OTT Telugu Thriller Movie: ఓటీటీలోకి పది నెలల తర్వాత స్ట్రీమింగ్‌కు వచ్చిన తెలుగు థ్రిల్లర్ మూవీ.. కరెన్సీ మాట్లాడితే..

Best Web Hosting Provider In India 2024

OTT Telugu Thriller Movie: తెలుగులో వచ్చిన ఓ ఆంథాలజీ థ్రిల్లర్ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి అడుగుపెట్టింది. గతేడాది డిసెంబర్ లో రిలీజైన కరెన్సీ నగర్ అనే ఈ సినిమాకు ఐఎండీబీలో మంచి రేటింగ్ ఉంది. పది నెలల తర్వాత డిజిటల్ ప్లాట్‌ఫామ్ పైకి వచ్చినా.. ఇప్పుడు కూడా ఫ్రీగా కాకుండా రెంట్ విధానంలోనే అందుబాటులో ఉంది.

కరెన్సీ నగర్ ఓటీటీ స్ట్రీమింగ్

లో బడ్జెట్.. పెద్దగా పేరు తెలియని నటులు.. అయినా కరెన్సీ నగర్ సినిమాకు ఐఎండీబీలో ఏకంగా 9 రేటింగ్ ఉంది. 2 వేలకుపైగా రివ్యూలు నమోదైనా ఈ స్థాయి రేటింగ్ రావడం నిజంగా విశేషమే.

అలాంటి మూవీ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి వచ్చింది. అయితే సబ్‌స్క్రైబర్లు అందరికీ కాకుండా రూ.99 రెంట్ చెల్లించిన వారికి మాత్రమే ఈ సినిమా చూసే అవకాశం ఉంది. మంగళవారం (అక్టోబర్ 15) నుంచే ఈ సినిమా డిజిటల్ ప్లాట్‌ఫామ్ పైకి వచ్చింది.

అసలు కరెన్సీ నగర్ కథేంటంటే?

కరెన్సీ నగర్ మూవీ గతేడాది డిసెంబర్ 29న థియేటర్లలో రిలీజైంది. చాలా మందికి అసలు ఈ మూవీ వచ్చినట్లే తెలియదు. కానీ చూసిన వాళ్ల నుంచి మాత్రం మంచి రెస్పాన్స్ వచ్చింది.

డబ్బు అవసరమైన ఓ వ్యక్తితో బంగారం ఉన్న ఓ పెట్టె మాట్లాడితే ఎలా ఉంటుంది? అతనికి ఆ పెట్టె మూడు కథలు చెప్పడం, అవి విన్న ఆ వ్యక్తి ఎలా రియాక్టయ్యాడు? అతనికి కావాల్సిన డబ్బు దొరికిందా లేదా.. ఇలా ఓ భిన్నమైన కాన్సెప్ట్ తో ఈ మూవీ వచ్చింది.

వెన్నెల కుమార్ పోతేపల్లి ఈ మూవీని డైరెక్ట్ చేశాడు. అతనికి ఇదే తొలి సినిమా. అయినా సరే ఎంతో అనుభవం ఉన్న డైరెక్టర్ లాగే ఈ భిన్నమైన కథను హ్యాండిల్ చేశాడు. ఈ కరెన్సీ నగర్ సినిమాలో యడ్లపల్లి మహేష్, స్పందన సోమన, కేశవ, రాజశేఖర్, చాందినీ, సుదర్శన్ లాంటి వాళ్లు నటించారు. సిద్ధార్థ్ సదాశివుని మ్యూజిక్ అందించాడు.

కరెన్సీ నగర్ ఓ ఆంథాలజీ థ్రిల్లర్ మూవీ. అంటే వేర్వేరు కథల సమాహారం. వీటిలోనే ప్రేమ, దొంగతనం, హత్య.. ఇలా ఊహించని మలుపులతో మూవీ సాగిపోతుంది. థియేటర్లలో అంతగా రెస్పాన్స్ రాని ఈ సినిమాకు ఓటీటీలో మాత్రం మంచి ఆదరణ దక్కే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా ఫ్రీగా ఎప్పుడు అందుబాటులోకి రానుందన్నది మాత్రం ఇంకా తెలియలేదు.

Whats_app_banner

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024