Best Web Hosting Provider In India 2024
Government Schools: ప్రతిభా పరీక్ష ద్వారా ప్రభుత్వ పాఠశాలలలో చదువుతున్న విద్యార్థుల ప్రతిభా పాటవాలు వెలికి తీసే లక్ష్యంతో ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 7, 10వ తరగతి విద్యార్థుల కోసం ఆన్లైన్ పోటీలను నిర్వహిస్తున్నారు. కోడ్ తంత్ర సాంకేతికత సహాయంతో ఈ పరీక్ష నిర్వహిస్తున్నట్లు సమగ్ర శిక్ష అధికారులు తెలిపారు.
7, 10 వ తరగతి విద్యార్థులు అందరు ఈ అవకాశాన్ని వినియోగించుకునేలా సహకరించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని 26 జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలలో చదువుతున్న 7,10 వ తరగతి విద్యార్థులు మాత్రమే ఈ పోటీలకు అర్హులుగా పేర్కొన్నారు.
ప్రశ్నాపత్రం తెలుగు, ఆంగ్లం మాధ్యమాలలో ఉంటుంది. పరీక్ష 2 దశలలో జరుగుతుంది. ప్రిలిమ్స్ పరీక్షను ఈ ఏడాది డిసెంబర్ 29న నిర్వహిస్తారు. ప్రిలిమ్స్ పరీక్షలో 40 శాతం పైబడి మార్కులు పొంది, ఆన్లైన్ పరీక్ష నియమ నిబంధనలు సక్రమంగా పాటించిన వారిని తరువాతి దశ మెయిన్స్ కు అర్హత పొందుతారు.
మెయిన్స్ పరీక్ష 2025 జనవరి 1న నిర్వహిస్తారు. ఇందులో 50 శాతం పైబడి మార్కులు పొంది, ఆన్లైన్ పరీక్ష నియమ నిబంధనలు సక్రమంగా పాటించిన వారిని మాత్రమే బహుమతుల ఎంపిక కొరకు పరిగణనలోనికి తీసుకుంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అకడమిక్ క్యాలెండరు 2024- 2025 ను అనుసరించి డిసెంబర్ 2024 వరకు గల గణితం, సైన్స్ , సోషల్ సిలబస్ పై 80 శాతం ప్రశ్నలు, జికె, ఐక్యూ లపై 20 శాతం ప్రశ్నలు ఉంటాయి.
ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలు 60 ప్రశ్నలతో 100 మార్కులుకు నిర్వహిస్తారు. పరీక్ష నిడివి 60 నిమిషాలు ఉంటుంది. విద్యార్థులు తమ ఇంటి వద్దనుండే మొబైల్ లో ఈ పరీక్ష రాయవచ్చు. ఆసక్తి గల విద్యార్థులు 15.10.2024 నుండి 14.11.2024 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చును.
రిజిస్ట్రేషన్ కోసం ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని, ఉచితంగానే https://educationalepiphany.org/eemt2025/registrations2025.php లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.
బహుమతులు ఇలా..
రాష్ట్ర స్థాయిలో 10వ తరగతిలో ప్రథమ స్థానం వచ్చిన వారికి రూ.30వేలు ద్వితీయ స్థానం వచ్చిన వారికి రూ. 25వేలు, తృతీయ స్థానం వచ్చిన వారికి రూ. 20వేలు అందిస్తారు.
7వ తరగతి విద్యార్ధుల్లో ప్రధమ స్థానం వచ్చిన వారికి రూ.20వేలు, ద్వితీయ బహుమతిగా రూ.15వేలు, తృతీయ బహుమతిగా రూ.10వేలు అందిస్తారు. జిల్లా స్థాయిలో 10 వ తరగతి విద్యార్థులకు ప్రథమ బహుమతిగా రూ.8వేలు, ద్వితీయ బహుమతిగా రూ.6వేలు, తృతీయ బహుమతిగా రూ.4వేలు అందిస్తారు.
EEMT 2025 కు సంబంధించిన మరింత సమాచారం & సందేహాల నివృత్తి కొరకు 9573139996/ 9666747996/ 6303293502 నంబర్ లలో సంప్రదించాలని మరియు www.educationalepiphany.org వెబ్సైటు సందర్శించాలని సూచించారు.
టాపిక్