NNS 15th October Episode: తలుపు తట్టి రావాలన్న మనోహరి.. వార్నింగ్​ ఇచ్చిన భాగీ.. దుర్గ గొలుసు గుర్తుపట్టిన రణ్​వీర్​​​!

Best Web Hosting Provider In India 2024

NNS 15th October Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ మంగళవారం (అక్టోబర్ 15) ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. అడగకుండా తన రూంలోకి వచ్చిన అమ్ముకు ఇంకోసారి రూమ్​లోకి వచ్చినప్పుడు అడిగి రావాలని స్వీట్‌ వార్నింగ్‌ ఇస్తుంది మనోహరి.

అరుంధతి ఆత్మ కోసం మనోహరి తంటాలు

ఘోర కనకబడకుండా తాను చాటుగా ఉండి అమ్మును బయటకు పంపిస్తుంది మనోహరి. సరే ఆంటీ అని అమ్ము ఆలోచిస్తూ వెళ్లిపోతుంది. ఏంటి ఘోర అమ్ము ఏంటి అలా అంది. నువ్వు ఉన్నావని అనుమానం వచ్చిందా ఏంటి? అని భయపడుతుంది మనోహరి. అనుమానం రాలేదు కానీ మనసుకు అర్థం అయింది. నేను తనను వశపరుచుకున్నాను కదా? అందుకే ఈ మంత్రించిన పొడి దగ్గరకు రాగానే తనకు అలా అనిపించింది అంటాడు ఘోర.

అరుంధతిని చంపడానికి కూడా నేను ఇంత కష్టపడలేదు ఘోర.. దీన్ని బంధించే సరికి నా ప్రాణం పోయేలా ఉంది అంటుంది మనోహరి. ఇద్దరూ మాట్లాడుకుంటుంటారు. మనోహరి రూంలోంచి బయటకు వచ్చిన అమ్ము స్టెప్స్‌ దగ్గర కూర్చుని ఆలోచిస్తుంది. ఇంతలో భాగీ వస్తుంది. పిన్ను తీసుకురమ్మంటే ఇక్కడ కూర్చున్నావేంటి అని అడుగుతుంది. మనోహరి రూంలో జరిగింది చెప్తుంది అమ్ము. సరే అంజును రెడీ చేశాక అడుగుతానని చెప్తుంది భాగీ.

ఆరుకి గుప్త వార్నింగ్

గార్డెన్‌ లో కూర్చున్న ఆరు.. రణవీర్‌ రావడం చూసి కోప్పడుతుంది. విధి చూశారా? గుప్త గారు ఎన్ని నాటకాలు ఆడుతుందో.. దూరం చేసిన వాళ్లను ఒక్కచోటకు చేరుస్తుంది. ఒకటి చేయాలని చూస్తున్నట్టుంది అంటుంది ఆరు.

గిఫ్ట్‌ బాక్సుతో లోపలికి వెళ్లిన రణవీర్‌ను చూసి అమర్‌ పలకరిస్తాడు. అమర్‌ చేతిలోని అంజు లాకెట్‌ను చూపిస్తుంటే నిర్మల వచ్చి చైన్‌ తీసుకుని వెళ్లిపోతుంది. గుప్త, ఆరును కోప్పడుతాడు. బాలిక నా మాటను పెడచెవిన పెట్టి ఏమి చేయుచున్నావు అని అడుగుతాడు. చెప్పాను కద గుప్త గారు అంజు పాపకు గిఫ్ట్‌ ఇవ్వడానికి అంటుంది ఆరు.

నువ్వు ఎటువంటి పనులు చేయకు అంటున్నాను అంటాడు గుప్త. పోయిన జన్మలో మీరేమైనా హాస్టల్‌ వార్డెన్‌ గా పుట్టారా ఏంటి. ఎందుకు ఎప్పుడు అది చేయకు ఇది చేయకు అంటుంటారు అంటుంది ఆరు. బాలిక నువ్వు నన్ను ఏమి అనుకున్నా పర్వాలేదు. నీకు ఎటువంటి ప్రమాదం ఉందో నీకు తెలియడం లేదు అని గుప్త హెచ్చరిస్తుంటే నీకు తల్లి ప్రేమ తెలియడం లేదు అంటుంది. ఇంతలో గుప్త బాధతో నా భయం నీకు అర్థం కావడం లేదు అంటూ ఎంత చెప్పినా ఆరు వినదు. గిఫ్ట్‌ తీసుకుని వెళ్తాను అని చెప్తుంది.

భాగీ, మనోహరి గొడవ

ఘోర మంత్రించిన పొడిని మనోహరికి ఇస్తాడు. ఆ ఆత్మతో ఈ పొడిని ముట్టుకునేలా చేస్తే.. ఆ ఆత్మ బంధీగా అయిపోతుంది. నేను వెంటనే ఆత్మను తీసుకుని ఇంటి నుంచి వెళ్లిపోతాను అంటాడు. ఆత్మ ఈ పొడిని ముట్టుకునేలా చేస్తాను. నువ్వు బయట ఉండి బంధించలేవా? అంటుంది మనోహరి. అది ఎంత ప్రమాదమో చెప్పాను కదా మనోహరి. అసలే ఆత్మకు స్పర్శ శక్తి కూడా వచ్చింది అంటాడు ఘోర. ఆత్మతో ఎలా అయినా ఉండొచ్చు. కానీ అమర్‌కు తెలిస్తే మనల్ని ఇక్కడే చంపేస్తాడు అని మనోహరి భయపడటంతో ఘోర ధైర్యం చెప్తాడు.

సరే నేను బయట లాక్‌ చేసుకుని వెళ్తాను నువ్వు ఇక్కడే ఉండు అని బయటకు వెళ్లి డోర్‌ లాక్ చేస్తుంది మనోహరి. వెనక నుంచి భాగీ చూస్తూ ఇంట్లో ఏం దాస్తున్నావు మనోహరి అని అడుగుతుంది. మనోహరి షాక్‌ అవుతుంది. ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. మనోహరి వెళ్లిపోతుంది. బర్తుడే పార్టీ అయిన వెంటనే మనోహరి సంగతి చూడాలని అనుకుంటుంది భాగీ.

ప్యారెట్‌ బొమ్మ తయారు చేసిన ఆరు గత సంవత్సరం జరిగిన బర్తుడే వేడుకలను గుర్తు చేసుకుంటుంది. తర్వాత గిఫ్ట్‌ ఇవ్వడానికి ఆరు వెళ్తుంటే గుప్త అడ్డుపడతాడు. ఆరు ఆత్మ ఘోరకు బంధీగా మారుతుందా? రణ్​వీర్​ అంజు తన కూతురని తెలుసుకుంటాడా? అనే విషయాలు తెలియాలంటే ఈరోజు అక్టోబర్​ 15న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్​ తప్పకుండా చూడాల్సిందే!

Whats_app_banner

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024