Moong Cheela: పెసరపప్పుతో ఇలా చీలాలు చేయండి, సింపుల్ లంచ్ బాక్స్ రెసిపీ కూడా

Best Web Hosting Provider In India 2024

పెసరపప్పుతో చేసే చీలా పోషకభరితం అయిన అల్పాహారం. వీటి తయారీకి చాలా కూరగాయలు వాడతాం. దీంతో పాటూ పెసరపప్పు వల్ల అనేక పోషకాలూ దొరుకుతాయి. కేలరీలు తక్కువుండే ఈ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ తయారీ ఎలాగో చూసేయండి. దీన్ని లంచ్ బాక్స్ లోకి పెట్టిచ్చినా పిల్లలు ఇష్టంగా తినేస్తారు.

పెసరపప్పు చీలా తయారీకి కావాల్సినవి:

1 కప్పు పెసరపప్పు

1 కప్పు సన్నగా తరిగిన క్యారెట్ – 

1 సన్నగా తరిగిన క్యాప్సికమ్

సన్నగా తరిగిన క్యాబేజీ – 

2 సన్నగా తరిగిన పచ్చిమిర్చి – 

అర టీస్పూను జీలకర్ర

రుచికి తగినంత ఉప్పు

టీ స్పూను పసుపు

1 తరిగిన టొమాటో 

1 తరిగిన ఉల్లిపాయ

1 టీస్పూన్ కారం

గుప్పెడు సన్నగా తరిగిన కొత్తిమీర

పెసరపప్పు చీలా తయారీ విధానం:

  1. పెసర పప్పు చీలా తయారు చేయాలంటే ముందుగా పెసరపప్పును బాగా కడిగి  ఒక పాత్రలో నీళ్లు పోసి 4-5 గంటలు నానబెట్టాలి. 
  2. పప్పు బాగా నానిన తర్వాత నీళ్లు వంపేసి మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. అవసరం అనుకుంటే కొద్దిగా నీళ్లు పోసుకుని మెత్తగా మిక్సీ పట్టండి. అయితే మరీ పలుచగా అవ్వకుండా చూసుకోండి.
  3.  ఇప్పుడు ముద్దను ఒక పెద్ద పాత్రలో తీసుకుని అందులో పసుపు, జీలకర్ర, చిటికెడు ఇంగువ, పచ్చిమిర్చి తరుగు, ఉప్పు, ఎండుమిర్చి పొడి, సన్నగా తరిగిన కూరగాయలు, కొత్తిమీర వేసి కలపాలి. వీటన్నింటినీ నీళ్లు పోసి బాగా కలపుకోండి. 
  4. ఇప్పుడు పెనం పెట్టుకుని నూనె లేదా నెయ్యి రాసి వేడి చేయాలి. ఆ తర్వాత పెసరపప్పు పిండి గరిటెడు వేసి బాగా స్ప్రెడ్ చేయాలి. 
  5. మీడియం మంట మీద రెండు వైపుల నుండి బంగారు గోధుమ రంగులోకి మారే వరకు కాల్చుకోవాలి. కాస్త క్రిస్పీగా అయ్యాక ఒక ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకోవమే. పెసరపప్పు చీలా రెడీ.
  6. మీకిష్టం ఉంటే ఈ చీలా మీద పన్నీర్ తురుము, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు మరిన్ని వేసుకుని రోల్ చేసి సర్వ్ చేసుకోవచ్చు.
Whats_app_banner
Source / Credits

Best Web Hosting Provider In India 2024