OTT Spy Action Thriller: యాక్షన్‍తో అదరగొట్టిన సమంత.. వెబ్ సిరీస్ ట్రైలర్ రిలీజ్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

Best Web Hosting Provider In India 2024

అమెరికన్ సిరీస్ సిటాడెల్‍కు ఇండియన్ వెర్షన్‍గా సిటాడెల్: హనీ బన్నీ రూపొందింది. ఈ సిరీస్‌పై చాలా అంచనాలు ఉన్నాయి. స్టార్ హీరోయిన్ సమంత, బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ ఈ సిరీస్‍లో ప్రధాన పాత్రలు పోషించారు. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ సిరీస్‍కు రాజ్ & డీకే దర్శకత్వం వహించారు. ది ఫ్యామిలీ మ్యాన్, ఫర్జీ లాంటి సక్సెస్ ఫుల్ సిరీస్‍లను తీసిన ఆ దర్శకద్వయం తెరకెక్కించటంతో సిటాడెల్: హనీబన్నీపై మరింత ఆసక్తి నెలకొంది. ఈ సిరీస్ ట్రైలర్ నేడు (అక్టోబర్ 15) విడుదలైంది.

ట్రైలర్ ఇలా..

సినిమాల్లో యాక్టర్ అవాలనుకునే హనీ (సమంత), స్టంట్ మ్యాన్ బన్నీ (వరుణ్ ధావన్)తో సిటాడెల్: హనీబన్నీ ట్రైలర్ ముందుకు సాగుతుంది. స్పై ఏజెన్సీలో ఏజెంట్‍గా పని చేసేందుకు హనీని బన్నీ ఒప్పిస్తాడు. వీరిద్దరూ ఏ డేంజరస్ మిషన్‍పై పోరాడుతుంటారు. విలన్లను ఎదుర్కొంటారు. ఇలా ట్రైలర్ మొత్తం యాక్షన్ ప్యాక్డ్‌గా సాగింది.

ఈ ట్రైలర్‌లో సమంత యాక్షన్‍తో అదరగొట్టారు. స్పై ఏజెంట్‍గా ఆమె లుక్ కూడా బాగుంది. గన్‍లతో యాక్షన్‍ను చాలా ఈజ్‍తో చేసినట్టు అనిపించింది. వరుణ్ ధావన్ కూడా మెప్పించారు. డైరెక్టర్లు రాజ్ & డీకే మార్క్ ఈ ట్రైలర్‌లో స్పష్టంగా కనిపించింది. ట్రైలర్‌లో యాక్షన్. టేకింగ్, డ్రామా ఆకట్టుకున్నాయి. ఓ రెండు కామెడీ డైలాగ్స్ కూడా ఉన్నాయి. మొత్తంగా సిటాడెల్: హనీ బన్నీ ట్రైలర్ అంచనాలకు తగ్గట్టే ఉంది.

సిటాడెల్: హనీ బన్నీ సిరీస్‍లో సమంత, వరుణ్‍తో పాటు కేకే మీనన్, సిమ్రన్ బగ్గా, ఇమ్మా క్యానింగ్, సికిందర్ ఖేర్, షాకిబ్ సలీం, సోహం మజుందార్ కీలకపాత్రలు పోషించారు. ఈ సిరీస్‍కు అమన్ పంత్ సంగీతం అందించారు.

స్ట్రీమింగ్ డేట్

సిటాడెల్: హనీ బన్నీ వెబ్ సిరీస్ నవంబర్ 7వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. హిందీతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, ఇంగ్లిష్ భాషల్లో ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి వస్తుంది.

సిటాడెల్: హనీ బన్నీ వెబ్ సిరీస్‍ 1990 బ్యాక్‍డ్రాప్‍లో రూపొందని తెలుస్తోంది. హైవోల్టేజ్ యాక్షన్‍తో పాటు లవ్ స్టోరీ కూడా ఈ సిరీస్‍లో ఉంటుంది. అమెరికన్ సిటాడెల్ యూనివర్స్‌లో ఇండియన్ వెర్షన్‍గా ఈ సిరీస్‍ వస్తోంది. భారత్‍లోనూ సిటాడెల్ అదరగొడుతుందనే అంచనాలు ఉన్నాయి.

సిటాడెల్: హనీబన్నీ సిరీస్‍ను ఆంటోనీ రూసో, జో రూసో, మైక్ లోరోకా, ఏంజెరా రూసో, స్కాట్ నేమ్స్, డేవిడ్ వెల్, రాజ్ & డీకే సంయుక్తంగా నిర్మించారు. జోహాన్ హర్లీన్ సినిమాటోగ్రఫీ చేసిన ఈ సిరీస్‍కు సుమీత్ కొటియన్ ఎడిటింగ్ చేశారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో నవంబర్ 7 నుంచి ఈ హైవోల్టేయ్ స్పై యాక్షన్ సిరీస్‍ను చూడొచ్చు.

మయోసైసిట్ చికిత్స వల్ల సమంత సుమారు ఏడాది కాలంగా నటనకు దూరంగా ఉంటున్నారు. సిటాడెల్ షూటింగ్‍ను ఆమె గతంలోనే పూర్తి చేశారు. మళ్లీ యాక్టింగ్ మొదలుపెట్టేందుకు సమంత రెడీ అయ్యారు. రాజ్ & డీకే క్రియేటర్లుగా రూపొందనున్న రక్త బ్రహ్మాండ్ సిరీస్‍లో సమంత ప్రధాన పాత్ర పోషించనున్నారు. ఈ సిరీస్‍లో ఆదిత్య రాయ్ కపూర్ కూడా లీడ్ రోల్ చేయనున్నారు. ‘మా ఇంటి బంగారం’ అనే మూవీని కూడా సమంత ఇప్పటికే ప్రకటించారు. ఈ చిత్రంలో ప్రియదర్శి నటిస్తారని తెలుస్తోంది.

Whats_app_banner

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024