OTT Comedy Movie: ఓటీటీలోకి వస్తున్న ఇంట్రెస్టింగ్ కన్నడ కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడ?

Best Web Hosting Provider In India 2024

కన్నడ నటుడు ప్రమోద్ శెట్టి ప్రధాన పాత్ర పోషించిన ‘లాంఫింగ్ బుద్ధ’ సినిమా ఆగస్టు 30వ తేదీన థియేటర్లలో రిలీజైంది. ఈ కామెడీ డ్రామా మూవీకి పాజిటివ్ టాక్ వచ్చింది. కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి ఈ చిత్రాన్ని నిర్మించటంతో మంచి బజ్ ఏర్పడింది. అందుకు తగ్గట్టే ఈ మూవీ ప్రేక్షకులను మెప్పించింది. లాఫింగ్ బుద్ధ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది.

స్ట్రీమింగ్ డేట్ ఇదే!

లాఫింగ్ బుద్ధ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ దగ్గర ఉన్నాయి. ఈ చిత్రాన్ని అక్టోబర్ 18వ తేదీన ప్రైమ్ వీడియో స్ట్రీమింగ్‍కు తీసుకురానున్నట్టు సమాచారం బయటికి వచ్చింది. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ముందుగా ప్రైమ్ వీడియోలో ఈ మూవీ ఓవర్సీస్‍లో వస్తుందా.. లేకపోతే ఇండియాలో కూడా ఒకేసారి ఈ మూవీ స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి వస్తుందా అనేది చూడాలి.

లాఫింగ్ బుద్ధ చిత్రానికి రిలీజ్‍కు ముందు స్ట్రీమింగ్, శాటిలైట్ హక్కులను అమ్ముడుపోలేదని రిషబ్ శెట్టి చెప్పారు. ఇటీవలి కాలంలో కన్నడ చిత్రాలకు విడుదలకు ముందు ఓటీటీ డీల్స్ జరగడం లేదు. లాఫింగ్ బుద్ధకు కూడా ఇవే ఇబ్బందులు తలెత్తాయి. అయితే, ఈ మూవీ హక్కులను ఎట్టకేలకు అమెజాన్ ప్రైమ్ వీడియో ప్లాట్‍ఫామ్ సొంతం చేసుకుంది.

లాఫింగ్ బుద్ధ సినిమాకు భరత్ రాజ్ దర్శకత్వం వహించారు. ఉద్యోగం కాపాడుకోవాలంటే ఓ పోలీస్ తప్పక బరువు తగ్గాల్సిన రావడం చుట్టూ ఈ మూవీ స్టోరీ సాగుతుంది. కామెడీ ప్రధానంగా ఈ మూవీ సాగుతుంది. ప్రమోద్ శెట్టితో పాటు తేజూ బేలావాడి, సుందర్ రాజ్, దిగ్‍నాథ్, ఎస్‍కే ఉమేశ్ ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషించారు.

లాఫింగ్ బుద్ధ మూవీకి విష్ణు విజయ్ సంగీతం అందించారు. రిషబ్ శెట్టి ఫిల్మ్స్ పతాకంపై రిషబ్ ప్రొడ్యూజ్ చేశారు. ఈ మూవీలో ముందుగా రిషబ్ నటించాలని భావించారు. అయితే, కాంతారలో బిజీగా ఉండటంతో అది సాధ్యం కాలేదు. లాఫింగ్ బుద్ధ చిత్రానికి చంద్రశేఖర్ సినిమాటోగ్రఫీ చేయగా.. కేఎం ప్రకాశ్ ఎడిటింగ్ చేశారు.

లాఫింగ్ బుద్ధ స్టోరీలైన్

పోలీస్ కానిస్టేబుల్ గోవర్దన్ (ప్రమోద్ శెట్టి).. ఆహారం అంటే ఎంతో ఇష్టం. ఎక్కువగా తింటుంటాడు. జైలులో నిందితులకు కూడా ఆహారం పెట్టి.. ప్రేమలో మాట్లాడుతూ నిజాలు రాబడుతుంటాడు. కేసులను పరిష్కరిస్తుంటాడు. అయితే, ఆహారం ఎక్కువగా తినే గోవర్దన్ బరువు బాగా పెరిగిపోతాడు. ఊబకాయంతో ఉంటాడు. దీంతో మూడు నెలల్లో బరువు తగ్గకపోతే ఉద్యోగం నుంచి డిస్మిస్ చేస్తామని గోవర్దన్‍ను ఉన్నతాధికారులు హెచ్చరిస్తారు. ఆ తర్వాత ఏం జరిగింది? ఉద్యోగాన్ని గోవర్దన్ కాపాడుకున్నాడా? ఏం చేశాడు అనే విషయాలు లాఫింగ్ బుద్ధ చిత్రంలో ఉంటాయి.

కాగా, అక్టోబర్ 18న అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్నేక్స్ ఆండ్ లాడర్స్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్‍కు రానుంది. తమిళంలో రూపొందిన ఈ సిరీస్ తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లోనూ అందుబాటులోకి రానుంది. స్టార్ డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజ్.. ఈ సిరీస్‍కు క్రియేటివ్ ప్రొడ్యూజర్‌గా వ్యవహరించారు. ఈ సిరీస్‍లో నవీన్ చంద్ర ప్రధాన పాత్ర పోషించారు.

Whats_app_banner

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024