Kooki OTT: 16 ఏళ్ల బాలికపై అత్యాచారం- ఓటీటీలోకి వచ్చేసిన థ్రిల్లర్ డ్రామా- స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Best Web Hosting Provider In India 2024

Kooki OTT Release: ఓటీటీలో ఎప్పటికప్పుడు డిఫరెంట్ కంటెంట్ సినిమాలు, వెబ్ సిరీసులు వస్తుంటాయన్న విషయం తెలిసిందే. హారర్, క్రైమ్, సస్పెన్స్, కామెడీ, రొమాంటిక్, బోల్డ్ కాన్సెప్ట్ చిత్రాలతోపాటు కొన్ని మెసేజ్ ఒరియెంటెడ్ చిత్రాలు సైతం ప్రేక్షకులను అలరిస్తుంటాయి.

సినిమాటిక్ లిబర్టీ

నేటి సమాజంలో జరుగుతున్న సంఘటనలు, అత్యాచారాలు, హత్యల నేపథ్యంలోనూ ఓటీటీ సినిమాలను, వెబ్ సిరీసులను తెరకెక్కిస్తున్నారు దర్శకనిర్మాతలు. వాటిలో కొన్ని మాత్రమే ఆకట్టుకుంటున్నాయి. అయితే, నిజ జీవిత సంఘటనల ఆధారంగా చిత్రీకరించిన సినిమాల్లో ఎక్కువగా డ్రామా ఉంటుంది. వాటిలో సినిమాటిక్ లిబర్టికి చాలా తక్కువ స్కోప్ ఉంటుంది.

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో

అలాంటి చిత్రాలు కమర్షియల్‌గా సక్సెస్ సాధించకపోయినప్పటికీ టాక్ పరంగా మాత్రం మంచి అప్లాజ్ అందుకుంటాయి. అలాంటి థ్రిల్లర్ డ్రామా సినిమానే కూకి. హిందీ థ్రిల్లర్ డ్రామాగా తెరకెక్కిన కూకి సినిమాను ముందుగా 2023లో బీవీఎఫ్ఎఫ్‌లో ప్రదర్శించారు. ఆ తర్వాత 2024 మేలో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించారు. ఇందులో కూకి చిత్రానికి మంచి ప్రశంసలు వచ్చాయి.

కూకి పాత్రలు

ఇక కూకి సినిమాకు ప్రణబ్ జే దేఖా దర్శకత్వం వహించారు. అలాగే, ఈ చిత్రాన్ని నిరీ మీడియా ఓపిసి ప్రైవేట్ లిమిటెడ్ నిర్మించింది. కూకి చిత్రంలో కూకీగా రితీషా ఖౌండ్, ధనంజయ్ మిశ్రాగా రాజేష్ తైలాంగ్,

సుమన్ మిశ్రాగా రినా రాణి, ఎస్పీ మందిరా సింగ్‌గా దీపన్నిత శర్మ, సప్త్రిషిగా బోధిసత్వ శర్మ, నవనీతగా దేవోలీనా భట్టాచార్జీ, డాక్టర్ ప్రియదర్శిని పాటోర్‌గా రితూ శివపురి కీలక పాత్రలు పోషించారు.

16 ఏళ్ల బాలిక చుట్టూ

ఈ సినిమా కూకి అనే 16 ఏళ్ల బాలిక చుట్టూ సాగుతుంది. స్కూల్‌లో తన ఫ్రెండ్స్‌తో ఎంతో హాయిగా జీవితం గడుపుతుంటుంది. ఈ క్రమంలోనే తనకు సప్తరిషి అనే అబ్బాయి పరిచయం అవుతాడు. తొలి చూపులోనే అతనితో ప్రేమలో పడిపోతుంది. అతను కూడా కూకిని లవ్ చేస్తాడు. ఇద్దరు ఒకరినొకరు చెప్పుకోకుండా సైలెంట్‌గా లవ్ చేసుకుంటారు.

మానసిక సంఘర్షణ

ఇంతలో సడెన్‌గా కూకికి అత్యాచారానికి గురి అవుతుంది. కూకిని అత్యాచారం చేసింది ఎవరు? వారిని పోలీసులు పట్టుకున్నారా? నిందితులకు శిక్ష పడిందా? ఆ క్రమంలో కూకి ఎదుర్కున్న మానసిక సంఘర్షణ ఏంటీ? తను ఎలాంటి పరిస్థితులను ఫేస్ చేసింది? ఇలాంటి ఘటన జరిగినప్పుడు మైనర్ బాలిక ఎలా రియాక్ట్ అవుతుంది? అనే ఎమోషనల్, థ్రిల్లర్‌ డ్రామాగా కూకిని రూపొందించారు.

చట్టాలను ప్రశ్నించేలా

రేప్ అనేది అతిపెద్ద నేరంగా ఎందుకు పరిగణించరు. ఒకవేళ నన్ను చంపేస్తే అప్పుడు పరిగణిస్తారా” అని మూవీలో బాధితురాలు చెప్పే డైలాగ్ ఆలోచించేలా చేస్తూనే ప్రస్తుతం సమాజాన్ని, చట్టాలను ప్రశ్నించినట్లుగా ఉంది. ఇకపోతే సినిమాలు ఎలా ఉంటాయో రేటింగ్ ద్వారా చెప్పే ఐఎమ్‌డీబీ సంస్థ కూకి మూవీకి మొన్నటివరకు 10కి 9.2 రేటింగ్ ఇచ్చింది.

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో

కానీ, ప్రస్తుతం కూకి మూవీకి (అక్టోబర్ 15 నాటికి) 6.2తో టాప్ రేటింగ్‌లోనే ఉంది. ఒకవేళ ఈ సినిమాను ఎక్కువమంది చూసి తమ రేటింగ్ ఇస్తే అది పెరిగే అవకాశం ఉంది. ఇక అమెజాన్ ప్రైమ్‌లో కూకి ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. కేవలం హిందీ భాషలో, ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌లో మాత్రమే కూకి ఓటీటీలో అందుబాటులో ఉంది.

Whats_app_banner

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024