OG Movie: పవన్ కల్యాణ్ ‘ఓజీ’ షూటింగ్‍పై అఫీషియల్ అప్‍డేట్ ఇచ్చిన మూవీ టీమ్

Best Web Hosting Provider In India 2024

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా చేస్తున్న ఓజీ సినిమాపై క్రేజ్ నెక్స్ట్ లెవెల్‍లో ఉంది. సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు రావడంతో జనసేనాని పవన్ రాజకీయాల్లో బిజీ కావటంతో ఓజీ షూటింగ్ నిలిచింది. ఆ తర్వాత డిప్యూటీ సీఎంగా ఆయన బాధ్యతలు చేపట్టారు. దీంతో ఓజీ మళ్లీ ఎప్పుడు పట్టాలెక్కుతుందా అని ఫ్యాన్స్ ఆసక్తి ఎదురుచూశారు. అయితే, ఇప్పుడు ఈ మూవీ నుంచి అఫీషియల్ అప్‍డేట్ వచ్చేసింది.

షూటింగ్ మళ్లీ షురూ

ఓజీ సినిమా పునఃప్రారంభం అయింది. ఈ విషయాన్ని మూవీ టీమ్ నేడు (అక్టోబర్ 15) అధికారికంగా వెల్లడించింది. షూటింగ్ లొకేషన్‍లో యూనిట్‍తో డైరెక్టర్ సుజీత్ మాట్లాడుతున్న ఓ డార్క్ ఫొటోను పోస్ట్ చేసి ఈ విషయాన్ని ప్రకటించింది. షూటింగ్ మళ్లీ ప్రారంభం అయిందని కన్ఫర్మ్ చేసింది.

మళ్లీ ఓజీ ఫీవర్‌లో అడుగుపెట్టామని ఈ మూవీని నిర్మిస్తున్న డీవీవీ ఎంటర్‌టైన్‍మెంట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. “అన్ని సిలిండర్లను ఫైర్ చేసి మ్యాడ్‍నెస్‍ను సృష్టించేందుకు మేం మళ్లీ ఓజీ ఫీవర్‌లోకి అడుగుపెట్టేశాం” అని ట్వీట్ చేసింది.

త్వరలో పవన్ కూడా..

పవన్ కల్యాణ్ ముందుగా హరిహర వీరమల్లు షూటింగ్‍ను ఫినిష్ చేసేందుకు నిర్ణయించారు. ఇప్పటికే చిత్రీకరణలో పాల్గొంటున్నారు. అయితే, ప్రస్తుతం పవన్ కల్యాణ్ లేకుండానే ఓజీ షూటింగ్ షురూ అయింది. మరికొన్ని రోజుల్లోనే పవన్.. ఓజీ షూటింగ్‍లో జాయిన్ అవుతారని తెలుస్తోంది.

ఓజీ షూటింగ్ సెట్‍కు మళ్లీ వెళ్లినట్టు సినిమాటోగ్రాఫర్ రవి కే చంద్రన్ ఇన్‍స్టాగ్రామ్‍లో ఓ ఫొటో షేర్ చేశారు. అయితే, షూటింగ్ పునఃప్రారంభమైనట్టు మూవీ టీమ్ నేటి రాత్రి అధికారికంగా వెల్లడించింది.

సంతోషంలో పవన్ ఫ్యాన్స్

ఓజీ షూటింగ్ మళ్లీ మొదలైందనే గుడ్‍న్యూస్‍తో పవన్ కల్యాణ్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రం కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. పవన్ ఏ కార్యక్రమంలో పాల్గొన్నా ఓజీ.. ఓజీ అనే అరుపులే వినిపిస్తున్నాయి. ఒక్క గ్లింప్స్‌తోనే ఈ మూవీకి ఎనలేని క్రేజ్ వచ్చేసింది. ఈ మూవీ షూటింగ్ మళ్లీ ఎప్పుడు మొదలవుతుందా అని అభిమానులు ఎదురుచూశారు. మొత్తానికి చిత్రీకరణ పునఃప్రారంభమైందనే విషయంతో ఖుషి అవుతున్నారు.

ఓజీ సినిమాలో పవన్ కల్యాణ్ సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్‍గా నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మి విలన్‍గా చేస్తున్నారు. అర్జున్ దాస్, శ్రీయారెడ్డి, హరీశ్ ఉత్తమన్, అభిమన్యు సింగ్, శుభలేఖ సుధాకర్ ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీకి థమన్ సంగీతం అందిస్తున్నారు.

ఓజీ చిత్రాన్ని గ్యాంగ్‍స్టర్స్ యాక్షన్ మూవీగా దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్నారు. గతేడాది సెప్టెంబర్‌లో వచ్చిన హంగ్రీచీతా గ్లింప్స్ అదిరిపోయింది. పవన్ కల్యాణ్ యాక్షన్, స్వాగ్ సినీ ప్రేక్షకులకు తెగనచ్చేశాయి. దీంతో ఓజీకి క్రేజ్ విపరీతంగా పెరిగిపోయాయి. డీవీవీ ఎంటర్‌టైన్‍మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని ప్రొడ్యూజ్ చేస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్‍లో ఈ చిత్రం రిలీజ్ కానుంది.

Whats_app_banner

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024