Bigg Boss Yashmi: నా కాలు విరిగిపోయిన పర్లేదన్న యష్మీ.. కిరాయికి వచ్చినట్లుందని చెప్పాడంటూ నబీల్ (వీడియో)

Best Web Hosting Provider In India 2024

Bigg Boss 8 Telugu Seventh Week Nominations Highlights: బిగ్ బాస్ తెలుగు 8 ఏడో వారం నామినేషన్స్ ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. బిగ్ బాస్ 8 తెలుగు అక్టోబర్ 14వ తేది ఎపిసోడ్‌ పూర్తయ్యేసరికి నులుగురు నామినేట్ అయ్యారు. ఇవాళ (అక్టోబర్ 15) కూడా బిగ్ బాస్ తెలుగు 8 నామినేషన్స్ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది.

ఎందుకు అంతలా

తాజాగా బిగ్ బాస్ ఈ వారం నామనేషన్స్‌కు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఇందులో ప్రేరణ, హరితేజ మాట్లాడుకుంటున్నారు. “అరేయ్.. ఆ పుషింగ్.. గిష్షింగ్ అంతా ఏంట్రా.. ఎందుకు?” అని హరితేజ అంది. ఆమెను చూడు అని ఎవరి గురించో చెప్పింది ప్రేరణ. అది నయని పావని గురించి అని తెలుస్తోంది. తర్వాత హార్స్ సౌండ్ వచ్చింది. దాంతో ప్రేరణ, హరితేజ హ్యాట్ పట్టుకునేందుకు ట్రై చేశారు.

కానీ, హ్యాట్ నయని పావని తీసుకుంది. దాంతో తన నుంచి లాక్కునేందుకు ప్రేరణ, హరితేజ ట్రై చేశారు. నయనికి సపోర్ట్‌గా పృథ్వీ ఉన్నట్లు, ప్రేరణకు సపోర్ట్‌గా యష్మీ ఉన్నట్లు తెలుస్తోంది. దాంతో అక్కడ తోపులాట జరిగింది. తర్వాత వెంటనే యష్మీ ఏడ్చుకుంటూ వచ్చి ప్రేరణను హగ్ చేసుకుంది. తర్వాత కింద కూర్చున్న యష్మీతో ఇదే.. చెప్పింది వినమని అని చిరాకుగా హరితేజ అంది.

కిరాయికి వచ్చినట్లు

“ఐయామ్ ఓకే.. నా కాలు విరిగిపోయిన పర్లేదు. నేను ఏది రైట్ అనుకుంటానో దానికే కట్టుబడి ఉంటాను” అని యష్మీ చెప్పుకొచ్చింది. తర్వాత టేస్టీ తేజను నబీల్ నామినేట్ చేశాడు. “టేస్టీ తేజపై మూడు నాలుగు పాయింట్స్ కనిపించాయి. ఫస్ట్ వచ్చేసి మింగిల్ అవుతున్నం కదా మనం అంటే.. లేదు.. ఇది మా సీజన్‌లాగా లేదు. కిరాయికి వచ్చినట్లు ఉంది ఈ ఇంట్లో అని ఒకటి చెప్పిండు” అని నబీల్ చెప్పాడు.

అయితే, దానికి టేస్టీ తేజ అలాగే చూస్తుండుపోయాడు. ఏం డిఫెండ్ చేసుకోనట్టు చూపించారు. తర్వాత మళ్లీ తేజనే నామినేట్ చేసేందుకు వచ్చాడు నిఖిల్. “నువ్ ఎంతో హై ఉంటావనుకున్న కానీ, ఇక్కడికే ఉండిపోయావ్ ఈ వారం అని చెబుతున్నా” అని నిఖిల్ అన్నాడు. “నేను చెప్పానా.. నాది అందనంతా ఎత్తు ఉంటదని” అని తేజ చెబుతుంటే “నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే” అని నిఖిల్ మధ్యలో చెప్పాడు.

సేఫ్ గేమ్ ఆడుతున్నవ్

ఇలా ఇద్దరు వాదించుకున్నారు. “సేఫ్ గేమ్ ఆడుతున్నవ్ అనిపిస్తుంది. ఇప్పుడు చెబుతున్నా. సేఫ్ గేమ్ ఆడుతున్నవ్” అని గౌతమ్‌ను నబీల్ అన్నాడు. “సేఫ్ గేమ్ ఆడుతున్న అన్నదానికి ఒక్క రీజన్ చెప్పు” అని సీరియస్‌గా గట్టిగా అరిచాడు గౌతమ్. దానికి “ఓహో.. ఓ.. అని నబీల్ అరిచాడు. ఏ మరేందీ.. చెప్పు” అని నబీల్‌ను ఇమిటేట్ చేశాడు గౌతమ్.

“ఎయిర్‌పోర్ట్‌లో హర్ట్ అయినదానికి రివేంజ్‌గా వేస్తున్నావా..” అని ప్రేరణ అంటే.. “రివేంజ్ నామినేషన్‌కు పాయింట్ దొరకట్లే కదా” అని నిఖిల్ అన్నాడు. “నాకు ప్రేరణ పదేళ్లుగా ఫ్రెండ్ కాదు. ఈ హౌజ్‌లో నుంచి ఫ్రెండ్” అని యష్మీ అంటే.. “ఫ్రెండ్‌ను తీసుకొచ్చి నామినేషన్స్‌లో వేయడం నాకు నచ్చలా” అని తేజ అన్నాడు.

నామినేషన్స్‌లో ఆరుగురు

“నా ఇష్టం.. నేను ఎరితో ఫ్రెండ్షిప్ చేయాలి.. నేను ఎలా గేమ్ ఆడాలి” అని చాలా సీరియస్‌గా చెప్పిన యష్మీ ఆఖరులో “దిస్ ఈజ్ మై….” అని బూతు డైలాగ్ వాడకుండా సముదాయించుకుని గేమ్ అని చెప్పింది. తర్వాత ప్రేరణ తలపట్టుకుంది. “ఈ వారంలో తేజ కంటే నయని గేమ్ బెటర్” అని హరితేజ అంది. “మీకు అది ఎలా అనిపించిందో చెప్పండి. యాక్సెప్ట్ చేస్తాను. బోర్డ్ తీసుకొచ్చి నామినేషన్స్‌లో పెట్టండి” అని తేజ అన్నాడు.

దాంతో తేజ బోర్డ్ తీసుకొచ్చి పెట్టింది హరితేజ. “మీ ఇద్దరికి క్లారిటీ ఆఫ్ థాట్ లేదు” అని హరితేజ చెప్పింది. అప్పుడు యష్మీని చూపించారు. కాగా ఇప్పటివరకు బిగ్ బాస్ తెలుగు 8 ఈ వారం నామినేషన్స్‌లో గౌతమ్, పృథ్వీ, నిఖిల్, మణికంఠ, యష్మీ, తేజ ఉన్నట్లు ప్రోమో ద్వారా తెలుస్తోంది.

Whats_app_banner

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024