Best Web Hosting Provider In India 2024
బిగ్‍బాస్ తెలుగు 8వ సీజన్ ఆరో వారంలో నామినేషన్ల తంతు మంగళవారమైన నేడు (అక్టోబర్ 15) కూడా జరిగింది. రెండో రోజు కూడా నామినేషన్ల ప్రక్రియ హాట్‍హాట్‍గా సాగింది. కొందరు కంటెస్టెంట్ల మధ్య మాటల యుద్ధం తీవ్రంగా జరిగింది. ముఖ్యంగా అవినాశ్, పృథ్విరాజ్ గట్టిగట్టిగా అరుచుకున్నారు. ఓ దశలో ఒకరిపై ఒకరు దూసుకొచ్చారు. దీంతో టెన్షన్ రేగింది. ఇక ఈ వారంలో తొమ్మిది మంది నామినేషన్లలో ఉన్నారు. ఆ వివరాలివే..
హ్యాట్ తీసుకునే క్రమంలో యష్మి కింద పడ్డారు. కన్నీరు పెట్టుకున్నారు. చాలా కోపం వస్తోందని ప్రేరణను హత్తుకున్నారు. కాలు విరిగినా పర్లేదు అని.. ఏది కరెక్టో అటే నిలబడతానని యష్మి చెప్పారు.
టేస్టీ తేజను నబీల్ నామినేట్ చేశారు. యష్మిని తేజ నామినేట్ చేశారు. ప్రేరణను నామినేట్ చేస్తాననడంపై ఫైర్ అయ్యారు. ఫ్రెండ్ ముసుగు నుంచి బయటికి వచ్చి ప్రేరణను నామినేట్ చేయాలని చెప్పారు. తన ఆట తన ఇష్టమని యష్మి అన్నారు. నబీల్, గౌతమ్ కృష్ణ మధ్య కూడా వాగ్వాదం గట్టిగా జరిగింది. ఆ తర్వాత కొందరు కంటెస్టెంట్లు కూడా నామినేషన్ పాయింట్లు చెప్పారు.
అవినాశ్ vs పృథ్వి
అవినాశ్‍ను పృథ్విరాజ్ నామినేట్ చేశారు. గత వారం తనను నామినేట్ చేసినందుకు ఇప్పుడు చేస్తున్నానని అన్నారు. రెండు టాస్కుల్లో తప్ప ఎక్కడా కనిపించలేదని అప్పుడు అవినాశ్ చెప్పారని, కానీ 100లో 70 శాతం టాస్కుల్లో తానే ఉన్నానని పృథ్వి చెప్పారు. బిగ్‍బాస్ చూడకుండా తనను నామినేట్ చేశావని అవినాశ్‍ను పృథ్వి క్వశ్చన్ చేశారు.
మీ వైఫ్ బిగ్‍బాస్‍కు రావాల్సింది.. అవినాశ్ ఫైర్
తాను అన్ని ఎపిసోడ్లు చూడలేదని హోస్ట్ నాగార్జునతో కూడా చెప్పానని అవినాశ్ చెప్పారు. దీంతో ప్రోమోలు చూసి నామినేట్ చేశావని పృథ్వి అన్నారు. దీంతో తన వైఫ్ బిగ్‍బాస్ ఎపిసోడ్లు చూసి తనకు పాయింట్స్ చెప్పారని, దాని ప్రకారం పృథ్విని నామినేట్ చేశారనని అవినాశ్ అన్నారు. దీంతో “మీ వైఫ్ చూస్తే.. మీ వైఫ్ రావాల్సింది బిగ్‍బాస్‍కు. మీరెందుకు వచ్చారు” అని పృథ్వి వెటకారంగా ఉన్నారు. దీంతో అవినాశ్ సీరియస్ అయ్యారు. వైఫ్ టాపిక్ తీయకు అని కోపంగా అన్నారు. “నువ్వెవరు చెప్పేందుకు.. నా వైఫ్ రాదు” అని అవినాశ్ అరిచారు. దీంతో రాకున్నా మంచిదే అని పృథ్వి అన్నారు.
తాను షూటింగ్‍ల్లో బిజీగా ఉన్నందుకు ఎపిసోడ్లు చూడలేదని అవినాశ్ అన్నారు. అయితే, బిగ్‍బాస్‍లోకి వచ్చేందుకు షూటింగ్‍లు లేవా అంటూ పృథ్వి వెటకారంగా మాట్లాడారు. వేరే వాళ్లను అడిగి హౌస్‍లోకి వచ్చి నామినేట్ చేశావని అవినాశ్‍తో పృథ్వి చెప్పారు. అయితే, తాను నామినేషన్‍ను అంగీకరించనని అవినాశ్ అన్నారు.
‘రా అనకు’
గంగవ్వ కూడా అదే పాయింట్ చెప్పారని అవినాశ్ అన్నారు. ఈ క్రమంలో “గంగవ్వ అని ఎందుకు చెప్తావ్ రా” అని పృథ్వి నోరు జారారు. దీంతో “రా అనకు” అంటూ అవినాశ్ కోప్పడ్డారు. తాను అంటానంటూ పృథ్వి కూడా అరిచారు. ఇద్దరూ ఒకరి వైపు ఒకరు దూసుకొచ్చారు. దీంతో టెన్షన్ రేగింది. మర్యాదగా మాట్లాడాలని అవినాశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీజన్ 7లో వచ్చావని అవినాశ్ గురించి పృథ్వి అన్నారు. దీంతో తాను ఏ సీజన్‍లో ఆడానో కూడా తెలియకుండా ఎందుకు మాట్లాడుతున్నావని అవినాశ్ వెటకారంగా అన్నారు.
ఇది నీ సంస్కారం
విష్ణుప్రియను నయని పావని నామనేట్ చేశారు. విష్ణు ఇతరులతో పోలిస్తే ఆట సరిగా ఆడడం లేదని అన్నారు. మరోసారి అవినాశ్, పృథ్వి మధ్య తగాదా జరిగింది. హౌస్‍లో పృథ్వి ఏం చేయలేదంటూ అవినాశ్ అన్నారు. వీడు అని పృథ్వి అనడంతో అవినాశ్ మళ్లీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఇది నీ సంస్కారం’ అని అవినాశ్ అన్నారు. ఇద్దరూ గట్టిగట్టిగా అరుచుకున్నారు.
నామినేషన్లలో 9 మంది
బిగ్‍బాస్ 8 ఆరో వారం నామినేషన్లలో పృథ్విరాజ్, నిఖిల్, మణికంఠ, యష్మి గౌడ, నబీల్, ప్రేరణ, గౌతమ్ కృష్ణ, టేస్టీ తేజ, హరితేజ నిలిచారు. ఓజీ క్లాన్ నుంచి ఆరుగురు, రాయల్స్ క్లాన్ నుంచి ముగ్గురు నామినేషన్లలో నిలిచారు.