను విడిపించాలంటే డబ్బు ఏమైనా కట్టాలా అని అడుగుతుంది మీనా. కేసు పెట్టిన వాళ్లు పరపతి ఉన్నవాళ్లు. పెళ్లి చేసుకున్నవాళ్లు రావాలి. వచ్చి ఆ అమ్మాయికి ఇష్టంగానే పెళ్లి జరిగిందని చెప్పాలి. అప్పుడే కేసు ఉండదు అని కానిస్టేబుల్ చెప్పి వెళ్తాడు.

కోర్టుకు పంపిస్తాం

వాళ్ల ఎక్కడ దొరకాలి అని మీనా అనుకుంటుంది. నాన్నకు తినడానికి ఏమైనా తీసుకురారా అని ప్రభావతి అంటే.. వీడు ఇక్కడే చచ్చాడు కదా. వంద రూపాయలు కూడా లేవా అని బాలు సీరియస్ అవుతాడు. బాలు ఇది ఇల్లు కాదు. ఇప్పుడు ఏం చేయాలో ఆలోచించాలి. నాకు తెలిసిన లాయర్లతో మాట్లాడాను. బెయిల్ దొరకడం కష్టమంటున్నారు అని రోహిణి అంటుంది. ఎస్సై వచ్చి ఇవాళ రాత్రిలోపు రాకుంటే ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి కోర్టుకు పంపిస్తాం. ముందు తమ్ముడిని తీసుకురండయ్యా అని చెప్పి వెళ్లిపోతాడు.

మా నాన్ను వదిలేయండి సార్. మీకు దండం పెడతాను సార్ అని బాలు ప్రాధేయపడతాడు. కానీ, పట్టించుకోకుండా ఎస్సై వెళ్లిపోతాడు. వాడు రాకుంటే ఆయన్ను జైలుకు పంపిస్తారా అని ప్రభావతి అంటుంది. నాన్నెందుకు జెలుకు వెళ్లాలి. అలా జరగనివ్వను అని బాలు అంటాడు. ఏమై ముదనష్టపు దానా. ఇంకా ఎందుకు ఇక్కడ నిలబడ్డావ్. మా కుటుంబానికి దరిద్రంలా దాపరించావ్ కదే. నువ్ మీ నాన్న ఎప్పుడు వెనుకేసుకొస్తారు కదా. ఇప్పుడేం మాట్లాడవేంట్రా అని ప్రభావతి అంటుంది.

దీనంతటికి కారణం నువ్వే మీనా. మాకు చెబితే మేమే వాళ్లను తీసుకొచ్చేవాళ్లం కదా అని రోహిణి అంటుంది. నాకు పెళ్లి జరిగేవరకు నిజం తెలియదని మీనా అంటుంది. నువ్వే కదా రవిని గుడికి తీసుకెళ్లింది. నువ్వు బాగుపడవే అని ప్రభావతి అంటుంది. ఏయ్ వెళ్లు అని మీనాను కొట్టబోతాడు బాలు. కానీ, రోహిణి ఆపుతుంది. దాంతో బాలు ఆగిపోతాడు. నువ్ ఇంకా ఇక్కడే ఉంటే.. నిన్ను ఏం చేస్తానో నాకే తెలియదు. వెళ్లిపో.. చంపేస్తాను వెళ్లిపో అని బాలు అంటాడు.

వెతికేందుకు వెళ్లిన మీనా

దాంతో మీనాను సుమతి తీసుకెళ్తుంది. నాన్నా అనుకుంటూ బాలు పోలీస్ స్టేషన్‌లోకి వెళ్తాడు. తండ్రిని చూసి తలదించుకుంటాడు బాలు. అది చూసి చేతులు పట్టుకుని ఏడుస్తాడు సత్యం. రాత్రి అవుతుంది. రేయ్ రాజేష్.. రెస్టారెంట్‌లో అందరిని పీకి వాడిని కనుక్కో. కనపడితే నాలుగు తగిలించి తీసుకురా. ఇక్కడ నేను లేకుంటే ఆయనకు ధైర్యం చెప్పేవాళ్లు లేరు అని బాలు అంటాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

తర్వాతి ఎపిసోడ్‌లో పెళ్లికి వచ్చినవాళ్లలో ఎవరినైనా అడిగితే తెలుస్తుంది అని బాలుతో మీనా చెబుతుంది. దాంతో కీర్తి దగ్గరికి వెళ్లి బాలు శ్రుతి గురించి అడుగుతుంది. తను సైలెంట్‌గా ఉండటంతో చేతులెత్తి మొక్కుతుంది.

Whats_app_banner

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024